నోరు గురించి దైవప్రవక్త(స.అ) హదీసులు

ఆది, 07/18/2021 - 07:59

నోరు మరియు మాట్లాడే పద్ధతి గురించి దైవప్రవక్త(స.అ) కొన్ని హదీసుల వివరణ...

నోరు గురించి దైవప్రవక్త(స.అ) హదీసులు

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: అల్లాహ్ మరియు ప్రళయదినంను విశ్వసించేవారు మాట్లాడితే మంచి మాట్లాడాలి లేదా మౌనంగా ఉండాలి.[1]
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: మనిషి అందం అతడి మాటను బట్టి ఉంటుంది.[2]
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: విశ్వాసి నాలుక అతడి హృదయం వెనక ఉంటుంది, మాట్లాడాలనుకున్నప్పుడు ముందు దాని గురించి ఆలోచిస్తాడు ఆ తరువాత మాట్లాడతాడు. కాని కపటవర్తనుడి నాలుక హృదయం ముందు ఉంటుంది మాట్లాడనుకుంటే చాలు ఆలోచించకుండానే మాట్లాడడం మొదలు పెడతాడు.[3]
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: సలామ్ చేయడాన్ని రీతిగా మార్చు దాంతో నీ ఇంట్లో ఆశీర్వాదం, మంగళం, శుభం పెరుగుతుంది.[4]
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: క్షమించమని చెప్పెంత వరకు తీసుకొచ్చే పనులకు దూరంగా ఉండు.[5]
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: అందం సత్యం పలకడంలో ఉంది మరియు పరిపూర్ణం మంచి ప్రవర్తనలో ఉంది.[6]

రిఫరెన్స్
1. కాఫీ(తా-అల్ ఇస్లామియహ్), భాగ2, పేజీ667.
2. జామివుల్ అహాదీస్ లిల్ ఖుమీ, పేజీ70.
3. తంబీహుల్ ఖవాతిర్, భాగం1, పేజీ106.
4. ఖిసాలె సదూఖ్, పేజీ181.
5. అమాలి ఎ సదూఖ్, పేజీ323.
6. కన్జుల్ ఉమ్మాల్, ముత్తఖీయె హిందీ, హదీస్28776.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 22