హజ్రత్ ఫాతెమా జహ్‌రా(స.అ) జీవిత చరిత్ర

శని, 09/04/2021 - 18:58

దైవప్రవక్త(స.అ) కుమార్తె హజ్రత్ ఫాతెమా జహ్‌రా(స.అ) జీవిత చరిత్ర సంక్షిప్తంగా...

హజ్రత్ ఫాతెమా జహ్‌రా(స.అ) జీవిత చరిత్ర

పేరు: ఫాతెమా జహ్రా(స.అ)
జన్మదినం: జుమాదస్సానియా 20వ తారీకు, బేసత్ యొక్క 5వ ఏట.జన్మస్థలం: మక్కా
భర్త పేరు: హజ్రత్ అలీ(అ.స)
తండ్రి పేరు: హజ్రత్ ముహమ్మద్(స.అ)
తల్లి పేరు: జనాబె ఖదీజా బింతె ఖువైలద్(అ.స)
మరణం: 13 జుమాదల్ వూలా లేదా 3 జుమాదస్సానియా
మరణస్థలం: మదీనా
సమాధి: జన్నతుల్ బఖీ (మదీనా).
ప్రవక్త ముహమ్మద్(స.అ) ఇంట జుమాదస్సానియా 20వ తారీకు, బేసత్ యొక్క 5వ ఏట, శుక్రవారం ఉదయం ఫాతెమా జహ్‌రా(స.అ) జన్మించారు. అప్పుడే జన్మించిన ఆ పాపాను దైవప్రవక్త(స.అ) ఎత్తుకొని “ఫాతెమా నా ప్రాణం, వారి నుండి స్వర్గపు సువాసన వస్తుంది” అన్నారు.
జనాబె ఫాతెమా జహ్‌రా(స.అ), 5 సంవత్సరాల వయసులోనే తమ తల్లిని పోగొట్టుకున్నారు. దైవప్రవక్త(స.అ) వారిని చాలా గౌరవించేవారు, ఎల్లపుడూ “ఫాతెమా నాలోని భాగం, ఎవరైనా ఆమెను ఆనంద పరిస్తే నన్ను ఆనందపరిచినట్టు నన్ను ఆనంద పరచడం అల్లాహ్‌ను ఆనంద పరిచినట్లు, ఆమెను భాధ కలిగిస్తే నన్ను బాధ కలిగించినట్టే, నన్ను బాధ కలిగించడం అల్లాహ్‌ను బాధ కలిగించినట్టు” అనేవారు.
జనాబె ఫాతెమా జహ్‌రా(స.అ) వివాహం హిజ్రీ యొక్క 2వ ఏట హజ్రత్ అలీ(అ.స)తో జరిగింది. వారికి ముగ్గురు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు[1]

పొరుగువారి ప్రముఖ్యత హజ్రత్ ఫాతెమా(అ.స) దృష్టిలో
హజ్రత్ ఫాతెమా(స.అ) గురించి ఆమె పెద్ద కుమారుడు హజ్రత్ హసన్(అ.స) ఇలా వివరించెను.. “ఒక రోజు అమ్మను రాత్రంతా అల్లాహ్‌ను ప్రార్ధింస్తూ, ప్రజల కోసం దుఆ చేస్తుండగా చూశాను. చివరికి సుర్యోదయం అయ్యింది. నేను అమ్మ వద్దకు వెళ్ళి “అమ్మా! నువ్వూ, నీ కోసం ఎందుకు దుఆ చేసుకో లేదు?” అని ప్రశ్నించాను. ఆమె ఇలా అన్నారు: یا بُنَیَّ الْجارُ ثُمَّ الدّارُ; బాబూ! ముందు పొరుగు వారు ఆ తరువాత ఇంట్లో వారు.
పొరుగువారి గురించి ఆమె ఎంతేలా ఆలోచించేవారో, వారి పట్ల మనపై ఎంత బాధ్యత ఉందో ఈ రివాయత్ ద్వార మనకు తెలుస్తుంది.

హిజాబ్ హజ్రత్ ఫాతెమా(స.అ) దృష్టిలో
ఒకరోజు దైవప్రవక్త(స.అ) “ఒక స్ర్తీకి ఏది అన్నింటికి మించిన శ్రేయస్కరం?” అని ప్రశ్నించగా ఫాతెమా(అ.స) “నాన్నాగారు! పరాయి మగాడు ఆమెను చూడ కూడదు అలాగే ఆమె కూడా ఏ పరాయి వ్యక్తిని చూడకూడదు”. ఈ జవాబు విని దైవప్రవక్త(స.అ) చాల సంతోషించారు.
జనాబె ఫాతెమా జహ్‌రా(స.అ) శ్రేష్ఠత్వం గురించి చెప్పాలంటే చాలా వుంది కాని ఈ కొన్ని పేజీలా పుస్తకంలో వారి గురించి చెప్పడం చాలా కష్టం.

హజ్రత్ ఫాతెమా(స.అ) జీవితం స్ర్తీలకు నమూనా
హజ్రత్ ఫాతెమా(స.అ) జీవత కాలం 18 సంవత్సరాలు అందులో 9 సంవత్సరాలు తండ్రి వద్ద మరియు 9 సంవత్సరాలు వారి భర్త హజ్రత్ అలీ(అ.స) వద్ద గడిచాయి. ఆ 18 సంవత్సరాల కాలంలో ఆడది ఒక కూతురు, ఒకభార్య మరియు ఒక తల్లిగా ఎలా ఉండాలో ప్రపంచానికి చాటి చేప్పారు.

హజ్రత్ ఫాతెమా(స.అ) మరణం
హజ్రత్ ఫాతెమా(స.అ) తండ్రి ప్రవక్త ముహమ్మద్(స.అ) మరణించిన 70 లేదా 90 రోజుల్లోనే ఆమె కూడా మృతి చెందారు. కొందరు మునాఫిఖీనులు ఆమె ఇంటికి వచ్చి ఆమె భర్త హజ్రత్ అలీ(అ.స)తో బైఅత్ తీసుకోవడం కొరకు బయటికి రమ్మని, లేకపోతే ఇల్లు తగలబెడతామని బెదిరించారు. ఆ అరుపులు విన్న జనాబె ఫాతెమా జహ్‌రా(స.అ) తలుపు వెనక నుండి “ఈ ఇంట్లో ప్రవక్త మనవళ్ళు హసన్ మరియు హుసైన్(అ.స) ఉన్నారు, కనీసం వారి గురించైనా ఆలోచించండీ” అని అన్నారు. కాని వాళ్శు హజ్రత్ ఫాతెమా(స.అ) మాటలను వినలేదు కొంత సమయం తరువాత వాళ్ళు ఇంటిని తగల బెట్టారు. కాలుతున్న తలుపును తెరవడానికై ప్రయత్నిస్తున్న కపటవర్తనుల ప్రయత్నాన్ని విఫలం చేయడానికై తలుపుకు అటువైపువున్న హజ్రత్ ఫాతెమా జహ్‌రా(స.అ) దానిని తెరవనీయకుండా తమకున్న కొద్ది బలంతో అడ్డుకున్నారు. కాని వాళ్ళలో ఒకడు కొరడాతో కొట్టమని చెప్పగా మరొకడు కొరడా తీసి జహ్రత్ ఫాతెమా జహ్‌రా(స.అ)పై దాడి చేసాడు. ఆ కొరడాతో గాయపడినా సరే హజ్రత్ ఫాతెమా జహ్‌రా(స.అ) అక్కడ నుండి కదల లేదు. కొరడాతో గాయం చేయడమే కాకుండా ఒక దుష్టుడు తలుపును తన కాలితో గట్టిగా తొశాడు. ఆమె తలుపు మరియు గోడ మధ్యలో నలిగిపోవడం వలన వారి గర్భములో ఉన్న పిల్లాడు హజ్రత్ మొహ్‌సిన్(అ.స) చనిపోయారు, అంతేకాక ఆమె ప్రక్కటెముకలు విరిగిపోయాయి. ఇన్ని వేదనలు ఒకేసారి పడడంతో ఆమె స్ప్రహతప్పిపోయారు.
హజ్రత్ ఫాతెమా (స.అ), ఇమామ్ అలీ(అ.స) ఖిలాఫత్ హక్కును పొందడం కొరకు చాలా ప్రయత్నించారు మరియు చాలా అవమానాలు భరించారు.
చివరికి జుమాదల్ వూలా 13వ తేదీ లేదా జుమాదస్సానియా 3వ తేదిన కపటవర్తనుల దాడి వల్ల గాయాల ప్రభావంతో మరణించారు.[2]

రిఫరెన్స్
1. హజ్రత్ అలీ(అ.స) జీవిత చరిత్ర లో వారి పేర్లు మొ..., చూడవచ్చు.
2. షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, ముంతహల్ ఆమాల్, పేజీ 177-186.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10