ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స)

శని, 08/21/2021 - 18:12

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) కాలపు అధికారులు మరియు వారి జ్ఞాన ప్రతిష్టత, వారి విద్యాలయం...

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స)

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స), దైవప్రవక్త(స.అ) యొక్క 6వ ఉత్తరాధికారి. వారి పేరు “జాఫర్”, కున్నియత్ “అబూ అబ్దిల్లాహ్”, బిరుదు “సాదిఖ్”. తండ్రి ఇమామ్ మొహమ్మద్ బాఖిర్(అ.స) మరియు తల్లి “ఉమ్మె ఫర్వా”
హిజ్రీ యొక్క 83వ ఏట రబీవుల్ అవ్వల్ మాసం 17వ తేదీన మదీనహ్ లో జన్మించారు. 65 సంవత్సరాల వయసులో హిజ్రీ యొక్క 147వ ఏట విషం ద్వార చంపబడ్డారు. వారి సమాధి “బఖీ” స్మశానంలో ఉంది.
అమవీ అధికారులు
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) 114వ సంవత్సరంలో ఇమామత్ పదవీ స్వీకరణ చేశారు. వారి ఇమామత్ కాలం ఐదుగురు “అమవీ” అధికారుల మరియు ఇద్దరు “అబ్బాసీ” అధికారుల పాలనలో గడిచింది. వారి పేర్లు ఇవి:
1. హిషామ్ ఇబ్నె అబ్దుల్ మలిక్ – హిజ్రీ 105 నుంచి 125 వరకు
2. వలీబ్ ఇబ్నె యజీద్ ఇబ్నె అబ్దుల్ మలిక్ – హిజ్రీ 125 నుంచి 126 వరకు
3. యజీద్ ఇబ్నె వలీద్ ఇబ్నె అబ్దుల్ మలిక్ - హిజ్రీ 126
4. ఇబ్రాహీమ్ ఇబ్నె వలీద్ ఇబ్నె అబ్దుల్ మలిక్ - హిజ్రీ 126వ సంవత్సరంలో 70 రోజులు
5. మర్వాన్ ఇబ్నె మొహమ్మద్ “మర్వానె హిమార్” అని ప్రఖ్యాతి చెందినవాడు - హిజ్రీ 126 నుంచి 132 వరకు
అబ్బాసీ అధికారులు
1. అబ్దుల్లాహ్ ఇబ్నె మొహమ్మద్, “సఫ్ఫాహ్” అను పిలవబడేవాడు - హిజ్రీ 132 నుంచి 137 వరకు
2. అబూ జాఫర్, మన్సూరె దవానెఖీ - హిజ్రీ 137 నుంచి 158 వరకు
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) యొక్క జ్ఞాన ప్రతిష్టత
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) యొక్క జ్ఞాన ప్రతిష్టత నిదర్శనలతో చరిత్ర పుస్తకాలు నిండిపోయి ఉన్నాయి. దీన్ని షియా మరియు అహ్లె సున్నత్ విద్వాంసులందరు అంగీకరిస్తారు. వారి జ్ఞానం ముందు పెద్ద పెద్దలు తల వంచారు మరియు ప్రశంసలు చేశారు.హనఫీయుల ఇమామ్, అబూహనీఫా ఇలా అనెను:
“నేను జాఫర్ ఇబ్నె ముహమ్మద్ కు మించిన జ్ఞానిని చూడలేదు”.
మాలికీయుల ఇమామ్, మాలిక్ ఇలా అనెను:
“చాలా కాలం వరకు జాఫర్ ఇబ్నె ముహమ్మద్ వద్దకు వస్తూవెళ్తూ ఉండేవాడిని, వారిని నిరంతరం ఈ మూడు స్థితిలో ఏదో ఒక స్థితిలో చూసే వాడిని; నమాజ్ చదువుతూ ఉండేవారు, లేదా ఉపవాసం ఉండేవారు లేదా ఖుర్ఆన్ పఠిస్తూ ఉండేవారు. వారిని ఎప్పుడు కూడా ఉజూ లేకుండా హదీస్ ను చెప్పినట్టు చూడలేదు”.
వివిధ వర్గాల పెద్ద పెద్ద ఇమాములు మరియు జ్ఞానలు ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) నుంచి హదీసులను ఉల్లేఖించేవారు. ఉదాహరణకు “యహ్యా ఇబ్నె సయీద్”, “ఇబ్నె జురైహ్”, “మాలిక్”, “సుఫ్యాన్ ఇబ్నె ఉయైయ్నె”, “అబూ హనీఫా”, “షుఅబహ్” మరియు “అయ్యూబె సజిస్తానీ” వీరందరూ వారి నుండి హదీసులను ఉల్లేఖించేవారు.[సీమాయే పీష్వాయాన్, పేజీ96]

రాజకీయ, సామాజిక మరియు సాంస్కృతిక పరిస్థితులు

ఇమామ్ సాదిఖ్(అ.స) కాలంలో ఉన్న పరిస్థితులు మిగత ఇమాముల కాలం పరిస్థితులకు మాదిరి లేకపోవడంతో ఇమామ్ సాదిఖ్(అ.స)కు జ్ఞాన మరియు సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి అవకాశం లభించింది.

జాఫరీ విశ్వవిద్యాలయం
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] కాలంలో అమవీయుల మరియు అబ్బాసీయులకు మధ్య జరిగిన అధికార వివాదాల కారణంగా ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] కు మంచి అవకాశం లభించింది, ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఆ అవకాశాన్ని వదుకోలేదు వారి తండ్రి మొదలు పెట్టిన మార్గాన్నే ముందుకు కొనసాగించారు, విద్యార్ధులను తయారు చేశారు, దాంతో చాలా పెద్ద విద్యాలయం స్థాపించబడింది.
వారి ప్రముఖ విద్యార్ధులలో ముందుగా వచ్చే పేర్లు: “హిషామ్ ఇబ్నె హకమ్”, “ముహమ్మద్ ఇబ్నె ముస్లిం”, “అబాన్ ఇబ్నె తగ్లబ్”, “హిషామ్ ఇబ్నె సాలిమ్”, “మొమినె తాఖ్”, “ముఫజ్జల్ ఇబ్నె ఉమర్”, “జాబిర్ ఇబ్నె హయ్యాన్” మొదలగువారు. వీళ్ళలో ప్రతీ ఒక్కరు పలు ప్రత్యేక విద్యలలో ప్రవీణులు. వీళ్ళలో కొందరు చాలా మందికి విద్యను నేర్పారు మరియు చాలా పుస్తకాలు రచించారు. ఉదాహారణకు “హిషామ్ ఇబ్నె హకమ్” 31 సంపుటాలు రచించారు. “జాబిర్ ఇబ్నె హయ్యాన్” కూడా రెండు వందల కన్న ఎక్కువ పుస్తకాలను వివిధ విద్యలలో రచించారు. ఇతని పుస్తకాలు వివిధ భాషలలో అనువదించబడ్డాయి.[సీమాయే పీష్వాయాన్, పేజీ101]
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] యొక్క ఈ ప్రయత్నం వలనే ఈనాడు ప్రపంచమంతటా జాఫరీ విశ్వవిద్యాలయాలు నడుస్తూ ఉన్నాయి మరియు రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నాయి.

రిఫరెన్స్
మహ్దీ పీష్వాయీ, సీమాయే పీష్వాయాన్, పేజీ101.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8