ఇమామ్ హసన్(అ.స) మరియు ముఆవియా

సోమ, 08/09/2021 - 16:12

ముఆవియా ఇస్లాం వ్యతిరేక చర్యల పట్ల ఇమామ్ హసన్(అ.స) విమర్శలు, సంధి ఒప్పందం యొక్క వివరణ...

ఇమామ్ హసన్(అ.స) మరియు ముఆవియా

ముఆవియా ఇస్లాం వ్యతిరేక చర్యల పట్ల విమర్శలు
ఇమామ్ హసన్(అ.స) ఇస్లాం రక్షణ మరియు యదార్థం పట్ల ఎవ్వరినీ లెక్క చేసేవారు కాదు. వారు బహిరంగంగా ముఆవియా ఇస్లాం వ్యతిరేక చర్యలను విమర్శించేవారు. అతడి దుర్మార్గాల గురించి మరియు అతడి పూర్వీకుల చీకటి చరిత్ర గురించి ఎవరికి భయపడకుండా చెప్పేవారు.
హజ్రత్ హసన్(స.అ) చివరికి ముఆవియా మరియు వారి మధ్య సంధి ఒప్పంద జరిగిన తరువాత ముఆవియా బలం పెరిగింది ముందు కన్న అతడి స్థాన స్థిరత్వం పెరిగింది, ముఆవియా కూఫాలో ప్రవేశించిన తరువాత... అలాంటి సమయంలో కూడా ఇమామ్ పీఠంపై ఎక్కి సంధికి గల కారణాలు, అలీ(అ.స) మరియు వారి కుటుంబం యొక్క ప్రత్యేకతలు వివరించి ఇరువర్గాల ముందు ముఆవియా యొక్క లోపాలను బలంగా మరియు స్పష్టంగా వివరించి అతడి పద్ధతుల పై విమర్శన వ్యక్తం చేశారు.[1]

ఇస్లాంలో సంధి ఒప్పందం యొక్క చట్టం
ఇస్లాంలో ఎలాగైతే పరిస్థితులను బట్టి శత్రువులతో పోరాడేందుకు యుద్ధ ఆదేశాలు ఉన్నాయో అలాగే యుద్ధం లక్ష్యానికి అడ్డు పడుతుంది అన్నప్పుడు సంధి ఒప్పందంతో సమస్యను పరిష్కరించాలి. దైవప్రవక్త(సఅ) జీవిత చరిత్రలో ఈ రెండు పద్ధతులు కూడా కనిపిస్తాయి.. దైవప్రవక్త(స.అ) బద్ర్, ఒహొద్, అహ్జాబ్ లాంటి సమయంలో యుద్ధం చేశారు, విజయం అసాధ్యం అన్న పరిస్థితులలో అనివార్యంగా ఇస్లాం అభివృద్ధికి అడ్డు రాకుండా ఇస్లాం శత్రువులతో సంధి ఒప్పందం పై రాజీ పడేవారు. ఉదాహారణకు దైవప్రవక్త(స.అ) “బనీ జమ్రహ్” మరియు “బనీ అష్‌జఅ”లతో అలాగే మక్కా వాసులతో “హుదైబియహ్” సంధి ఒప్పందాలు చేశారు.[2]

ఇమామ్ హసన్(అ.స) సంధి ఒప్పందానికి గల కారణాలు
యుద్ధం గెలవాలంటే బలమైన సైన్యం కావాలి. సైన్యం యొక్క ఆలోచన బలంగా ఉండాలి. కేవలం కత్లులతో యుద్దం గెలవలేరు. అలాంటప్పుడు యుద్ధానికి ఒప్పుకోకూడదు.
ఇమామ్ హసన్(అ.స) సంధి ఒప్పందానికి గల కారణాలను పరిశీలించినట్లైతే అక్కడ కనిపించే అతి ముఖ్యమైన కారణం బలమైన సైన్యం లేకపోవడం మరియు సైన్యం యుద్ధానికి హృదయపూర్వకంగా సిద్ధం కాకపోవడం, ఎందుకంటే ఇరాఖ్ కు చెందిన ప్రజలు, ముఖ్యంగా కూఫా ప్రజలు, ఇమామ్ హసన్(అ.స) కాలంలో, ఆలోచన పరంగా యుద్ధానికి సిద్ధంగా లేరు, అలాగే వారిలో ఐక్యమత్యం కూడా కనిపించేది కాదు, ఒకరోజు ఒకరితో ఉంటే మరో రోజు మరో నాయకుడితో ఉండేవారు.
ముఆవియా, ఇమామ్ హసన్(అ.స) తనతో సంధి ఒప్పందం చేయకుండానే, ఇమామ్ సంధి ఒప్పందం కోసం అంగీకరించారు అని ప్రచారం చేశాడు. ఇమామ్ అనుచరులు నిజం తెలుసుకోకుండానే సంధికి ఎందుకు ఒప్పుకున్నారు అనే కోపంతో వారిపై దాడి చేశారు. మరికొందరు ఇమామ్ ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయారు.
ప్రముఖ రచయిత “తబరీ” ఇలా రచించెను: హసన్ ఇబ్నె అలీ(అ.స) తన అనుచరులు వారిని ఒంటరిగా వదిలేయడం వల్ల సంధికి ఒప్పుకున్నారు.[3] ఇమామ్ హసన్(అ.స) ఇలా ప్రవచించారు: నేను అధికారం ముఆవియాకు ఇచ్చేయడానికి గల కారణం; అతడితో యుద్ధం చేయడానికి సహచరులు లేకపోవడం, ఒకవేళ సహచరులే గనక ఉండి ఉంటే ఫలితం దక్కే వరకు రాత్రింబవళ్లు అతడితో పోరాడేవాడ్ని.[4]

సంధి ఒప్పందం యొక్క షరత్తులు
సంధి ఒప్పందం యొక్క ముఖ్యాంశాలు సంక్షిప్తంగా:
1. ముఆవియా ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్ ఆదేశాలనుసారం అధికారం చేయాలి అనే షరత్తు పై హసన్ ఇబ్నె అలీ అధికార పాలనను ముఆవియాకు అప్పచెబుతున్నారు.
2. ముఆవియా తరువాత ఖిలాఫత్ అధికారం హసన్ ఇబ్నె అలీకు సొంతమౌతుంది. ఒకవేళ వారు లేకపోతే హుసైన్ ఇబ్నె అలీ ఖిలాఫత్ అధికారం చేపడతారు. అలాగే ముఆవియాకు తన ఉత్తరాధికారిని నియమించే అదికారం లేదు.
3. అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) ను దూషించే చర్యను నిలిపివేయాలి వారిని గౌరవప్రదంగా గుర్తు చేయాలి. మొ...

రిఫరెన్స్
1. తబరీ, ఎహ్తెజాజ్, నజఫ్, తల్ మత్బఅతుల్ ముర్తజవియహ్, పేజీ144-150.
2. మజ్లిసీ, బిహారుల్ అన్వార్, తెహ్రాన్, అల్ మక్తబతుల్ ఇస్లామియ, 1383హి, భాగం44, పేజీ2.
3. తారీఖుల్ ఉమమ్ వల్ ములూక్, బీరూత్, దారుల్ ఖామూస్ అల్ హదీస్, భాగం6, పేజీ92.
4. మజ్లిసీ, బిహారుల్ అన్వార్, తెహ్రాన్, అల్ మక్తబతుల్ ఇస్లామియ, 1383హి, భాగం44, పేజీ147.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14