హజ్రత్ అలీ(అ.స) యొక్క ఖిలాఫత్ కాలం

సోమ, 08/09/2021 - 15:25

అమీరుల్ మొమినీన్(అ.స) బైఅత్ ఎలా జరిగింది, వారి అధికారంలో ఎన్ని యుద్ధాలు జరిగాయి మరియు వారి పరిపాలన ఎలా ఉండింది అనే అంశాలు సంక్షిప్తంగా...

హజ్రత్ అలీ(అ.స) యొక్క ఖిలాఫత్ కాలం

అమీరుల్ మొమినీన్(అ.స) బైఅత్ ఎలా జరిగింది
కొన్ని కారణాల వల్ల మస్లిములు ఉస్మాన్ కు వ్యతిరేకమయ్యారు. విప్లవకారులు వారిని 49 రోజులు చుట్టుముట్టి ఉన్నారు. చివరికి విప్లవకారులు ఉస్మాన్ ఇంటిపై దాడి చేసి ఉస్మాన్ ను హతమార్చారు. వాళ్లకు ఉస్మాన్ ను చంపాలనే ఆలోచన ఉండింది గాని తరువాత ఖలీఫా ఎవరు అనేది ఆలోచించలేదు.
మరోవైపు ఆరుగురి సలహా మండలి., అలీ, అబ్దుర్రహ్మాన్ ఇబ్నె ఔఫ్, ఉస్మాన్, తల్హా, జుబైర్, సఅద్ ఇబ్నె వఖ్ఖాస్. వీరిలో ఇద్దరు చనిపోయారు అనగా అబ్దుర్రహ్మాన్ ఇబ్నె ఔఫ్ మరియు ఉస్మాన్, మిగిలివున్న నాలుగురిలో అలీయే అందరికి ఇష్టమైన వారు, వారే అత్యంత ప్రతిష్టతగలవారు, ఎవరూ వారికి సమానం కాలేరు, ఇలాంటి అంశాలే ప్రజలకు అలీ వైపుకు లాగియి.
పరిస్థితులు మరియు ఉస్మాన్ కాలంలో జరిగిన సంఘటనలు అలాగే ఇస్లాం యొక్క ఆదేశాల నుంచి ముస్లిముల దూరం చూసి, ఉస్మాన్ కాలంలో జరిగిన అవినీతి మరియు కాలుష్యం తరువాత అధికారం చేయడం చాలా కష్టం ముఖ్యంగా వర్గనాయకులు, తాను చేయాలనుకుంటున్న సవరణను అంగీకరించరు, తన న్యాయ అధికారాన్ని తట్టుకోలేరు, అని గ్రహించిన అలీ విప్లవకారులు మేము మీతో బైఅత్ చేస్తామని కోరినప్పుడు అలీ దానిని అంగీకరించలేదు.
చరిత్రకారులు ఈ విషయంపై ఏకాభిప్రాయం కలిగివున్నారు; ఉస్మాన్ హిజ్రీ యొక్క 35వ సంవత్సరం జిల్‌హిజ్ మాసంలో చంపబడ్డారు, ఎప్పుడు అన్న విషయంలో అభిప్రాయబేధం ఉంది. అయితే ఉస్మాన్ చంపబడిన రోజు మరియు ప్రజలు అలీ(అ.స) చేతుల పై బైఅత్ చేసిన రోజు మధ్య నాలుగైదు రోజుల తేడా ఉంది.[1]

మూడు యుద్ధాలు
ఇమామ్ అలీ(అ.స) యొక్క అధికారం న్యాయధర్మాలతో మరియు ఇస్లామీయ అసలైన సున్నత్ ను తిరిగి ప్రాణం పోసే లక్ష్యంతో మొదలయ్యింది. ఇది కొంతమందికి కష్టంగా అనిపించింది. దాంతో వారు అధికారానికి వ్యతిరేకంగా గుంపులు సిద్ధం చేశారు. ఈ వ్యతిరేకత పరిణామమే మూడు యుద్ధాలు; ఒకటి “నాకిసీన్”లతో, రెండవది “ఖాసితీన్”లతో మరియు మూడవది “మారిఖీన్”లతో. ఈ యుద్ధాల గురించి సంక్షిప్త వివరణ:

నాకిసీన్ లతో యుద్ధం
నాకిసీన్ అనగా మాటతప్పిన ద్రోహులు. ఈ యుద్ధానికి కారణం; తల్హా మరియు జుబైర్ అలీ(అ.స)తో బైఅత్ చేసిన తరువాత బస్రా మరియు కూఫా కు గవర్నర్ గా నియమించమని కోరారు కాని అలీ వారి కోరికను మన్నించలేదు. వారిద్దరు ఉమ్రా సాకుతో మదీనహ్ ను విడిచారు. అమవీయులతో చేరి సైన్యాన్ని సిద్ధం చేసి ఆయిషహ్ తో పాటు ఉస్మాన్ రక్తపరిహారం సాకుతో బస్రాకు బయలుదేరారు. అలీ వారితో యుద్ధం కోసం మదీనహ్ నుంచి బయలు దేరారు. బస్రా పట్టణానికి దగ్గరలో వారిద్దరి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. చివరికి అలీ(అ.స) నాకిసీన్ ల పై విజయం సాధించారు. ఈ యుద్ధం పేరు జమల్ యుద్ధం. ఇది హిజ్రీ యొక్క 36వ సంవత్సరంలో సంభవించింది.

ఖాసితీన్ లతో యుద్ధం
అలీ(అ.స) యొక్క ఖిలాఫత్ కు చాలా కాలం ముందు నుంచే షామ్ లో ముఆవియ తన ఖిలాఫత్ కోసం సిద్ధంగా ఉన్నాడు కాని అలీ ఖిలాఫత్ పదవి పై రాగానే అతడిని పదవి నుంచి తొలగించారు, షామ్ లో ఒక్క క్షణం కూడా పదవి పై ఉండేందుకు అంగీకరించలేదు. ఈ వ్యతిరేకతకు ఫలితంగా ఇరాఖ్ మరియు షామ్ సైన్యం “సిఫ్ఫీన్” ప్రదేశంలో యుద్ధానికి సిద్ధమయ్యారు, అలీ(అ.స) సైన్యం విజయం తమ సొంతం చేసుకుంటుంది అనే సమయంలో ముఆవియహ్ తన ప్రత్యేక జిత్తులతో అలీ సైన్యంలో విబేధాన్ని సృష్టించాడు. చివరికి ఇమామ్ ప్రక్కకు తప్పుకుని తీర్పును అబూమూసా అష్అరీ మరియు అమ్రెఆస్ కు ఇవ్వడం జరిగింది. ఖాసితీన్ లతో జరిగిన ఈ యుద్ధాన్ని సిఫ్ఫీన్ యుద్ధం అంటారు. ఇది హిజ్రీ యొక్క 37వ సంవత్సరంలో జరిగింది.

మారిఖీన్ లతో యుద్ధం
మారిఖీన్, అలీను సిఫ్ఫీన్ యుద్ధంలో తీర్మానం పై బలవంతం చేసిన వారు. వీళ్లు కొన్ని రోజుల తర్వాత తాము చేసిన తప్పు తెలుసుకొని ఒప్పందాన్ని ఉల్లంఘించమని ఇమామ్ ను కోరారు. ఇమామ్ దానికి నిరాకరించారు. దాంతో వీళ్లు అలీ(అ.స)కు ఎదురుతిరిగి యుద్ధానికి సిద్ధమయ్యారు. నెహ్రవాన్ ప్రదేశంలో అలీతో యుద్ధం చేశారు. అలీ(అ.స) ఈ యుద్ధంలో జయించారు కాని వాళ్ళ హృదయాల్లో ద్వేషం ఉండిపోయింది. ఈ యుద్ధం హిజ్రీ యొక్క 38వ సంవత్సరంలో, మరి కొందరి వచనానుసారం 39వ సంవత్సరంలో సంభవించింది.[2]  

ఇమామ్ పరిపాలన
హిజ్రత్ తరువాత మదీనహ్ లో దైవప్రవక్త(స.అ) ఇస్లామీయ అధికారాన్ని నిర్మించారు. అలీ(అ.స) అధికారం దురదృష్టవశాత్తు చాలా కొద్దికాలమే అయినా దైవప్రవక్త(స.అ) తరువాత పరిపూర్ణ ఇస్లామీయ అధికారం అలీ(అ.స) అధికారమే. ఈ కొంతకాలంలోనే అంతర్గత పన్నగాల వల్ల అనుకున్నవన్నీ చేయలేకపోయారు కాని ఇస్లామీయ అధికారం ఎలా ఉండాలో నేర్పించారు.
చివరికి అధికారంలో వచ్చిన నాలుగు సంవత్సరాల కొన్ని నెలల తరువాత హిజ్రీ 40వ ఏట రమజాన్ మాసం 19వ తారీఖున మారిఖీన్ సమూహానికి చెందిన అబ్దుర్రహ్మాన్ ఇబ్నె ముల్జిమ్ చేసిన దాడి ద్వార మరణించారు.

రిఫరెన్స్
1. మురవ్విజుజ్ జహబ్, భాగం2, పేజీ349 మరియు 350.
2. తారీఖె ఇస్లాం, రెండవ భాగం, మహ్దీ పీష్వాయీ, ఖుమ్, దఫ్తరె నష్రె మఆరిఫ్ లో మూడు యుద్ధాల టాపిక్ లో చూడగలరు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17