ఇమామ్ హసన్ ముజ్తబా(అ.స)

సోమ, 08/09/2021 - 15:59

హజ్రత్ ఇమామ్ హసన్(అ.స) యొక్క దయా గుణం మరియు వారి ధైర్యసాహసాల గురించి సంక్షిప్తంగా...

ఇమామ్ హసన్ ముజ్తబా(అ.స)

దైవప్రవక్త(స.అ) రెండవ ఉత్తరాధికారి, అలీ మరియు ఫాతెమా యొక్క పెద్ద కుమారుడు అయిన హసనె ముజ్తబా హిజ్రీ యొక్క 2వ సంవత్సరం, రమజాన్ మాసం 15వ తేదీన మదీనహ్ లో జన్మించారు.[1]
దైవప్రవక్త(స.అ) మరణించినప్పుడు ఇమామ్ హసన్(అ.స) వయసు ఏడు సంవత్సరాలు. దైవప్రవక్త(స.అ) మరణానంతరం దాదాపు 30 సంవత్సరాలు తండ్రితో పాటు ఉన్నారు. తండ్రి మరణానంతరం 10 సంవత్సరాల వరకు ఇమామ్ గా ఉన్నారు. హిజ్రీ యొక్క 50వ ఏట ముఆవియహ్ కుట్ర ద్వార విషం ద్వార 47 సంవత్సరాల వయసులో మరణించారు. వారి సమాధి “బఖీ” స్మశానంలో ఉంది.

నిస్సహాయుల దాత
హజ్రత్ ఇమామ్ హసన్(అ.స) కూడా తమ పితాముహులైన్ హజ్రత్ ముహమ్మద్(స.అ) మరియు తండ్రి అలీ ఇబ్నె అబీతాలిబ్ మాధిరి పేదవారిని నిత్యం సహాయం చేసేవారు. వారు చాలా సున్నిత మనస్కులు, మంచి స్వభావం మరియు ఉదారభావం కలిగివుండేవారు.
కొన్ని సందర్భాలలో వారు పెద్ద మొత్తం ఒకే సారి పేదవారికి దానం చేసేవారు. వారి దృష్టిలో ప్రసాదిస్తే ఇక అతడికి పేదరికం అనేది ఉండకూడదు, జీవితాన్ని గౌరవంగా గడిపేయాలి అని భావించేవారు.
హజ్రత్ ముజ్తబా(అ.స) తన పూర్తి జీవితంలో రెండు సార్లు తన పూర్తి ఆస్తిని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టారు. మూడు సార్లు తన వద్ద ఉన్న ధనాన్ని రెండు భాగాలుగా విభజించి అర్థభాగం తన వద్ద ఉంచుకొని మిగిలిన అర్థభాగాన్ని అల్లాహ్ మార్గంలో దానం చేశారు.[2]

ఇమామ్ హసన్(అ.స) ధైర్యసాహసాలు
చరిత్ర ఆధారంగా ఇమామ్ హసన్(అ.స) ధైర్యవంతులు, శౌర్యవంతులు, దేనికీ భయపడేవారు కాదు. ఇస్లాం అభివృద్ధి కోసం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. నిత్యం అల్లాహ్ మార్గంలో తమ ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉండేవారు. వారి జీవితం నుంచి వారి ధైర్యాన్ని వ్యక్తం చేసే కొన్ని సంఘటనలు:

1. అబూజరె గిఫారీ వీడ్కోలుకు వెళ్లడం
అబూజర్, మూడవ ఖలీఫా చర్యల పట్ల తమ వ్యతిరేకతను తెలుపగా ఉస్మాన్ వారిని “రబజహ్”  ప్రదేశానికి బహిష్కరించి, ఎవ్వరూ వారిని వీడ్కోలు చేయరాదని, వారితో మాట్లాడకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. వారిని రబజహ్ వరకు దింపి రమ్మని మర్వాన్ కు పంపారు. ప్రజలు భయంతో ముందుకు రాలేదు. ఇమామ్ అలీ(అ.స) ఖలీఫా ఆదేశాన్ని ప్రాముఖ్యత ఇవ్వకుండా తన సోదరుడు అఖీల్, కుమారులు హసన్ మరియు హుసైన్, అమ్మార్ ను వెంటబెట్టుకొని అబూజర్ వీడ్కోలుకు వెళ్లారు.
హసన్(అ.స) అబూజర్ తో మాట్లాడుతుంగా, మర్వాన్ వచ్చి ఓ హసన్! ఖలీఫా ఎవ్వరూ ఇతడితో మాట్లాడకూడదని ఆదేశించిన విషయం నీకు తెలియదా! తెలియకపోతే తెలుసుకో.
అలీ(అ.స)కు మర్వాన్ పై కోపం వచ్చింది, అతడిపై దాడి చేసి అతడి గుర్రాన్ని వెనక్కి నెట్టి ఇలా అన్నారు: “వెనక్కి వెళ్లు, అల్లాహ్ నిన్ను నరకాగ్నిలో ప్రవేశించుగాక”[3]

2. జమల్ యుద్ధంలో ఇమామ్ హసన్(అ.స)
ఇమామ్ హసన్(అ.స) తన తండ్రితో పాటు జమల్ యుద్ధంలో పాల్గొన్నారు. ఈ యుద్ధంలో ముందు వరుసలో ఉండి పోరాడారు. అలీ(అ.స) యొక్క సైన్యంలో ఉన్న శూరులకు మించి దాడి చేశారు. శత్రువుల మధ్యలో వెళ్లి వారి పై తీవ్రమైన దాడి చేశారు.[4]

3. సిఫ్పీన్ యుద్ధంలో ఇమామ్ హుసైన్(అ.స)
సిఫ్పీన్ యుద్ధంలో ఇమామ్ హుసైన్(అ.స) పాల్గొన్నారు. అల్లాహ్ మార్గంలో తమ ప్రాణాలను అర్పించడానికి సిద్ధమయ్యి యుద్ధం చేస్తూ ముందుకు సాగిపోయేవారు. వారి యుద్ధాన్ని చూసి సిఫ్ఫీన్ యుద్ధంలో అలీ(అ.స) తమ అనుచరులతో అతడిని మరియు అతడి సోదరుడు హుసైన్(అ.స)ను శత్రువులతో పోరాడాన్ని కొనసాగించనివ్వకండి, వీరిద్దరి మరణంతో దైవప్రవక్త(స.అ) వంశం అంతమవుతుంది.[5]

రిఫరెస్స్
1. ఇబ్నె షహ్రె ఆషూబ్, మనాఖిబె ఆలె అబీతాలిబ్, తస్హీహ్ వ తాలీఖ్.. హాజ్ సయ్యద్ హాషిమ్ రసూలీ మహల్లాతీ. షేఖ్ ముపీద్, అల్ ఇర్షాద్, పేజీ187. ఇబ్నె అసీర్, ఉస్దుల్ గాబహ్ ఫీ మఅరిఫతిస్ సహాబహ్, భాగం2, పేజీ10. ఇబ్నె హజరె అస్ఖలానీ, అల్ ఇసాబహ్ ఫీ తమీజిస్ సహాబహ్, భాగం1, పేజీ328.
2. సీవ్తీ, తారీఖుల్ ఖులఫా, పేజీ190. ఇబ్నె వాజెహ్, తారీఖె యాఖూబీ, భాగం2, పేజీ215. సిబ్తె ఇబ్నె జౌజీ, తజ్కిరతుల్ ఖవాస్, పేజీ 196.
3. బయానాతె ఇమామ్ దర్ నెహ్జుల్ బలాగహ్, తర్జుమ ఫైజుల్ ఇస్లాం దర్ ఖాలిబె ఖుత్బా షుమారహ్130 ఉల్లేఖించబడి ఉంది.
4. ఇబ్నె షహ్రె ఆషూబ్, మనాఖిబె ఆలె అబీతాలిబ్, భాగం4, పేజీ21.
5. ఇబ్నె అబిల్ హదీద్, షర్హె నెహ్జుల్ బలాగహ్, భాగం11, పేజీ25(ఖుత్బా200).

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14