ఖైబర్ యుద్ధం

ఆది, 08/01/2021 - 09:27

దైవప్రవక్త(స.అ) హిజ్రీ యొక్క 7వ సంవత్సరంలో కొన్ని కారణాల వల్ల యూధుల కోటను వారి నుంచి తీసుకోవాలనుకున్నారు...

ఖైబర్ యుద్ధం

హిజ్రత్ నుంచి దైవప్రవక్త(స.అ) మరణం వరకు గడిచిన హజ్రత్ అలీ(అ.స) జీవిత చరిత్రలో చాలా సంఘటనలు సంభవించాయి ముఖ్యంగా ఎన్నో యుద్ధాలలో వారు ప్రాణాలు లెక్కచేయకుండా చేసిన యుద్ధాలు. దైవప్రవక్త(స.అ) మదీనహ్ పట్టణానికి వలసి వచ్చిన తర్వాత ఇరవై ఏడు “గజ్వా”లు[1] ముష్రికీనులతో, యూధులతో మరియు తిరుగుబాటుదారులతో జరిగాయి అందులో ఇరవై ఆరు గజ్వాలలో అలీ(అ.స) పాల్గొన్నారు కేవలం “తబూక్” యుద్దం కొన్ని కారణాల వల్ల పాల్గొనలేదు. దైవప్రవక్త(స.అ) లేని సమయంలో కపటవర్తనులు ఇస్లామీయ కేంద్రాన్ని నాశనం చేయవచ్చు అనే ఆలోచనతో దైవప్రవక్త(స.అ) ఆదేశానుసారం మదీనహ్ లోనే ఉండిపోయారు. ఈ యుద్ధాలన్నింటి గురించి ఇస్లామీయ చరిత్ర గ్రంథాలలో చూడవచ్చి, వాటిలో ముఖ్యమైన యుద్ధాలు., ఉదా బద్ర్ యుద్ధం, ఒహద్ యుద్దం, ఖందఖ్ యుద్ధం మరియు ఖైబర్ యుద్ధం. ఇక్కడ ఖైబర్ యుద్ధం జరగడానికి గల కారణాలు మరియు ఆ యుద్ధంలో ఎవరు విజయాన్ని తమ సొంతం చేసుకున్నారు అన్న విషయాలు తెలుసుకుందాం:

ఖైబర్ యుద్దానికి గల కారణాలు:

దైవప్రవక్త(స.అ) హిజ్రీ యొక్క 7వ సంవత్సరంలో యూధుల కోటను వారి నుంచి తీసుకోవాలనుకున్నారు. దానికి రెండు కారణాలున్నాయి;
1. ఈ కోట ఇస్లాం అధికారానికి వ్యతిరేకతను వహించే కేంద్రంగా మారింది. యూధులు ఈ కోట ఇస్లాం శత్రువులకు సహాయం అందిస్తూ ఉండేది, ముఖ్యంగా అహ్జాబ్ యుద్ధంలో సైన్యాన్ని బలపరిచే విషయంలో మఖ్యపాత్ర వహించింది.

2. అప్పటి కాలంలో ఇరాన్ మరియు రోమ్ దేశాలు పెద్ద చక్రవర్తి రాజ్యాలుగా ఉండేవి, వారి మధ్య సుధీర్ఘ యుద్ధాలు జరిగేవి, కాని ఇస్లాం కొత్తగా మూడవ శక్తిగా రావడం వారికి ఇష్టం లేదు, అందుకని కిస్రా లేదా ఖైసర్ లు యూధుల సహాయంతో ఇస్లాం ను నాశనం చేయవచ్చు లేదా ముష్రిక్కులను ఇస్లాం పై దాడి చేయడానికి సిద్ధం చేసినట్లు ఈ ఇద్దరి చక్తవర్తులను ఇస్లాంను నాశనం చేయడానికి యోచన చేయవచ్చు.

ఖైబర్ కోట పై విజయం:

ఈ సమస్యల వల్ల దైవప్రవక్త(స.అ) ఒకవేయ్యి ఆరు వందల మంది సైన్యంతో ఖైబర్ వైపుకు వెళ్లారు. ఆ ఖైబర్ కోట చాలా దృఢమైనది. రక్షణ పరికరాలు గలదు. యూధుల శూరులు దాని రక్షణ కోసం నిత్యం పోరాతూ ఉండేవారు.

ఇస్లాం వీరుల ప్రయత్నం వల్ల ఒక్కొక్క కోటను దక్కించుకున్నారు. చివరికి “ఖమూస్” అనబడే పెద్ద కోట మిగిలిపోయింది, అది వారి శూరుల కోట, వారు పోరాడుతూనే ఉన్నారు, ఇస్లాం సైన్యం ఆ కోట ద్వారాన్ని తెరవలేకపోయారు. దైవప్రవక్త(స.అ) ఆరోగ్యం బాగుండకపోవడంతో వారు స్వయంగా యుద్ధభూమికి రాలేక ఎవరో ఒకరిని సైన్యాధిపతిగా నియమించి వారికి ద్వజం ఇచ్చి ఆ కోటను జయించాలని చెప్పేవారు కాని ఒకరి తరువాత ఒకరు వెళ్లి ఫలితం లేకుండా తిరిగి వచ్చేవారు.

ఈ పరిస్థితి చూసి దైవప్రవక్త(స.అ) తట్టుకోలేక రేపు నేను ఈ ద్వజాన్ని ఒకరికిస్తాను; అల్లాహ్ అతడి చేతులతో ఈ కోట తెరిపిస్తాడు; అతడు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ఇష్టపడతాడు, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అతడినికి ఇష్టపడతారు.[2]

మరుసటి రోజు అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇంతలో దైవప్రవక్త(స.అ) అలీ ఎక్కడ? అని అడిగారు. వారి కళ్ల నోప్పితో బాధపడుతున్నారు, అందుకని విశ్రాంతి తీసుకుంటున్నారు, అని అన్నారు. దైవప్రవక్త(స.అ) అలీను తీసుకొని రండి అన్నారు. అలీ వచ్చారు. దైవప్రవక్త(స.అ) వారి కళ్ల నోప్పి ఉపశమనం కోసం దుఆ చేశారు. వారి దుఆ ఆశీర్వాదంతో అలీ మేలుకున్నారు. అప్పుడు ఆ ద్వజాన్ని అలీ చేతికిచ్చారు. అలీ(అ.స), యా రసూలల్లాహ్ వారు ఇస్లాం స్వీకరించే వరకు వారితో పోరాడతాను అని అన్నారు. వారి వద్దకు వెళ్లు కోట దగ్గరకు వెళ్లిన తురవాత వారిని ఇస్లాం వైపు ఆహ్వానించు, అల్లాహ్ కు విధేయత గురించి వారికి గుర్తుచేయి. నిస్సందేహంగా నీ చేత ఒక్క మనిషి రుజుమార్గం పొందినా ఇది ఎర్ర వెంట్రుకల ఒంటెలు కలిగివుండడం కంటే ఎక్కువ అని దైవప్రవక్త(స.అ) అన్నారు.[3]

అలీ(అ.స) తన బాధ్యతను నిర్వర్తించడానికి బయలు దేరారు. ఆ దృఢమైన కోటను తన సాటిలేని శక్తి మరియు ధైర్యంతో జయించారు.

రిఫరెన్స్
1. చరిత్ర కారుల భాషలో దైవప్రవక్త(స.అ) స్వయంగా ఆధిపత్యం నిర్వర్తించిన యుద్ధాలను గజ్వా అంటారు.
2. అల్ ఇస్తిఆబ్ ఫీ మఅరిఫతిల్ అస్హాబ్, భాగం3, పేజీ36.
3. ముస్లిం ఇబ్నె అల్ ఖుషైరీ, సహీ ముస్లిం, ఖాహిరహ్, మక్తబతు మొహమ్మద్ అలీ సబీహ్, భాగం7, పేజీ121.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14