ఇమామ్ అలీ రిజా(అ.స)

మంగళ, 08/24/2021 - 17:09

ఇమామ్ అలీ రిజా(అ.స) మరియు వారి కాలపు అధికారులైన అమీన్ మరియు మామూన్ల గురించి సంక్షిప్త వివరణ...

ఇమామ్ అలీ రిజా(అ.స)

హజ్రత్ ఇమామ్ అలీ ఇబ్నె మూసా అల్ రిజా(అ.స), దైవప్రవక్త(స.అ) యొక్క 8వ ఉత్తరాధికారి. వారు జీఖఅదహ్ మాసం 11వ తేదీ హిజ్రీ యొక్క 148వ సంవత్సరంలో జన్మించారు.[1] తండ్రి ఇమామ్ మూసా కాజిమ్(అ.స), తల్లి “తుక్‌తమ్”. ఇమామ్ రిజా(అ.స)ను జన్మనిచ్చిన తరువాత ఇమామ్ కాజిమ్(అ.స) తరపు నుంచి ఆమె “తాహెరా” అను పిలవబడ్డారు. ఇమామ్ రిజా(అ.స) కున్నియత్ “అబుల్ హసన్”, బిరుదు “రిజా”. వారి తండ్రి బగ్దాద్ పట్టణ కారాగారంలో విషం ద్వార చంపబడిన తరువాత 35 సంవత్సరాల వయసులో ఇమామత్ పదవి స్వీకరణ చేశారు.

ఇమామ్ కాలపు ఖులపాలు
ఇమామ్ రిజా(అ.స) యొక్క ఇమామత్ కాలం 20 సంవత్సరాలు, అందులో 10 సంవత్సరాలు “హారున్ అల్ రషీద్” ఖిలాఫత్ కాలం, 5 సంవత్సరాలు “అమీన్” ఖిలాఫత్ అధికారం మరియు చివరి 5 సంవత్సరాలు “మామూన్” ఖిలాఫత్ కాలంలో గడిచాయి.
“మామూన్” ఖిలాఫత్ వరకు ఇమామ్(అ.స) జన్మస్థలం అయిన మదీనహ్ లోనే ఉన్నారు, కాని మామూన్ అధికారంలో వచ్చిన తరువాత మామూన్, ఇమామ్ ను ఖురాసాన్(ఇరాన్)కు ఆహ్వానించాడు. ఇమామ్ సఫర్ మాసం 203హిజ్రీలో 55 సంవత్సరాల వయసులో విషం ద్వార చంపబడ్డారు. ఇమామ్ సమాధి ఖురాసాన్ పట్టణంలో ఉంది.

హారూన్ అధికారంలో ఇమామ్
ఇమామ్ యొక్క 10 సంవత్సరాల ఇమామత్ కాలం హారూన్ అల్ రషీద్ కాలంలో గడిచింది. ఈ కాలంలో ఇమామ్ సాంస్కృత మరియు విజ్ఞాన సేవల విషయంలో స్వేచ కలిగివుండేవారు, ఎందుకంటే ఈ కాలంలో హారూన్ ఇమామ్ కు ఒత్తిడికి గురి చేయలేదు. వారు స్వాతంత్ర్యంగా తమ కార్యక్రమాలను నిర్వర్తించేవారు. వారు ఈ కాలంలో గొప్ప గొప్ప శిష్యులను శిక్షణ ఇచ్చారు.
హారూన్ ఇమామ్ పై ఒత్తిడి వేయకపోవడానికి గల కారణం, ఇమామ్ కాజిమ్(అ.స)ను చంపించిన విషయం బయటపడకుండా ఉండడం. అయినా సరే చివరికి ఆ రహస్యం బయట పడింది. ప్రజలు హారూన్ ను అసహ్యించుకున్నారు. హారూన్ తన ఈ దూర్మార్గపు చర్య ఇంకా వ్యాపించకుండా ఉండడానికి ఇమామ్ రిజా(అ.స)పై ఒత్తిడి వేయలేదు.

అమీన్ మరియు మామూన్ ఖిలాఫత్ కాలంలో ఇమామ్
హారూన్ తన ఖిలాఫత్ కాలంలో “మొహమ్మద్ అమీన్” ను తన ఉత్తరాధికారిగా నియమించి ప్రజల నుంచి అతడి కోసం బైఅత్ ను తీసుకున్నాడు. “అబ్దుల్లాహ్ మామూన్” ను తన రెండవ ఉత్తరాధికారిగా నియమించాడు. హిజ్రీ యొక్క 193వ సంవత్సరంలో ఖురాసాన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరి తిరుగుబాటు చర్యలు జరుగుతన్నాయి అని హారూన్ కు తెలియడం ద్వార అతడు తన మొదటి ఉత్తరాధికారి అయిన అమీన్ ను బగ్దాద్ లో ఉంచి రెండవ ఉత్తరాధికారి అయిన మామూన్ ను తన వెంటి ఖురాసాన్ కు తీసుకొని వెళ్లాడు. హారూన్ ఖురాసాన్ పరిస్థితులను శాంతింపజేశాడు. కాని తిరిగి బగ్దాద్ కు తిరిగి వెళ్లలేకపోయాడు. హారూన్ అదే సంవత్సరం జుమాదస్సానియ మాసం 3వ తేదీన తూస్ లో మరణించాడు.

అమీన్ అపజయం
హారూన్ తూస్ లో మరణించాడు. అదే రోజు రాత్రి బగ్దాద్ లో ప్రజలు అతడి కుమారుడు “మొహమ్మద్ అమీన్”తో బైఅత్ చేశారు. అధికారంలోకి వచ్చిన 18 రోజులు గడవక ముందే తన సోదరుడు మామూన్ ను ఉత్తరాధికారం నుంచి తొలగించి తన కుమారుడు “మూసా”ను తన ఉత్తరాధికారిగా నియమించాడు. అటు వైపు మామూన్, అమీన్‌ను ఉత్తరాధికారం నుంచి తొలగిస్తున్నాను అని ప్రచారం చేశాడు. కొన్ని ఘర్షణల మరియు విబేధాల తరువాత అమీన్ 198హిజ్రీలో చంపబడ్డాడు. ఈ విధంగా అమీన్ మరణానంతరం ఇస్లామీయ అధికారం మామూన్ చేతికి వచ్చింది.
ఈ కాలంలో కూడా ఇమామ్ పై అంతగా ఒత్తిడి ఉండేది కాదు. వారు స్వేచ్ఛగానే తన వ్యవహారాలను చూసుకునేవారు.

మామున్ తరపు నుంచి ఇమామ్ కు ఖురాసాన్ కు ఆహ్వానం
మామూన్ మొదట్లో గౌరవంగా ఇమామ్ ను అలీ(అ.స) సంతానం నుండి పెద్దవారి ద్వార ఖురాసాన్ కు రమ్మని ఆహ్వానం పంపాడు. ఇమామ్, మామూన్ యొక్క ఆహ్మానాన్ని అంగీకరించలేదు, కాని మామూన్ పట్టుబట్టి, గట్టి ప్రయత్నం చేసి, ఎన్నో ఉత్తరాలు వ్రాసి చివరికి అబూతాలిబ్ సంతానం నుంచి కొంతమందితో పాటు కలిసి ఇమామ్ “మర్వ్” పట్టణానికి బయలుదేరారు.[2]
ఇమామ్ రిజా(అ.స) తనకు ఈ ప్రయాణం ఇష్టంలేదు అని ప్రజల ముందు వ్యక్తం చేశారు. మదీనహ్ నుంచి బయలు దేరేటప్పడు తమ కుటుంబ సభ్యులను పిలిచి తన పై ఏడవమని కోరి ఇలా అన్నారు.. నేను ఇక తిరిగి నా కుటుంబ సభ్యుల వద్దకు తిరిగి రాను.[3]

ఇమామ్ కు ఖిలాఫత్ ప్రతిపాదన
ఇమామ్ “మర్వ్”కు వచ్చిన కొన్ని రోజుల తరువాత, ఇమామ్ మరియు మామూన్ మధ్య చర్చలు మొదలయ్యాయి. మామూన్ ఇమామ్ ను ఖిలాఫత్ పదివిని స్వీకరించమని కోరాడు. కాని ఇమామ్ ఏమాత్రం ఒప్పుకోలేదు.
అప్పుడు ఇలా అన్నాడు: “అల్లాహ్ సాక్షిగా నామాటను గౌరవించి నా ఉత్తరాధికారాన్ని స్వీకరించకపోతే, బలవంతంగా అంగీకరించేటట్లూ చేస్తాను, అయినా ఒప్పుకోకపోతే మీ ప్రాణాలు తీస్తాను!!”[4]
ఇమామ్ కు మరో దారి లేక మామూన్ మాటను ఒప్పుకొని ఇలా అన్నారు: “నేను నీ విలాయత్ అహదీ(ఉత్తరాధికారాన్ని) ఒక షరత్తుపై అంగీకరిస్తాను; అధికార వ్యవహారములలో నేను రాను, ఖిలాఫత్ కు సంబంధించిన చర్యలు ఉదా; పదవుల నుంచి తొలగించే మరియు సంస్తాపించే విషయాలలో, ఫత్వా ఇవ్వడంలో నా జోక్యం ఉండకూడదు”[5]

రిఫరెన్స్
1. కులైనీ, అల్ ఉసూల్ మినల్ కాఫీ, తహ్రాన్, మక్తబతుస్సదూఖ్, 1381హి, భాగం1, పేజీ 486. షైఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, ఖుమ్, మన్షూరాతు మక్తబతు బసీరతీ, పేజీ304.
2. అలీ ఇబ్నె ఈసా అల్ ఇర్బలీ, కష్ఫుల్ గుమ్మహ్, తబ్రీజ్, మక్తబతు బనీ హాషిమ్, 1381, భాగం3, పేజీ65. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, అల్ ఇర్షాద్, ఖుమ్, మన్షూరాతు మక్తబతి బసీరతీ, పేజీ309.
3. మజ్లిసీ, బిహారుల్ అన్వార్, తెహ్రాన్, అల్ మక్తబతుల్ ఇస్లామియహ్, 1385హి, భాగం49, పేజీ117.
4. సదూఖ్, ఇలల్ అల్ షరాయే, ఖుమ్, మన్షూరాతు మక్తబతిత్తబాతబాయి, భాగం1, పేజీ226.
5. తబర్సీ, ఎఅలాముల్ వరా, తా3, తహ్రాన్, దారుల్ కుతుబ్ అల్ ఇస్లామియ, పేజీ334. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, ఖుమ్, మన్షూరాతు మక్తబతి బసీరతీ, పేజీ310.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3