ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స)

శుక్ర, 08/13/2021 - 07:07

ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) కాలంలో ఉన్న పరిస్థితులు మరియు అధికారుల గురించి సంక్షిప్త వివరణ...

ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స)

ఇమామ్ బాఖిర్(అ.స), దైవప్రవక్త(స.అ) యొక్క ఐదవ ఉత్తరాధికారి, ఇమామ్ సజ్జాద్(అ.స) యొక్క కుమారుడు. వారి పేరు “ముహమ్మద్”, వారి కున్నియత్ “అబూ జాఫర్”, వారి బిరుదులు “బాఖిర్”, “బాఖిరుల్ ఉలూమ్”
ఇమామ్ బాఖిర్(అ.స) హిజ్రీ యొక్క 57వ ఏట మదీనహ్‌లో జన్మించారు. తల్లి “ఉమ్మె అబ్దుల్లాహ్” ఈమె ఇమామ్ హసన్(అ.స) కుమార్తె, ఈ విధంగా ఇమామ్ బాఖిర్(అ.స) తల్లీ మరియు తండ్రి ఇద్దరి తరపు నుంచి ఫాతెమీ మరియు అలవీ సంతానం. తండ్రి ఇమామ్ సజ్జాద్(అ.స) మరణించేటప్పుడు ఇమామ్ బాఖిర్(అ.స)కి 39 సంవత్సరాల వయసు.  
ఇమామ్ బాఖిర్(అ.స) యొక్క ఇమామత్ కాలం 18 సంవత్సరాలు. హిజ్రీ యొక్క 114వ సంవత్సరంలో మదీనహ్ లో విషం ద్వార చంపబడ్డారు. వారి సమాధి వారి తండ్రి మరియు పితామహుల ప్రక్కలో “బఖీ” స్మశానంలో ఉంది.

ఇమామ్ యొక్క కాలంలో ఉన్న అధికారులు
ఇమామ్ బాఖిర్(అ.స) యొక్క ఇమామత్ కాలంలో అధికారంలో ఉన్న అధికారులు.
1. వలీద్ ఇబ్నె అబ్దుల్ మలిక్ – హిజ్రీ86 నుంచి 96 వరకు.
2. సులైమాన్ ఇబ్నె అబ్దుల్ మలిక్ - హిజ్రీ 96 నుంచి 99 వరకు.
3. ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్ - హిజ్రీ 99 నుంచి 101 వరకు.
4. యజీద్ ఇబ్నె అబ్దుల్ మలిక్ - హిజ్రీ 101 నుంచి 105 వరకు.
5. హిషామ్ ఇబ్నె అబ్దుల్ మలిక్ - హిజ్రీ 105 నుంచి 125 వరకు.

విజ్ఞాన ఉద్యమ వ్యవస్థాపకుడు
ఇమామ్ బాఖిర్(అ.స) తన ఇమామత్ కాలంలో, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, అల్లాహ్ జ్ఞానాన్ని, ఇస్లాం ఆదేశాలను ప్రచారం చేశారు మరియు విజ్ఞాన కష్టాలను తీర్చారు. విజ్ఞాన ఉద్యమాన్ని మొదలు పెట్టారు. మెల్ల మెల్లగా అది వారి కుమారుడు ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) కాలంలో “ఇస్లామీయ గొప్ప విధ్యాలయంగా” మారింది.
ఇమామ్ బాఖిర్(అ.స) యొక్క విజ్ఞానం, ఉదారత్యం, గుణం, ప్రతిష్టత మరియు గొప్పతనాన్ని మిత్రులు మరియు శత్రువులు కూడా అంగీకరించేవారు. వారి నుంచి ఇస్లాం అహ్కాములకు, తఫ్సీర్, చరిత్ర మరియు వివిధ విజ్ఞానాలకు సంబంధించి ఎన్నో హదీసులు ఉల్లేఖించబడ్డాయి.[1]

సామాజిక మరియు రాజకీయ పరిస్థితులు
ఇమామ్ బాఖిర్(అ.స) కాలంలో ఐదుగురు అమవీ అధికారులు గతించారు అని ఇంతకు ముందు చెప్పబడం జరిగింది వారిలో ప్రతీ ఒక్కరి ప్రత్యేకతల ద్వార అప్పటి పరిస్థితులు తెలుస్తాయి. ఈ అధికారులు అన్యాయం మరియు దుర్మార్గపు చర్యల విషయంలో తమ పూర్వీకు తక్కువేమి కాదు, కాని సామజీక వ్యవహారములలో మరియు పరిపాలన విషయంలో తేడాలు ఉన్నాయి. ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం:
వలీద్ ఇబ్నె అబ్దుల్ మలిక్:
వలీద్ ఇబ్నె అబ్దుల్ మలిక్ అభివృద్ధిని ఇష్టపడేవాడు. సాంస్కృతిక మరియు సామాజిక సేవలు చేయడం ఉదారణకు ఆస్పత్రులు, అనాధాశ్రయాలు వంటివి కట్టడం. ఇతడి కాలంలో అమవీయుల అధికారం తూర్పుపడమరల వరకు వ్యాపించింది. వారి ఉండలూసియా వరకు వారి విజయాలు చేరాయి. ఇవి ఇలా ఉన్నప్పటికీ అతడికి విద్యలేదు, అన్యాయం మరియు ఘాతకం అతడిలో ఉంది.
సులైమాన్ ఇబ్నె అబ్దుల్ మలిక్:
సులైమాన్ ఇబ్నె అబ్దుల్ మలిక్ లగ్జరీ లైఫ్‌ను ఇష్టపడేవాడు, మనోవాంఛల భక్తుడు. తన క్రింద పనిచేసేవారి విషయంలో స్వతహాగా నిర్ణయాలు తీసుకొని నచ్చినవారిని మరియు తమ సమూహానికి చెందినవారితో ఒక విధంగానూ తమకు సంబంధం లేని వారితో మరో విధంగా ప్రవర్తించేవాడు. చరిత్రలో అతడు చేసిన అన్యాయపు చర్యలు చాలా ఉన్నాయి.
యజీద్ ఇబ్నె అబ్దుల్ మలిక్:
యజీద్ ఇబ్నె అబ్దుల్ మలిక్ బాధ్యతలేనివాడు, నిత్యం మనోవాంఛల విధేయుడై ఉండేవాడు. ఇస్లాం బోధనలకు కట్టుబడి ఉండేవాడు కాదు. ఇందుమూలంగా అమవీయుల అధికారుల పాలనలలో ఇతడి అధికార కాలం చీకటి కాలంగా నిర్ధారించబడింది. ఇతడి కాలంలో ఎటువంటి విజయం వారికి దక్కలేదు, ఇస్లామీయ సమాజంలో ఎటువంటి ప్రకాశవంతమైన చర్య జరగలేదు. అతడి అన్యాయపు ప్రవర్తన ముస్లిముల ద్వేషాన్ని ప్రేరేపించింది. చివరికి బనీ ఉమయ్యహ్ పెద్దలు అతడి చర్యల పట్ల విమర్శలు వ్యక్తం చేశారు.
హిషామ్ ఇబ్నె అబ్దుల్ మలిక్:
హిషామ్ ఇబ్నె అబ్దుల్ మలిక్ పిసినారి, రాతి గుండె, అసభ్యుడు, ఘాతకుడు, కనికరంలేని వాడు మరియు మాటకారి. అతడు ధనం ప్రోగు చేసే మరియు అభివృద్ధికి ప్రయత్నించేవాడు. అతడి కాలంలో హస్తకళలు అభివృద్ధిలోకి వచ్చాయి కాని కనికరం లేని మరియు రాతి గుండె గలవాడు కావడంతో ప్రజల జీవితం కఠోరమయ్యింది. అప్పటి సమాజం నుంచి మానవ భావోద్వేగాల విలువలు తగ్గడం మొదలయ్యాయి. ఇతడు ఇమామ్ బాఖిర్(అ.స)ను ఇంతకు ముందు ఖలీఫాల కన్నా ఎక్కువ ఒత్తిడికి గురి చేశాడు.
ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్:
ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్, ఖలీఫాల క్రమం నుంచి ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్ ను తప్పకుండా వేరు చేయాలి. ఇతను మిగతావారితో పోల్చి సూస్తే న్యాయానికి కట్టుబడి ఉండేవాడు. దైవప్రవక్త(స.అ) అహ్లెబైత్(అ.స) పట్ల ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగివుండేవాడు. అతడు బనీ హాషిమ్ మరియు ఫాతెమియూన్ లకు జరిగిన అన్యాయాల మరియు సామూహిక న్యాయ చర్యలను సమాజంలో తీసుకొచ్చాడు. వాటిలో ముఆవియా కాలం నుంచి అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స)ను దూషించడం రీతిగా మారిన విధానాన్ని నిషేధించాడు. ఫిదక్ భూమిని తిరిగి హజ్రత్ ఫాతెమా(స.అ) పిల్లలకు తిరిగి ఇచ్చాడు. అరేబీయాకు చెందని ముస్లిములకు అధికారం తరపు నుంచి ఇవ్వబడే రొక్కము అరేబీయ ముస్లిములకు ఇవ్వబడే రొక్కములలో సమానత్వం ఉండేది కాదు, వారికి మద్దత్తు తెలిపాడు. ఖులఫాల ద్వార నిషేదించబడ్డ హదీస్ లేఖనాన్ని తిరిగి రద్దు చేసి. ముహద్దిసీనులను హదీసుల ఉల్లేఖన మరియు వాటి సేకరణ విషయంలో ప్రోత్సహించారు.[2]

రిఫరెన్స్
1. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, ఖుమ్, మన్షూరాతు మక్తబతు బసీరతీ, పేజీ261.
2. సీవ్తీ, తారీఖుల్ ఖులఫా, తా3, తహ్ఖీఖ్: మొహమ్మద్ మొహ్యుద్దీన్ అబ్దుల్ హమీద్, ఖాహిరహ్, మత్బఅతుల్ మదనీ, పేజీ230.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18