ఒహద్ యుద్ధం

ఆది, 08/01/2021 - 08:55

బద్ర్ యుద్ధంలో అపజయం వల్ల నిరాశకు గురి అయిన ఖురైషీయులు, యుద్ధంలో కోల్పోయినవారి ప్రతికార చర్యగా ఒహద్ యుద్ధానికి సిద్ధమయ్యారు....

ఒహద్ యుద్ధం

బద్ర్ యుద్ధంలో అపజయం వల్ల నిరాశకు గురి అయిన ఖురైషీయులు, యుద్ధంలో కోల్పోయిన వారి పగను తీర్చుకోవడానికి ఇంకా ఎక్కువ బలగంతో పూర్తి నాణ్యత గల సైన్యంతో మదీనహ్ పై దాడి చేయాలనుకున్నారు.

దైవప్రవక్త(స.అ)కు వారి గూడాచారులు ఖురైషీయుల ఆలోచనల గురించి తెలియపరిచారు. దైవప్రవక్త(స.అ) శత్రువులను ఎదుర్కోవడానికి సైన్యమండలిని నిర్మించారు. ముస్లిముల ఒక బృందం మన సైన్యం మదీనహ్ నుంచి బయటకు వెళ్లి పట్టణానికి బయట యుద్ధం చేయడం మంచిది అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దైవప్రవక్త(స.అ) మదీనహ్ కు చెందిన వెయ్యి మందితో ఒహద్ కొండ వైపుకు బయలు దేరారు. దారి మధ్యలో 300 మంది కపటవర్తనుడైన అబ్దుల్లాహ్ ఇబ్నె ఉబై మాటల్లో వచ్చి తిరిగి మదీనహ్ కు వెళ్లిపోయారు. ఇస్లాం సైన్యం సంఖ్య 700 లకు తగ్గిందిపోయింది. హిజ్రత్ యొక్క 3వ సంవత్సరం షవ్వాల్ 7వ తేదీన ఒహద్ పర్వత ప్రాంతంలో ఇరువైపు సైన్యాలు ఎదురుపడ్డాయి.

దైవప్రవక్త(స.అ) యుద్ధానికి ముందు అక్కడ ప్రదేశాన్ని పరీక్షించారు, వారి దృష్టికి యుద్ధంలో నిమగ్నమై ఉండగా శత్రుసైన్యం వెనకనుంచి ముస్లిములపై దాడి చేసే అవకాశం ఉంది అని అనిపించింది. అందుకని “అబ్దుల్లాహ్ ఇబ్నె జుబైర్” పేరు గల వ్యక్తి ఆధిపత్యంలో 50 మంది బాణనిపుణులను కొండ పై ఉంచి శత్రు సైన్యం తరపు నుంచి దాడి జరిగితే అడ్డుకోవడానికి నిశ్చయించారు. ముస్లిములు విజయం పొందినా లేదా పొందకపోయినా ఎట్టిపరిస్థితిలోనైనా సరే అక్కడ నుండి కదలకూడదని వారిని ఆదేశించారు.

అప్పటి యుద్ధాలలో ద్వజదారుడి(పర్చమ్ దార్) పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర ఉండేది. ద్వజం నిత్యం శక్తివంతుడికి ఇవ్వబడుతుంది. యుద్ధంలో ద్వజదారుడి స్థిరత్వం సైన్యానికి ధైర్యాన్ని ఇస్తుంది. దీనికి భిన్నంగా ద్వజదారుడు హతమార్చబడితే సైన్యం ధైర్యం కోల్పోతుంది. సైన్యం తమ ధైర్యాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో యుద్ధం మొదలవ్వక ముందే శక్తివంతులైన కొందరిని ద్వజదారులుగా నిర్ధారించేవారు.

ఈ యుద్ధంలో కూడా ఖురైషీయులు ద్వజదారులను క్రమంగా నిర్ధారించుకున్నారు. శౌర్యానికి పెట్టింది పేరుగా ప్రఖ్యాతి చెందిన “బనీ అబ్దుద్దార్” సమూహానికి చెందిన వారిని యుద్ధానికి ముందు నిర్ధారించారు. కాని యుద్ధం మొదలైన తరువాత వారి ద్వజదారులు అలీ(అ.స) చేతుల్లో ఒకరి తరువాత ఒకరు హతమార్చబడ్డారు. దాంతో ఖురైషీయుల సైన్యం ధైర్యం తగ్గింది, బలహీనులయ్యి వెనకడుగు వేశారు.

హజ్రత్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ఉల్లేఖించారు: “ఒహద్ యుద్ధంలో ముష్రక్కుల సైన్యంలో 9 మంది ద్వజదారులుగా నియమించబడ్డారు, వారందరు అలీ(అ.స) చేత్తో నరకవాసులయ్యారు”[1]

ఖురైష్ సైన్యం వెనకడుగు వేయడాన్ని చూసి కొండమీద కాపాలా కాస్తున్న వాళ్లలో కొందరు యుద్ధవ్యర్థాలు పోగెసుకోవడానికి క్రిందికి పరుగులు తీశారు. అక్కడ అబ్దుల్లాహ్ ఇబ్నె జుబైర్ తో పాటు 10 మంది కన్నా తక్కువ మంది ఉండిపోయారు.

అప్పుడు అశ్వికదళంతో వేచి ఉన్న ఖాలిద్ ఇబ్నె వలీద్, ఇది చూసి వారిపై దాడి చేసి, వారిని హతమార్చిన తరువాత వెనక నుంచి ముస్లిముల పై దాడి చేశారు. ఈ దాడితో పాటుగా ఖురైష్ కు చెందిన ఒక స్ర్తీ ఆమె పేరు “ఉమ్రహ్ బింతె అల్‌ఖమా” ద్వజాన్ని లేపడం జరిగింది దాంతో ఖురైషీయుల సైన్యం మరలా తిరిగి యుద్ధానికి వచ్చారు.
ఆ క్షణం నుంచి యుద్ధం యొక్క పరిస్థితి పూర్తిగా మారిపోయింది, ముస్లిముల క్రమం తప్పింది, ఇస్లాం సైన్యం మరియు సైన్యాధిపతి మధ్య గల సంబంధం తెగిపోయింది. ముస్లిములు అపజయానికి గురి అయ్యారు. ఇంచుమించు 70 మంది ఇస్లామీయ ముజాహిదీన్లు చంపబడ్డారు, వారిలో హంజా ఇబ్నె అబ్దుల్ ముతల్లిబ్ మరియు ముస్అబ్ ఇబ్నె ఉమైర్ ఇస్లాం ద్వజదారులలో ఒకరు, విరమరణం పొందారు.

మరోవైపు శత్రువుల తరపు నుంచి దైవప్రవక్త(స.అ) చంపబడ్డారు అనే పుకారు వ్యాపించారు, ఆ పుకారు ద్వార ముస్లిముల ధైర్యం స్థిరత్వం కోల్పోయింది. ముష్రిక్కుల సైన్య ఒత్తిడి ప్రభావం వల్ల ముస్లిములలో చాలా శతం వెనకడుగు వేశారు, చెల్లాచెదురయ్యారు, యుద్ధభూమిలో దైవప్రవక్త(స.అ)తో పాటు వేళ్లతో లెక్కబెట్టగల వ్యక్తులు మిగిలిపోయారు. అవి క్లిష్టమైన క్షణాలు. ఇస్లాం చరిత్రలో నిర్ణయాత్మకమైన గడియాలు వచ్చాయి.

అప్పుడు అలీ(అ.స) తమ శౌరత్వా నైపుణ్యాన్ని చూపించి సూత్రధారిగా నిలిచి మరిచిపోలేని విధంగా దైవప్రవక్త(స.అ) ప్రక్కన నిలబడి కత్తితో యుద్ధం చేస్తూ ఇస్లాం యొక్క ఉత్తమ నాయకుడిని మష్రిక్కుల దాడుల నుంచి కాపాడూ ముందుకు సాగారు. 

ఇబ్నె అసీర్ తన చరిత్ర గ్రంథంలో ఇలా రచించారు:
దైవప్రవక్త(స.అ) తమపై దాడి చేయడానికి వస్తున్న ముష్రిక్కుల ఒక సమూహాన్ని చూసి అలీను వారి పై దాడి చేయమని ఆదేశించారు. దైవప్రవక్త(స.అ) ఆదేశం విన్న అలీ(అ.స) వారి పై దాడిచేసి వారిలో ఎందరినో చంపి మిగిలినవారిని చిందరవందర చేశారు. ఆ తరువాత దైవప్రవక్త(స.అ) ఇంకో సమూహాన్ని వస్తుండగా చూసి అలీ(అ.స)కు ఆదేశమిచ్చారు అలీ వారిని చంపి చిందరవందర చేశారు. అప్పుడు దైవవాణి దూత దైవప్రవక్త(స.అ) ప్రక్తతో ఇలా అన్నాడు: ఇది అలీ(అ.స) చూపిస్తున్న ఉత్తమ త్యాగం. దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: అతడు నా నుండి నేను అతడి నుండి. అప్పుడు ఆకాశం నుంచి ఇలా ఒక శబ్ధం వినబడింది: “లా ఫతా ఇల్లా జుల్ఫిఖార్, వలా ఫతా ఇల్లా అలీ”[2]

రిఫరెన్స్
1. షేఖ్ మఫీద్, అల్ ఇర్షాద్, పేజీ47.
2. అల్ కామిల్ ఫిత్తారీఖ్, భాగం2, పేజీ154.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12