ఇమామ్ మూసా కాజిమ్(అ.స)

సోమ, 08/23/2021 - 18:37

ఇమామ్ మూసా కాజిమ్(అ.స) కాలం యొక్క పరిస్థితులు మరియు హారూన్ అల ్ రషీద్ గురించి సంక్షిప్తంగా...

ఇమామ్ మూసా కాజిమ్(అ.స)

దైవప్రవక్త(స.అ) 7వ ఉత్తరాధికారి హజ్రత్ మూసా(అ.స). వారి బిరుదు కాజిమ్. తల్లి “హమీదహ్” తండ్రి హజ్రత్ సాదిఖ్(అ.స). ఇమామ్ మూసా కాజిమ్(అ.స) సఫర్ మాసం 7వ తేదీ హిజ్రీ యొక్క 128వ సంవత్సరంలో “అబ్వా”[1]లో జన్మించారు. వారు రజబ్ మాసం, హిజ్రీ యొక్క 183వ సంవత్సరంలో 55 వయసులో హారున్ అల్ రషీద్ ఆదేశానుసారం విషం ద్వార చంపబడ్డారు. వారు బగ్దాద్(ఇరాఖ్) లో ఉన్న “కాజిమైన్” పట్టణంలో సమాధి చేయబడ్డారు.

ఇమామ్ కాలంలో అధికారంలో ఉన్న ఖలీఫాలు
ఇమామ్ కాజిమ్(అ.స) యొక్క ఇమామత్ కాలంలో అధికారంలో ఉన్న అధికారులు.
1. మన్సూరె దవానెఖీ – హిజ్రీ136 నుంచి 158 వరకు.
2. మొహమ్మద్ (మహ్దీగా ప్రసిద్ధిగలవాడు) - హిజ్రీ 158 నుంచి 169 వరకు.
3. హాదీ - హిజ్రీ 169 నుంచి 170 వరకు.
4. హారూన్ - హిజ్రీ 170 నుంచి 193 వరకు.
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) చివరి రోజుల్లో అబ్బాసీ దుర్మార్గపు ఖలీఫా అయిన “మన్సూరె దవానెఖీ” అధికారంలో ఉన్నాడు. ఇతడు తన అధికారాన్ని బలపరుచుకోవడానికి చాలా మందిని చంపాడు. కేవలం షియా వర్గానికి చెందినవారినే కాకుండా అతడిని వ్యతిరేకించిన అహ్లె సున్నత్ వర్గానికి చెందిన గొప్ప గొప్ప వ్యక్తులను కూడా కష్టాలకు గురి చేశాడు. “అబూహనీఫా”ను కొరడాలతో కొట్టించి కారాగారంలో బంధించాడు.[2] ఇమామ్ కాజిమ్(అ.స) తన తండ్రి మరణానంతరం, 27 సంవత్సరాల వయసులో ఇంలాంటి కిరాతకుడి అధికారంలో ఇమామత్ బాధ్యతను నిర్వర్తించారు.

జాఫరీ విధ్యాలయం రక్షణ
అప్పటి పరిస్థితులను బట్టి, మన్సూర్ అధికారం ఆరంభం నుంచే  ప్రతీ విషయంలో తీవ్రమైన తీర్మానాలను చూస్తూ ఇమామ్ కాజిమ్(అ.స) తన తండ్రి యొక్క జ్ఞాన సేవల విధంగా పెద్ద ఎత్తున సేవలు అందించడం సరికాదు అని భావించి – జాఫరీ విధ్యాలయం అంత పెద్దదిగా కాకుండా – విధ్యాలయాన్ని స్థాపించి గొప్ప గొప్ప వ్యక్తులకు శిక్షణ ఇచ్చారు.
“ఇబ్నె హజరె హైసమీ” అహ్లె సున్నత్ వర్గానికి చెందిన ప్రముఖ ముహద్దిస్ మరియు ఆలిమ్, ఇలా రచించెను:
“మూసా కాజిమ్ తన తండ్రి యొక్క విజ్ఞానం మరియు విద్యల వారసుడు, వారు ప్రతిష్టతలు కలిగివున్న ఉత్తములు”[3]

హారూన్; అనేకుడు
ఈనాడు పరిశోధనల ద్వార ఒక మనిషిలో ఎన్నో వ్యక్తిత్వాలు ఉండవచ్చు అని తెలుసున్నారు. ఇంలాంటి వారిని అనేక వ్యక్తిత్వాలు కలిగివున్నవాడు(మల్టీ పర్సనాలిటి) అని అంటారు. చరిత్రలో కూడా చాలా మంది ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు వారిలో ఒకడు “హారూన్” ఇతడు ఖిలాఫత్ కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే వినోదాలకు, మద్యపానియాలకు అలవాటు పడడం. మరో వైపు ముస్లిముల ఖలీఫాగా నియమించబడడం. ఒక ముస్లిం అవ్వడంతో అతడు కొన్ని విధానాలకు కట్టుబడి ఉండాలి అందులోను ముస్లిముల ఖలీఫా అవ్వడం. ఈ విధంగా అతడు మంచి చెడ్డల లేహ్యంగా మారాడు. అతడిలో ఆశ్చర్యకరమైన వివిధ వ్యతిరేక వ్యక్తిత్వాలు కనబడేవి. న్యాయం అన్యాయం, దయా కఠోరత్వం, విశ్వాసం అవిశ్వాసం లాంటివి అతడిలో ఉండేవి. ఒకవైపు దైవప్రవక్త(స.అ) కుటుంబానికి చెందిన అమాయకపు వారిని చంపేవాడు మరోవైపు పండితులు, జ్ఞానులు మరియు సన్యాసులు ప్రళయదినం గురించి లేదా పాపముల గురించి ఉపన్యాసమిస్తే చాలా ఏడ్చేవాడు! అతడు నమాజ చదివేవాడు మరో వైపు మద్యసేవించేవాడు.   
హారున్ గురించి “అగానీ” అను గ్రంథంలో ఆసక్తికరమైన వాక్యం ఉంది: “హారూన్ సద్బోధనలు వింటున్నప్పుడు అందరికంటే ఎక్కువగా ఏడుస్తాడు అలాగే కోపంగా ఉన్నప్పుడు అందరి కంటే ఎక్కువగా ఘాతకంగా ఉంటాడు!”[4]

ఇస్లామీయ అధికారం రావాలనే కోరిక
హారూన్ కు ఇమామ్ కాజిమ్(అ.స) మరియు వారి సహచరులు, దైవప్రవక్త(స.అ) ఖిలాఫత్ ను అతడు ఖబ్జా చేసుకొని ఉన్నాడు మరియు దుర్మార్గుడు అని అనుకుంటున్నారని తెలుసు. అలాగే వారికి ఇతడితో యుద్ధం చేసే బలగం ఏర్పడితే ఇతడి అధికారాన్ని నాశనం చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు, అని కూడా తెలుసు. క్రింద వివరించబడే ఇమామ్ మరియు హారూన్ మధ్య జరిగిన సంభాషణ ద్వార ఇమామ్ ఇస్లామీయ అధికారం రావాలానే ఆశతో ఉన్నారని తెలుస్తుంది.
ఒకరోజు హారూన్(బహుశా ఇమామ్ ను పరీక్షించాలనే మరియ వారి ఆలోచనను తెలుకోవాలనే ఉద్దేశంతో) ఇమామ్ తో “ఫిదక్”ను మీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను.
ఇమామ్: నేను ఫదక్ ను తీరిగి తీసుకోవాలంటే నాకు దాని పూర్తి హద్దులతో పాటు తిరిగి ఇవ్వాలి.
హారూన్: దాని సరిహద్దులు ఏమిటి?
ఇమామ్: దాని హద్దులు చెబితే నువ్వు ఏమాత్రం తిరిగి ఇవ్వవు. హారూన్ పట్టుబట్టాడు, ప్రమాణంగా తిరిగి ఇస్తాను అని మాటిచ్చాడు. ఇమామ్ దాని హద్దులను ఇలా వివరించారు:
మొదటి హద్దు, ఉద్న్; రెండవ హద్దు, సమర్ ఖంద్; మూడవ హద్దు ఆఫ్రీకా; నాలుగొవ హద్దు ఉర్మియా ప్రాంతాలు మరియు ఖజర్ సముద్రం.
ఈ హద్దుల వివరణ విన్న హారూన్ రంగు మార్చి తీవ్రనిరాశకు గురి అయి కంట్రోల్ తప్పి కోపంగా ఇలా అన్నాడు: ఈ విధంగా చూసుకుంటే ఏదీ మాకోసం మిగలదు!
ఇమామ్: నాకు తెలుసు నువ్వు అంగీకరించవని. అందుకే నేను చెప్పలేదు.[5]
ఇమామ్ కాజిమ్(అ.స), హారూన్ కు ఇలా సమాధానం ఇచ్చి ఇలా చెప్పాలనుకున్నారు: “ఫదక్” ఇస్లామీయ అధికార వ్యాప్తికి కారణం. సఖీఫాకు చెందిన సహాబీయులు దైవప్రవక్త(అ.స) కుమార్తె మరియు అల్లుడు నుంచి అన్యాయంగా తీసుకున్నారు, నిజానికి వారి ఈ చర్య అహ్లె బైత్(అ.స) నుంచి వారి అధికార హక్కును జప్తు చేసుకున్నట్లు, ఇందుమూలంగా మా హక్కును తిరిగి ఇవ్వాలనుకుంటే నిస్సందేహముగా ఇస్లామీయ అధికారం వ్యాపించబడిన అన్ని ప్రాంతాలు మాకు అప్పగించాలి.
వారి మధ్య ఈ సంభాషణ, ఇమామ్ యొక్క లక్ష్యాన్ని చాలా వివరంగా తెలియపరుస్తుంది.

రిఫరెన్స్
1. మదీనహ్ చుట్టుప్రక్కలలో ఉన్న గ్రామాలలో ఒక గ్రామం.
2. సీవ్తీ, తారీఖుల్ ఖులఫా, బగ్దాద్, మక్తబతుల్ ముసన్నా, పేజీ259.
3. సవాయిఖుల్ ముహ్రిఖహ్, ఖాహిరహ్, మక్తబతుల్ ఖాహిరహ్, పేజీ203.
4. సీరయె పీష్వాయాన్, మహ్దీ పీష్వాయీ, పేజీ454.
5. సీరయె పీష్వాయాన్, మహ్దీ పీష్వాయీ, పేజీ456.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21