అహ్జాబ్ యుద్ధం

ఆది, 08/01/2021 - 09:05

అహ్జాబ్ యుద్ధం, దీని పేరుతోనే తెలుస్తుంది ఈ యుద్ధం ఇస్లాం శత్రు సమూహాలన్నీ కలిసి ఇస్లాం ను నాశనం చేయాలనే ఉద్దేశంతో ఏకమయ్యారని...

అహ్జాబ్ యుద్ధం

అహ్జాబ్ యుద్ధం, దీని పేరుతోనే తెలుస్తుంది ఈ యుద్ధం ఇస్లాం శత్రు సమూహాలన్నీ కలిసి ఇస్లాం ను నాశనం చేయాలనే ఉద్దేశంతో ఏకమయ్యారని. కొంతమంది చరిత్రకారులు ఈ యుద్ధంలో కాఫిరుల సైన్యం సంఖ్య పది వేలు అని వ్రాశారు. ఇస్లాం సైన్యం సంఖ్య 3 వేలకు మించి లేదు.
ఈ సైన్యం పై నాయకత్వం వహిస్తున్న ఖురైష్ పెద్దలు, తమ వద్ద యుద్ధపరికరాలన్ని ఉండడంతో, చేసిన యుద్ధ రూపకల్పనలతో ముస్లిములందరిని నాశనం చేయవచ్చు మరియు ఈ ముహమ్మద్(స.అ) మరియు ఆయన సహచరుల పీడ విరగడవుతుంది అని అనుకున్నారు. ఖురైషీయుల ఈ యోచన దైవప్రవక్త(స.అ)కు తెలిసింది. వారు ఒక సలహా మండలిని నిర్మించారు. మదీనహ్ చుట్టుప్రక్కలు, శత్రువులు ప్రవేశించడానికి అవకాశం ఉన్న ప్రదేశాలలో గొయ్యి త్రవ్వి శత్రువుల పట్టణంలో రాకుండా చేయవచ్చు అని సల్మాన్ ఒక సలహా ఇచ్చారు. ఈ సలహాను సమ్మతించి కొన్ని రోజులలోనే ముస్లిములందరి ప్రయత్నంతో గొయ్యి త్రవ్వి సిద్ధం అయ్యింది. ఈ గొయ్యి శత్రువుల అశ్వికదళం దూకి రాలేనంత వెడల్పు, ఒక సారి ఆ గొయ్యిలో ప్రవేశిస్తే సులువుగా బయటికి రాలేనంత లోతుగా ఉంది.

ముష్రిక్కుల సైన్యం యూధుల సహాయంతో చేరుకున్నారు. ఇంతకు ముందు మదీనహ్ చుట్టుప్రక్కల ప్రదేశాలలో ముస్లిములతో యుద్ధం జరుగవచ్చు అని అనుకున్నారు, కాని వారికి మదీనహ్ చుట్టుప్రక్కల ప్రదేశాలలో ముస్లిముల సైన్యం ఎదురుపడలేదు, దాంతో వారు ముందుకు సాగారు, పట్టణ ముఖ్యద్వారానికి చేరుకున్నారు, అక్కడ ఎంతో లోతుగా మరియు వెడల్పుగా ఉన్న గొయ్యిని చూసి ఆశ్యర్యపోయారు ఎందుకంటే అరేబీయుల యుద్ధాలలో ఇలాంటి గొయ్యి ఉపయోగించడం ఇంతకు ముందు చూడలేదు. మరోదారి లేక గొయ్యి అటువైపు నుంచే మదీనహ్ ను చుట్టుముట్టారు.

ఆ చుట్టుముట్టడి కొన్ని రివాయతుల ప్రకారం ఇంచుమించు ఒక నెల సాగింది. శత్రువులు ఆ గొయ్యిని దాటి రావాలనుకున్నప్పుడల్లా ముస్లిములు వారిని బాణాలతో మరియు రాళ్లతో సమాధానమిచ్చేవారు. రాత్రింబవళ్లు ఇరువైపుల నుంచి బాణాలతో యుద్ధం చేస్తూనే ఉన్నారు కాని ఏ ఒక్కరు వియజవంతులవ్వలేదు.

మరో వైపు ఇంత పెద్ద సైన్యం మదీనహ్ ను చుట్టుముట్టడం ద్వార చాలా మంది ముస్లిముల ధైర్యం తగ్గిపోయింది.

క్లిష్టమైన రోజులు

ఖుర్ఆన్ లో ఆ రోజుల్లో ముస్లిముల క్లిష్ట పరిస్థితిని ఇలా వివరించెను:
“ఓ విశ్వాసులారా! అల్లాహ్ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని కాస్త జ్ఞప్తిక తెచ్చుకోంది. మీపై సైనిక దళాలు దండెత్తి వచ్చినప్పుడు మేము వాటిపై ప్రచండమైన పెనుగాలిని, మీకు కానరాని సైన్యాలను పంపాము. మీరు చేస్తున్నదంతా అల్లాహ్ చూస్తునే ఉన్నాడు.

(శత్రువులు) మీ పైకి పైతట్టునుంచీ, లోతట్టునుంచీ దండెత్తి వచ్చినప్పుడు (మీరు) కళ్ళు తేలవేసినప్పుడు, (మీ) గుండెలు గొంతుల దాకా వచ్చేసినప్పుడు, మీరు అల్లాహ్ విషయంలో రకరకాల అనుమానాలకు లోనయ్యారు.
అప్పుడు విశ్వాసులు పరీక్షించబడ్డారు. తీవ్రంగా కుదిపివేయబడ్డారు. ఆ సమయంలో కపటులు, హృదయాలలో (అనుమానపు) రోగం ఉన్నవారు, ..అల్లాహ్, ఆయన ప్రవక్త మాతో చేసిన వాగ్దానం మోసం తప్ప మరేమీ కాదు.. అని చెప్ప సాగారు.

అప్పుడు వారిలోని ఒక వర్గం ఈ విధంగా గగ్గోలు చెందింది: “ఓ యస్రిబ్ (మదీనహ్) వాసులారా! ఇక మీరిక్కడ ఉండటానికి అవకాశమే లేదు. తిరుగు ముఖం పట్టండి: మరి వారిలోని ఒక బృందం, “మా ఇండ్లు సురక్షితంగా లేవు” అని చెప్పి దైవప్రవక్త(స.అ) నుంచి అనుమతి కోరసాగింది. మరి (చూడబోతే) అవి అభద్రంగా ఏమీలేవు. (అసలు) వారి ఉద్దేశం పలాయనం చిత్తగించాలన్నదే.

ఒకవేళ (మదీనహ్) నగరం నలువైపుల నుంచీ (శత్రువులు) చొచ్చుకు వచ్చి, అరాచకం సృష్టించమని వారిని కోరితే దానికి వారు తప్పకుండా అలా చేస్తారు. చాలా కొద్దిగా తప్ప ఆలస్యం చేయరు.[సూరయె అహ్జాబ్, ఆయత్ 9-14]  

ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా ముస్లిములు, ఆ గొయి(ఖందఖ్) ద్వార అహ్జాబ్ సైన్యాన్ని అడ్డుకోగలిగారు. ఇలాగే కొనసాగించడం వారికి కష్టంగా అనిపించింది; ఎందుకంటే మెల్లమెల్లగా చలిపెరగడం మొదలయ్యింది, బద్ర్ మరియు ఒహద్ యుద్ధాలను దృష్టిలో ఉంచుకొని ఆహరం మరియు పశుగ్రాసం లాంటివి అతి తక్కువ కాలం కోసం ఉంచుకోవడం, దాంతో ఈ సుధీర్ఘ కాలం వల్ల అవి అయిపోయి వస్తుండడం. అలాగే సైన్యం ఎక్కడ బలహీనత మరియు అలసటకు గురి అవుతుందో అన్న ఆలోచనతో సైన్యాధిపతులు తమ శౌర్యులను అటు పంపించి యుద్ధంలో ఉన్న ఈ ఆటంకాన్ని తొలగించాలని అనుకున్నారు. ఐదుగురు వీరులు ఆ గొయ్యిని దాటి వెళ్లారు. వారిలో ఒకడు “అమ్ర్ బిన్ అబ్దె వద్”, అరబ్ దేశాపు మల్లయోధుడు. అతడొక్కడే వెయ్యి మంది సైన్యంతో యుద్ధం చేసేవాడు. అతడు నాతో యుద్ధానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అని అరిచాడు. హజ్రత్ అలీ[అ.స] నిలబడి ఇలా అన్నారు: “యా రసూలల్లాహ్! నేను యుద్ధానికి సిద్ధమే” దైవప్రవక్త[స.అ] “అతడు అమ్ర్ బిన్ అబ్దెవద్!” అన్నారు. “స్వామీ! అతడు అమ్ర్ బిన్ అబ్దె వద్ అయితే నేను అలీ ఇబ్నె అబీతాలిబ్నీ” అని అలీ[అ.స] అన్నారు. చివరికి దైవప్రవక్త[స.అ] అనుమతి తీసుకొని అమ్ర్ బిన్ అబ్దె వద్ తో యుద్ధానికి వెళ్ళారు. కాసేపట్లోనే అలీ(అ.స) నోట అల్లాహు అక్బర్ అని విన్నారు దాంతో అమ్ర్ హతమార్చబడ్డాడు అని తెలిసింది. అమ్ర్ ను హతమార్చడం చూసిన తరువాత అమ్ర్ తో వచ్చిన మిగతా నలుగురు వెనక్కి పరుగులు తీశారు. వారిలో ముగ్గురు తిరిగి తమ సైన్యానికి చేరుకున్నారు కాని వారిలో ఒకడు ఆ గొయ్యిలో పడ్డాడు. అలీ(అ.స) అతడినీ హతమార్చారు. ఈ సంఘటన శత్రుసైన్యంలో అధైర్యాన్ని సృష్టించింది. తిరిగి వెళ్లిపోదాం అనే ఆలోచనలు మొదలు పెట్టారు.
చివరికి అల్లాహ్ తరపు నుంచి గట్టి గాలి తుఫాను వచ్చి వారిని తమ ఇళ్లకు తిరిగి వెళ్లేవిధంగా చేసింది.[1]  
దైవప్రవక్త[అ.స] ఇలా అన్నారు: “ఖందఖ్ దీనాన అలీ చేసిన దాడి ఇహపరలోకాల ఆరాధనకు మించింనది”[2]

దైవప్రవక్త(అ.స) యొక్క ఈ ప్రవచనం వెనక ఉన్న ఫిలాసఫీ అందకి తెలిసిందే; ఆ రోజు ఇస్లాం మరియు ఖర్ఆన్ ను అలీ(అ.స) తన ప్రాణాలను లెక్కచేయకుండా వెళ్లి కాపాడారు దాంతో ఇస్లాం ప్రళయదినం వరకు ఉంటుంది అన్న భరోసా కలిగింది వారి త్యాగం వల్ల ఇస్లాం ముందు సాగింది మరియు ప్రళయం వరకు విశ్వాసులందరు చేసే ఆరాధనలు వారికి రుణపడి ఉంటాయి.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13