పశ్చాత్తాపం మరియు క్షమించడం

బుధ, 09/08/2021 - 17:03

దాసుల పశ్చాత్తాపం మరియు తౌబహ్ - అల్లాహ్ క్షమాపణ గురించి ఖుర్ఆన్ ఆయతుల వివరణ...

పశ్చాత్తాపం మరియు క్షమించడం

సాధరణంగా ఖుర్ఆన్ లో అల్లాహ్ శిక్ష ప్రస్తావన ఉన్న ఆయత్ల తరువాత “తౌబా చేసిన వారు తప్ప” అన్న వాక్యం కనిపిస్తుంది. దానికి అర్ధమేమిటంటే సరిదిద్దుకునే మార్గం తెరవబడే ఉంది అని. ఖుర్ఆన్ లో తౌబహ్, పశ్చత్తాపం మరియు అల్లాహ్ కరుణ గురించి ఇలా సూచించబడి ఉంది: “మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు”.[జమర్ సూరహ్, ఆయత్:53]
“ఆయనే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు, వారి తప్పులను మన్నిస్తాడు. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు”[సూరయె షూరా, ఆయత్:25].
కేవలం పశ్చాత్తాపం మరియు క్షమాపణ మరియు మంచి కార్యాలు చేయటమే కాకుండా సన్మార్గంపై స్థిరంగా ఉండటం కూడా చాలా అవసరం,అలా చేసినవారికే అల్లాహ్ క్షమిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు: “అయితే పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సత్కార్యాలు చేసి, ఆపై సన్మార్గంపై స్థిరంగా ఉన్న వారిని నేను అమితంగా క్షమిస్తాను”[సూరయె తాహా, ఆయత్:82]. తౌబహ్, విధి, అది వాజిబ్ చర్య. అల్లాహ్ తౌబహ్ చేయమని ఆదేశిస్తున్నాడు: “ఓ విశ్వాసులారా! అల్లాహ్ వైపు పశ్చాత్తాపంతో మరలండి – నిష్కల్మమైన పశ్చాత్తాపభావంతో! మీ ప్రభువు మీ పాపాలను మీనుండి దూరం చేయవచ్చు”[ సూరయె తహ్రీమ్, ఆయత్:8]
“అప్పుడు ఆదం(అ.స) తన ప్రభువు నుంచి కొన్ని పదాలు నేర్చుకుని (పశ్చాత్తాపం చెందారు) అల్లాహ్ ఆయన పశ్చాత్తాపాన్ని ఆమెదించాడు. నిశ్చయంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడాను” [సూరయె బఖరహ్, ఆయత్:37]
“అల్లాహ్ పశ్చాత్తాపపడేవారిని, పారిశుద్ధ్యాన్ని అవలంబించేవారిని ఇష్టపడతాడు”[సూరయె బఖరహ్, ఆయత్:222]
“ముస్లింలారా! మీరంతా కలసి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు”[సూరయె నూర్, ఆయత్:31]
“అయితే (ఈ పాప కార్యాల తరువాత) ఎవరు పశ్చాత్తాపం చెంది, విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చి వేస్తాడు. అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణాకరుడు”[సూరయె ఫుర్ఖాన్, ఆయత్:70]
తౌబహ్ వర్షం కురవడానికి కారణం. “ఓ నా జాతివారలారా! మీ పోషకుని(అంటే అల్లాహ్) సమక్షంలో మీ తప్పుల మన్నింపుకై ప్రార్థించండి. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. ఆయన మీపై (ఆకాశం నుండి) ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీకున్న బలిమికి మరింత శక్తినీ, బలాన్నీ చేకూరుస్తాడు. మీరు మాత్రం అపరాధులుగా తిరిగిపోకండి[సూరయె హూద్, ఆయత్:52]
తౌబహ్ మంచి భాగ్యానికి కారణం “ఇంకా మీర మీ తప్పుల మన్నింపు కోసం మీ ప్రభువును వేడుకోండి. తర్వాత (పశ్చాత్తాపంతో) ఆయన వైపుకే మరలండి. ఒక నిర్థారిత కాలం వరకూ ఆయన మీకు మంచి (జీవన) సామగ్రిని సమకూరుస్తాడు”.[హూద్, ఆయత్:3]
తౌబహ్ చేసిన వారి పై అల్లాహ్ దయ చూపుతాడు. “(ఓ ప్రవక్తా!) మీలో ఎవరయినా అజ్ఞానం వల్ల ఏదన్నా చెడు పని చేసి తరువాత పశ్చాత్తాపం చెంది, దిద్దుబాటుకు ప్రయత్నిస్తే అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా దయజూపేవాడు” అని చెప్పు.[సూరయె అన్ఆమ్, ఆయత్:54],
“కాని పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు (మాత్రం నష్టపోరు). వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవంత కూడా అన్యాయం జరగదు”[సూరయె మర్యమ్, ఆయత్:60]
అల్లాహ్ దృష్టిలో తౌబహ్ చేయకపోవడం అన్యాయం మరియు నాశనానికి కారణం. “మరెవరైతే పశ్చాత్తాపం చెందరో వారే దుర్మార్గులు”[సూరయె హుజురాత్, ఆయత్:11]
ఎవరయితే విశ్వసించిన పురుషులను విశ్వసించిన స్త్రీలను వేధించి (కనీసం) పశ్చాత్తాపం (కూడా) చెందలేదో వారి కొరకు నరక యాతన సిద్ధంగా ఉంది, దహించి వేసే యాతన కూడా ఉంది”[సూరయె బురజ్, ఆయత్:10] 
"ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు”[ సూరయె నూర్, ఆయత్:31]
(ఓ ప్రవక్తా! నా తరపున వారికి ఇలా) చెప్పు: “తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు”[సూరయె జమర్, ఆయత్:53]
(ఓ ప్రవక్తా!) నేను అమితంగా క్షమించేవాడిననీ, అపారంగా కరుణించేవాడిననీ, నా దాసులకు తెలియజేయి.[సూరయె హిజ్ర్, ఆయత్:49].
“వారు అల్లాహ్ వైపునకు మరలరా? క్షమాపణ కోసం ఆయన్ని వేడుకోరా? అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు కూడా”[సూరయె మాయిదహ్, ఆయత్:74]
“నిశ్చయంగా ప్రజలు దుర్మార్గాలకు పాల్పడిన తరువాత కూడా నీ ప్రభువు వారిపట్ల క్షమాశీలుడుగా ఉంటాడు”[సూరయె రఅద్, ఆయత్:6].
మనిషి, మంచి స్వభావం కలిగి ఉన్నాడు మరియు అతని వద్ద ఆలోచనా శక్తీ, వివేకం ఉంది. దాని ద్వార అతడు మంచిని చెడు నుండి వేర చేసి మంచి మార్గాన్ని ఎన్నుకొని దానిని అమలు పరచగలడు. ఈ విధంగా మనిషి ఒక శిక్షణ పొందగలిగేటువంటి వాడు అని తెలుస్తుంది. సంపూర్ణత్వం పొందే, మరియు అల్లాహ్ వైపుకు వెళ్ళేందుకు అన్ని కాలాలలో మార్గం తెరిచే ఉంది, కాని చివరి నిమిషం లో(మరణాన్ని చూసినప్పుడు) ఇక అతని తౌబహ్ మరియు క్షమాపణ అంగీకరించబడదు. ఈ విధంగా దైవప్రవక్తల సందేశం మానవులందరి కొరకు అని తెలుస్తుంది, చివరికి ఫర్ఔన్ లాంటి వారికికి కూడాను. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “నీ స్వీయ సంస్కరణకు నువ్వు సిద్ధంగా ఉన్నావా” అని వాణ్ణి అడుగు. “నువ్వు భయభక్తులతో మసలుకునేందుకుగాను, నేను నీకు నీ ప్రభువు మార్గం చూపించనా!?” (అని చెప్పమని అల్లాహ్ మూసాకు ఉపదేశించాడు)[నాజిఆత్ సూరహ్, ఆయత్:18,19]. అందుకని మనిషి ఎప్పుడు కూడా అల్లాహ్ యొక్క కరుణ మరియు మన్నింపు నుండి నిరాశ చెందకూడదు. అల్లాహ్ ఇలా ప్రవచించెను: “మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు”.[జమర్ సూరహ్, ఆయత్:53]
నిజంగా అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు.

రిఫరెన్స్
ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, తఫ్సీరె నమూనహ్-అఖ్లాఖ్ దర్ ఖుర్ఆన్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7