ఇమామ్ హసన్ అస్కరీ(అ.స)

శుక్ర, 08/27/2021 - 06:13

ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) కాలం యొక్క అధికారులు మరియు రాజకీయ పరిస్థితుల గురించి సంక్షిప్తంగా...

ఇమామ్ హసన్ అస్కరీ(అ.స)

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

ఇమామ్ హసన్ అస్కరీ(అ.స), దైవప్రవక్త(స.అ) 11వ ఉత్తరాధికారి. హిజ్రీ యొక్క 232వ సంత్సరంలో జన్మించారు. తండ్రి ఇమామ్ అలీ నఖీ(అ.స) తల్లి “హుదైసహ్” కొందరు ఆమె పేరు “సౌసన్” అని అన్నారు. అబ్బాసీ ఖలీఫా తరపు నుంచి ఇమామ్ ను సామెరాలో ఉన్న అస్కరీ ప్రాంతంలో జీవితం గడపడానికి బలవంతం చేయడం వల్ల వారు “అస్కరీ” అని పేరు పొందారు. వారి ప్రముఖ బిరుదులు “నఖీ” మరియు “జకీ”, కున్నియత్ “అబూ ముహమ్మద్”. వారి 22 ఏళ్ల వయసులో వారి తండ్రి మరణించారు. వారి ఇమామత్ కాలం 6 సంవత్సరాలు. హిజ్రీ యొక్క 260వ ఏట 28 సంవత్సరాల వయసులో విషం ద్వార చంపబడ్డారు. వారిని వారి తండ్రి సమాధి ప్రక్కన ఖననం చేశారు.

ఇమామ్ కాలంలో ఉన్న అధికారులు
ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) యొక్క ఆ కొద్ది కాలం ముగ్గురు ఖలీఫాలు అధికారంపై వచ్చారు. ఆ ముగ్గురూ ఒకరిని మించిన దుర్మార్గులు మరియు దుష్టులు. ఆ మూడు ఖలీపాలు:
1. అల్ మొఅతజ్ బిల్లాహ్ – హిజ్రీ 252 నుంచి 255 వరకు
2. అల్ మొహ్తదీ బిల్లాహ్ – హిజ్రీ 255 నుంచి 256 వరకు
3. అల్ మొఅతమిద్ బిల్లాహ్ – హిజ్రీ 256 నుంచి 279 వరకు

రాజకీయ మరియు సామాజిక పరిస్థితులు
ఇంతకు ముందు వివరించినట్లు ఇమామ్ సాదిఖ్(అ.స) నుంచి ఇమామ్ హాదీ(అ.స) వరకు అబ్బాసీ ఖలీఫాల తరపు నుంచి ఒత్తిడి ఉండేది కానీ ఈ ఒత్తిడి ఇమామ్ జవాద్, ఇమామ్ హాదీ మరియు ఇమామ్ అస్కరీ(అ.స) కాలంలో సామెరాలో చాలా ఎక్కువయ్యింది. ఎంత ఎక్కువయ్యిందంటే ఈ ముగ్గురు ఇమాములు చాలా కాలం వరకు జీవించలేదు; ఇమామ్ జవాద్ 25 సంవత్సరాలలో, ఇమామ్ హాదీ 41 సంవత్సరాల వయసులో మరియు ఇమామ్ అస్కరీ(అ.స) 28 సంవత్సరాల వయసుల అనగా మొత్తం 92 సంవత్సరాలలో ముగ్గురు ఇమాములు మరణించారు. ఇదే వారిపై పడిన ఒత్తిడి తెలుస్తుంది. కాని ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) పై మిగత ఇద్దరి ఇమాముల పై పడిన ఒత్తిడికి మించినది. దానికి రెండు కారణాలు ఉన్నాయి:
1. ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) కాలంలో షియాలు ఒక పెద్ద బలమైన వర్గంగా మారింది. ఈ వర్గం ఖలీఫాలకు వ్యతిరేకమని, ఆ ఖలీఫాలను చట్టపరమైన అధికారులు కాదని, ఖిలాఫత్ అధికారం కేవలం అలీ(అ.స) సంతానానిక చెందినదని భావిస్తారని ప్రజలందరికీ తెలుసు. అప్పుడు అలీ(అ.స) సంతానానికి చెందిన వ్యక్తి ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) అని కూడా అందరికీ తెలుసు.
2. సరైన రివాయతుల ప్రకారం, అబ్బాసీ వంశం మరియు వారి అనుచరులకు మహ్దీ అనే వారు వస్తారనీ, మరివారు అధికారాలన్నింటిని నాశనం చేస్తారని తెలుసు, అందుకని నిత్యం వారిపై నిఘా ఉంచేవారు, అంతేకాదు వారి కుమారుడ్ని చేజిక్కించుకొని వారిని చంపాలనే కోరికతో ఉన్నారు.

ఇమామ్ హసన్ అస్కరీ చేపట్టిన ముఖ్య కార్యక్రమాలు
ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) పై ఇన్ని రకాల ఒత్తిడ్లు మరియు నిఘాలు ఉన్నప్పటికీ వారు ఇస్లాం రక్షణ మరియు ఇస్లాం వ్యతిరేక ఆలోచనలతో పోరాడే విషయంలో రాజకీయ, సామాజిక మరియు విజ్ఞాన కార్యక్రమాలను వదలలేదు. వారు చేసిన కార్యక్రమాలను ఈ క్రమంలో సూచించవచ్చు:
1. విజ్ఞాన ప్రయత్నాలు: ఇస్లాం రక్షణ, ఇస్లాం విరోధుల తరపు నుంచి వచ్చే విమర్శలకు సమాదానం ఇవ్వడం మరియు సరైన ఇస్లాం గురించి వారికి తెలియ పరచడం, చర్చలు జరపడం మొ...
2. కమ్యూనికేషన్ నెట్‌వర్క: వివిధ ప్రాంతాలలో ఉన్న షియా అనుచరులతో నియమించబడ్డ ప్రతినిధుల ద్వార, ఉత్తరముల ద్వార సంబంధం ఏర్పర్చడం.
3. రాజకీయ రహస్య చర్యలు: అబ్బాసీ అధికారం తరపు నుంచి ఒత్తిడి మరియు నిఘా ఉన్నప్పటికీ వారు రాజకీయ చర్యలను రహస్యంగా చేసేవారు.
4. ధన సహాయం: షియా అనుచరులకు వారు ధన సహాయం చేస్తూ ఉండేవారు, ముఖ్యంగా వారి సహచరులకు.
5. బలపరచడం మరియు ధైర్యాన్ని ఇవ్వడం: షియా ప్రముఖులను మరియు ముఖ్య వ్యక్తులను కష్టాలకు ఎదురుకునేందుకు నిత్యం ధైర్యాన్ని ఇచ్చేవారు.
6. గైబత్ కాలం: తన కుమారుడైన పన్నెండవ ఇమామ్ యొక్క గైబత్ కాలం కోసం షియాలను సిద్ధం చేయడం.
ఇస్లామీయ గ్రంథాలలో వీటి గురించి స్పష్టంగా వివరించబడి ఉంది.

రిఫరెన్స్
సీరయె పీష్వాయాన్, మహ్దీ పీష్వాయీ, ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) జీవిత చరిత్ర అధ్యాయం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6