ఖులఫాల కాలం లో ఇమామ్ అలీ(అ.స) కార్యక్రమాలు

ఆది, 08/08/2021 - 12:09

ముగ్గురు ఖలీఫాల కాలం- ఇమామ్ అలీ(అ.స) అధికారానికి దూరంగా ఉన్న కాలం-లో ఇమామ్ అలీ(అ.స) చేసిన ముఖ్య కార్యక్రమాలను మూడు భాగాలలో విభజించవచ్చు...

ఖులఫాల కాలం లో ఇమామ్ అలీ(అ.స) కార్యక్రమాలు

ముగ్గురు ఖలీఫాల కాలం- ఇమామ్ అలీ(అ.స) అధికారానికి దూరంగా ఉన్న కాలం-లో ఇమామ్ అలీ(అ.స) చేసిన ముఖ్య కార్యక్రమాలను మూడు భాగాలలో విభజించవచ్చు:
1. వ్యక్తిగత కార్యక్రమాలు
అ) అల్లాహ్ ఆరాధన

అలీ(అ.స) అత్యంత భక్తిగల వారు.[1] ఆరాధన పరంగా దైవప్రవక్త(స.అ) తరువాత ఎవ్వరూ వారితో సమానం కాలేరు. వారి ఆరాధన ఇష్టంగా, అల్లాహ్ పట్ల జ్ఞానంతో, వినయవిధేయతలతో మరియు ప్రార్థనలతో కూడి ఉండేది. ఆరాధకుల అలంకరణ(జైనుల్ ఆబెదీన్) బిరుదు పొందినటువంటి హజ్రత్ సజ్జాద్(అ.స) తమ ముత్తాత అలీ(అ.స) ఆరాధన గురించి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఇలా అన్నారు: అలీ చేసే ఆరాధనలు చేసే శక్తి ఎవరిలో ఉంది?[2]

ఆ) వ్యక్తిగత జీవితం మరియు పేదవారిని ఆదుకోవడం కోసం పని చేయడం
హజ్రత్ అలీ(అ.స) తన వ్యక్తిగత జీవితం మరియు పేదవారిని ఆదుకోవడం కోసం వ్యవసాయం చేసేవారు మరియు ఖర్జూరపు తోటలు చూసుకునేవారు. వారు దానం చేసేవారు. వారు భూములను ప్రజలందరికి అందుబాటులో ఉండే విధంగా వఖ్ఫ్(అంకితం) చేసేవారు. ఈ క్రమంలో చూసుకుంటే వారు మదీనహ్ చుట్టుప్రక్కల్లో ఉన్న భూములను వ్యవసాయ భూములు మరియు తోటలుగా చేసేవారు. ఇది యుద్ధవ్యర్థాలు మరియు నివాళి రూపంలో దైవప్రవక్త(స.అ) ద్వార అలీకు ఇవ్వబడిన భూమి. అలీ అక్కడ బావి త్రవ్వారు, దాని నుంచి నీరు గట్టి ప్రవాహంతో బయటకు వచ్చింది. ఆ తరువాత ఇమామ్ అక్కడ తోటను నిర్మించారు. ఖిలాఫత్ కాలంలో అది వారి ఆధ్వర్యంలోనే ఉండేది దాని ద్వార వచ్చే సొమ్ముతో తమ జీవితాన్ని గడిపేవారు. దాని ఆదాయంతో పేదవారికి, లేనివారికి భోజనం పెట్టేవారు, మరి వారు చాలా సాధరణ ఆహారంతో సరిపెట్టుకునే వారు.[3]
అలాగే అలీ ఫదక్ ప్రదేశంలో “ఖుసైబహ్” అనబడే భూమి ఉండేది. ఇవే కాకుండా వారి వద్ద అబీ నైరూ, బగీబగా, ఇర్బాహా, అరీనహ్, రఅద్, రజీనా మరియు రబాహా అనబడే వ్యవసాయ భూములు ఉండేవి వీటన్నింటినీ విశ్వాసులకు అంకితం చేశారు. వాటి బాధ్యతలను తమ పిల్లలకు అప్పగించారు. యనీబహ్ భూమిలో వంద బావులు నిర్మించి వాటిని హీజీయుల కు వఖ్ఫ్ చేశారు. మస్జిదె ఫత్హ్ ను మదీనహ్ లో, ఇంకో మస్జిద్ (ఒహద్ లో) హంజా సమాధికి ఎదురుగా నిర్మించారు.[4]

2. విజ్ఞాన పరమైన కార్యక్రమాలు, ఫిఖా మరియు సమస్యల పరిష్కారం
అ) ఖుర్ఆన్ సేకరణ

దైవప్రవక్త(స.అ) మరణానంతరం వారి వసీయత్ ప్రకారం అలీ(అ.స) ఖుర్ఆన్ సేకరణ కోసం నిర్ణయించుకున్నారు. ఖుర్ఆన్ ను సేకరించనంత వరకు నమాజ్ కు తప్ప భుజం పై రిదా(బయటకు వెళ్లేటప్పుడు భుజాల పై వేసుకునే ఒక బట్ట) వేసుకోను అని ప్రమాణం చేశారు. ఇది సేకరించబడ్డ మొట్ట మొదటి ఖుర్ఆన్[5]
ఈ ఖుర్ఆన్ మరియు ఉస్మాన్ ఖిలాఫత్ లో సేకరించబడిన ఖుర్ఆన్- ఇప్పుడు ముస్లిములందరి చేతుల్లో ఉన్న ఖుర్ఆన్- మధ్య గల తేడా ఏమిటంటే., ఈ ఖుర్ఆన్ అవతరించబడిన క్రమంలో సేకరించబడింది, నాసిఖ్ మన్సూఖ్, మొహ్కమ్ ముతషాబెహ్ లు వివరించబడ్డాయి, మక్కీ మదనీ సూరహ్ లు కూడా సూచించబడ్డాయి. తావీల్ మరియు తఫ్సీర్ కూడా చెప్పబడి ఉంది, మొదలగు అంశాలు వివరించబడి ఉన్నాయి.[6]
అలీ(అ.స) ఖుర్ఆన్ ను సేకరించిన తరువాత, పెద్ద సహాబీయుల ముందు ప్రదర్శించి ఇలా అన్నారు: ఇది మీ ప్రభువు గ్రంథం, ఎలాగైతే ఆయన ప్రవక్త పై అవతరించబడిందో అలాగే హెచ్చు తగ్గకుండా సేకరించబడింది. కాని ఆ సహాబీయుల సమూహం; దానిని స్వీకరించలేదు, చూసీచూడనట్లుగా వదిలేశారు. వాళ్లు, మాకు ఇలాంటి పుస్తకం అవసరం లేదు అని అన్నారు. అలీ(అ.స), సరే! అల్లాహ్ సాక్షిగా ఈ రోజు తరువాత దీనిని చూడలేరు, సేకరించిన తరువాత మీతో చెప్పడం నా బాధ్యత కాబట్టి తెలియపరిచాను.[7]

ఆ) అత్యుత్తమ విద్యార్థుల శిక్షణ
ఈ కాలం హజ్రత్ అలీ(అ.స) చేసిన మరో ముఖ్యమైన చర్య ఇస్లాం ఉపదేశాలు, అల్లాహ్ పట్ల జ్ఞానం మొదలగు అంశాల ద్వార విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఇక్కడ వారిలో కొందరి పేర్లు; అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్, మీసమె తమ్మార్, కుమైల్ ఇబ్నె జియాద్ మొ..

ఇ) యూధుల మరియు క్రైస్తవుల విజ్ఞానుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం
దైవప్రవక్త(స.అ) మరణానంతరం ప్రపంచం యొక్క వివిధ దేశాలనుంచి విజ్ఞానులు ముఖ్యంగా యూధులు మరియ క్రైస్తవులు ఇస్లాం పరిశోధనకై లేదా ముస్లిముల పెద్దలతో చర్చ కోసం మదీనకు వచ్చేవారు. వారు అడిగే ప్రశ్నలకు అలీ(అ.స) తప్ప మరొకరు సమాధానం ఇవ్వలేకపోయే వారు. ఒకవేళ ఈ సమాధానాల ద్వార వాళ్ల నోళ్లు మూయకపోతే ఇస్లాం సమాజం అవమానం మరియు అపజయానికి గురి అయ్యేది. అలీ(అ.స) యొక్క ఈ చర్య వల్ల ముస్లిములందరూ సంతోషించేవారు.

ఈ) కొత్త సమస్యలకు షరా పరమైన ఆదేశం వివరించడం
దైవప్రవక్త(అ.స) తరువాత, అప్పుడప్పుడూ దైవప్రవక్త(స.అ) కాలంలో సంభవించని కొత్త అంశాలు ముందుకు వచ్చేవి, దాని ఆదేశం స్పష్టంగా ఉండేది కాదు లేదా చాలా క్లిష్టంగా ఉండేది దాన్ని అర్థం చేసుకోవడం పెద్ద పెద్ద సహాబీయులు కూడా కష్టం అయ్యేది. ఇలాంటి సమయంలో వేరే దారి లేక అలీ(అ.స) వద్దకు వచ్చేవారు. అలీ తన దైవజ్ఞానంతో సమస్యను పరిష్కరించేవారు.

ఇమామ్ అలీ(అ.స) జీవితంలో ఇలాంటి సందర్భాలు చాలా సున్నితమైన మరియు ప్రకాశవంతమైనవి. ఒకవేళ సహాబీయుల మధ్య అలీ లాంటి వ్యక్తి లేకపోయి ఉంటే ఇస్లాం ముందు దశలలోనే చాలా సమస్యలు పరిష్కారం లేక అలాగే ఉండిపోయి ఉండేవి.

3. రాజకీయ సమస్యలలో ఖలీఫాలకు సలహాలు ఇవ్వడం
అలీ(అ.స) సఖీఫహ్ తరువాత, ముగ్గురు ఖలీఫాల కాలంలో, తన వ్యతిరేకతను ప్రదర్శిస్తూనే, ఇస్లాం మరియు ముస్లిముల ఉన్నత కోసం రాజకీయ, సామాజిక మరియు సైన్య సమస్యలలో ఆ కాలపు ఖలీఫాకు ఎటువంటి అధికార స్థానం స్వీకరించకుండా సలహాలు ఇచ్చేవారు.
అలీ(అ.స) వాళ్ళకు సహాయపడిన కొన్ని యుద్ధాలు కూడా ఉన్నాయి వాటిలో కొన్ని; రోమన్లతో యుద్ధం, నహావంద్ యుద్ధం, ఫత్హె బైతుల్ ముఖద్దస్ యుద్ధం మొ..
ఖులఫాలను క్లిష్ట పరిస్థితులలో సహాయం చేసేవారు. అందుకే హజ్రత్ ఉమర్ వారి గురించి ఇలా అన్నారు: సమస్య వచ్చి దాన్ని పరిష్కరించడానికి అలీ లేకపోయే సమయం రాకూడదని అల్లాహ్ ను కోరుకుంటున్నాను.[8]

రిఫరెన్స్
1. ఇబ్నె అబిల్ హదీద్, నెహ్జుల్ బలాగహ్, భాగం1, పేజీ27.
2. కులైనీ, రౌజతుల్ కాఫీ, పేజీ162.
3. ఇబ్రాహీమ్ సఖఫీ కూఫీ ఇస్ఫహానీ, అల్ గారాత్ తహ్ఖీఖ్ మీర్ జలాలుద్దీన్ హుసైనీ అర్మవీ, చాపె దువ్వుమ్, భాగం1, పేజీ68. ఇబ్నె అబిల్ హదీద్, షర్హె నెహ్జుల్ బలాగహ్, భాగం2, పేజీ200.
4. మొహమ్మద్ ఇబ్నె అలీ ఇబ్నె షహ్రె ఆషూబ్, మనాఖిబె ఆలె అబీతాలిబ్, భాగం2, పేజీ123.
5. ఇబ్నె నదీమ్, మొహమ్మద్ ఇబ్నె ఇస్హాక్, అల్ ఫెహ్రిస్త్, పేజీ41-42.
6. మొహమ్మద్ హాదీ మారెఫత్, అల్ తమ్హీద్ ఫీ ఉలూమిల్ ఖుర్ఆన్, భాగం1, పేజీ 225-227. డాక్టర్ మహ్మూద్ రామ్యార్, తారీఖె ఖుర్ఆన్, పేజీ371-372.
7. ఇబ్నె నదీమ్, మొహమ్మద్ ఇబ్నె ఇస్హాక్, అల్ ఫెహ్రిస్త్, పేజీ42.
8. ఇబ్నె హజర్ అస్ఖలానీ, అల్ ఇసాబహ్ ఫీ తమీజిస్ సహాబహ్, భాగం2, పేజీ509. ఇబ్నె అబ్దుల్ బిర్ర్, అల్ ఇస్తిఆబ్ ఫీ మఆరిఫతిల్ అస్హాబ్, భాగం3, పేజీ39.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 17 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17