హజ్రత్ ఆదమ్[అ.స]

ఆది, 01/14/2018 - 07:46

.హజ్రత్ ఆదమ్[అ.స] అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ మొట్టమొదటి ప్రవక్త. వారి గురించి సంక్షిప్త వివరణ.

హజ్రత్ ఆదమ్[అ.స]

హజ్రత్ ఆదమ్[అ.స], మట్టితో సృష్టించబడ్డ మొదటి మనిషి. మేమందరం వారి సంతానం. ఖుర్ఆన్ ఇలా ప్రవచిస్తుంది: “మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి”.[నిసా,1]
అంతేకాదు హజ్రత్ ఆదమ్[అ.స], అల్లహ్ యొక్క మొట్టమొదటి ప్రవక్త కూడానూ. ఖుర్ఆన్లో “ఆదమ్” అన్న పదం 15 సార్లు మరియు “బనీ” అన్న పదంతో అనగ “బనీ ఆదమ్” అని 7 సార్లు “ఇబ్నై ఆదమ్” “జుర్రియతు ఆదమ్” “కమసలి ఆదమ్” ఇవన్ని ఒక్కొక్క సారి ఉపయోగించబడ్డాయి. అల్లాహ్ హజ్రత్ ఆదమ్[అ.స]కు సృష్టించాలనుకున్నప్పుడు దూతలతో ఇలా అన్నాడు: “నేను భువిలో ప్రతినిధిని చేయబోతున్నాను” అప్పుడు ఆ దూతలు ఇలా అన్నారు: “భూమిలో కల్లోలాన్ని రేకెత్తించి, రక్తం ప్రవహింపజేసేవాణ్ణి ఎందుకు సృష్టిస్తావు! నిన్ను స్తుతించటానికి, ప్రశంసించటానికి, నీ పవిత్రతను కొనియాడటానికి మేమున్నాము కదా!” దానికి అల్లాహ్ “నాకు తెలిసునవన్నీ మీకు తెలియవు” అని అన్నాడు.[బఖరహ్, 30]. దూతలు తమ అశక్తత మరియు అసహాయతను అల్లాహ్ సన్నిధిలో ఇలా వెల్లడించుకున్నారు: “(ఓ అల్లాహ్!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే1. [బఖరహ్, 32].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13