బర్‌జఖ్ యొక్క అర్ధం మరియు దాని గురించి ఖుర్ఆన్ ఆయతుల వివరణ...
రెండు వస్తువులకు మధ్యనున్న అడ్డును లేక తెరను “బర్‌జఖ్” అని అంటారు. ఇది ఇహలోక జీవితానికీ పరలోక జీవితానికి మద్య “విరామంగా” ఉంటుంది. మరణించిన క్షణం నుంచీ ప్రపంచంతో మనిషి సంబంధం తెగిపోతుంది. పరలోక జీవనం కూడా తక్షణం మొదలవదు. మానవులంతా తిరిగి బ్రతికించబడిన నాటి నుంచే ఈ “మరో లోకం” మొదలవుతుంది. ఈ రెండు లోకాలకు మధ్యనున్న “అవస్థ”ను బర్‌జఖ్ అవస్థ అంటారు. మృతుడు సమాధిలో ఉన్నా, కాకులకు గద్దలకు ఆహారంగా మారినా, కాల్చివేయబడి మట్టిలో కలసిపోయినా, మరేమైనా – అది బర్‌జఖ్ అవస్థగానే పరిగణించబడుతుంది. తుదకు అల్లాహ్ మానవులందరికీ ఓ కొత్త ఉనికిని ఉచ్చి – అందరినీ మహ్‌షర్ మైదానంలో సమావెశపరుస్తాడు.
ఒక్కోసారి బర్‌జఖ్ ను “ఖియామతె సుగ్రా” చిన్నపాటి ఖియామత్ అనీ మరియు మహ్‌షర్ ను “ఖియామతె కుబ్రా” పెద్దపాటి ఖియామత్ అనీ అంటారు.[1]
బర్‌జఖ్ ఖుర్ఆన్ దృష్టిలో
బర్‌జఖ్ గురించి ఖుర్ఆన్ లో ఇలా సూచించబడి ఉంది:
“చివరికి వారిలో ఎవరికైనా చావు వచ్చినప్పుడు, “ఓ ప్రభూ! నన్ను తిరిగి వెనక్కి పంపించు. నేను వదలి వచ్చిన లోకంలోకే వెళ్ళి సత్కార్యం చేస్తాను” అని అంటాడు. ముమ్మాటికీ అలా జరగదు. అది అతను అంటున్న ఒక మాట మాత్రమే. వారు మళ్లీ సజీవులై లేచే రోజు వరకూ వారి వెనక ఒక అడ్డుతెర ఉంటుంది”[సూరయె మోమినూన్, ఆయత్99,100]
ఇలా చెప్పను: “అందుకే నేను చెప్పేది వినండి! నేను మటుకు మీరందరి (ఏకైక) ప్రభువును విశ్వసించాను: “స్వర్గంలో చేరిపో’ అని (అతనితో) అనబడింది. ‘నా జాతి వారికి ఇది తెలిస్తే ఎంత బావుండేది!’ అని అతనన్నాడు. “నా ప్రభువు నన్ను క్షమించి, ఆదరణీయులలో నన్ను చేర్చిన సంగతి”[సూరయె యాసీన్, ఆయత్25-27].
“(ఇదిగో) అగ్ని – దాని ఎదుట వారి ప్రతి ఉదయం, సాయంత్రం రప్పించబడుతుంటారు. మరి ప్రళయం సంభవించినవాడు, ‘ఫిర్ఔన్ జనులను దర్భరమైన శిక్షలో పడవేయండి’(అని సెలవీయబడుతుంది)”[సూరయె గాఫిర్:46].
రిఫరెన్స్
1. కలామె ఇస్లామీ, సయీదీ మెహ్ర్, భాగం2, పేజీ239, కితాబె తాహా.
వ్యాఖ్యానించండి