జకాత్

శుక్ర, 09/10/2021 - 09:14

ఇస్లాం ముస్లిములకు జకాత్ చెల్లించు ఆదేశాన్ని ఇవ్వడానికి కారణమేమిటి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

జకాత్

ఇస్లాం ముస్లిముల మధ్య సామాజిక అంతరాన్ని దూరం చేయడానికి “జకాత్” చట్టాన్ని తీసుకొచ్చింది. ధనవంతులకు న్యాయంగా తమ ధనం మరియు వ్యక్తిగత ఆదాయం నుంచి “జకాత్” రూపంలో ఇస్లామీయ “బైతుల్ మాల్”(ఖజానా)కు చెల్లించాలి అని ఆదేశించింది. ఇలా చెల్లించబడే జకాత్ కొద్దికొద్దిగా చేరి చాలా పెద్ద మొత్తం రూపంలో సంగ్రహించబడుతుంది. ఆ ధనం పేదరికాన్ని దూరం చేయడానికి మరియు సమాజంలో సామాజిక అంతరాన్ని తరిగించడానికి మరియు సామాజిక చర్యలు చేయడానికి సహయ పడుతుంది.
ఇస్లామీయ ఆదేశాలనుసారం; నిర్ణిత జకాత్ ను జకాత్ చెల్లింపు వాజిబ్ అయిన వారందరూ న్యాయబద్దంగా చెల్లిస్తే ఇస్లామీయ సమాజం నుంచి పేదరిక వేర్లను పీకి పడేయవచ్చు. సమాజంలో కనిపిస్తున్న పేదరికం కేవలం చాలా మంది ఈ ఆదేశాన్ని అమలు పరచకపోవడం మాత్రమే. వారందరూ అల్లాహ్ కు జవాబుదారులు.[1]
జకాత్ ను ఖర్చు పెట్టబడే ఎనిమిది చోట్లు, వాటిని బలపరిస్తే దాంతో ఒక ఆరోగ్యవంతమైన ఇస్లామీయ సమాజం ఏర్పడుతుంది. ఖుర్ఆన్ లో జకాత్ ను ఖర్చు పెట్టే ఆ ఎనిమిది చోట్లు గురించి ఇలా వివరించెను:
“దానాలను కేవలం నిరుపేదల కొరకూ, అభాగ్య జీవుల కొరకు, వాటి వసూళ్ల కోసం నియమితులైన వారికొరకు, హృదయాలను ఆకట్టుకోవలసి ఉన్నవారి కొరకు, మెడలను విడిపించటానికీ, రుణగ్రస్తుల కొరకూ, దైవమార్గం కొరకూ, బాటసారుల కొరకూ వెచ్చించాలి. ఇది అల్లాహ్ తరఫున నిర్ణయించబడిన ఒక విధి. అల్లాహ్ మహాజ్ఞాని, మహావివేకి”[ సూరయె తౌబహ్, ఆయత్60]
ఈ ఆయత్ లో జకాత్ ను ఖర్చు పెట్టబడే ఎనిమిది చోట్లలో ఉన్న “అల్లాహ్ మర్గంలో” దీని హద్దులు చాలా సుదీర్ఘమైనవి. ఇందులో చాలా పనులు వస్తాయి, ఉదా., ఇస్లామీయ సామాజిక సేవలు, రోడ్ల నిర్మాణం, స్కూళ్ల స్థాపన, ఆస్పత్రులు నిర్మించడం మొ.. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజం యొక్క అభివృద్ధి కోసం ఖర్చు చేయడం.
"(ఓ ప్రవక్తా!) నీవు వారిని పరిశుద్ధపరచటానికీ, వారిని తీర్చిదిద్దటానికీ వారి సంపదల నుంచి దానాలను తీసుకో"[సూరయె తౌబహ్, ఆయత్103].
ఖురాన్ ఇలా ఉపదేశిస్తుంది.. " మరియు వారి ధనంలో యాచించేవారికి, యాచించని పేదవారికి కూడా హక్కుంది"[సూరయె జారియాత్, ఆయత్19].
అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడానికి ఆలోచించకూడదు. ప్రజలు సంపాదించే ప్రతీది అల్లాహ్ అతడికి తన ఔదార్యము ద్వారా ప్రసాదించినదే. ఖుర్ఆన్ లో ఇలా వివరించబడి ఉంది: జకరియ్యా ఆమె కుటీరానికి వెళ్ళినప్పుడల్లా, ఆమె వద్ద ఆహర పదార్థాలు కనిపించేవి. “మర్యమ్!  ఇవి నీ వద్దకు ఎక్కడి నుంచి వచ్చాయి?”  అని ఆయన అడిగితే, ‘అల్లాహ్ వద్ద నుంచి’ అని ఆమె చెప్పేది. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంతగా ఉపాదిని ప్రసాదిస్తాడు”.[సూరయె ఆలి ఇమ్రాన్, ఆయత్37].
“ఓ విశ్వాసులారా! మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చుచేయండి”.[సూరయె మాయిదహ్, ఆయత్254] మరియు “అల్లాహ్ యొక్క గ్రంథాన్ని పఠిస్తూ నమాజును నెలకొల్పేవారు, మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ, బహిరంగంగానూ ఖర్చు చేసేవారు ఎన్నటికీ నష్టం కలుగని వర్తకాన్ని ఆశిస్తున్నారు”.[సూరయె ఫాతిర్, ఆయత్29].
ఖురాన్ ఉపదేశం: “ఎన్నో జంతువులు తమ ఆహారాన్ని మోసుకుంటూ తిరగవు. వాటికీ, మీకు కూడా అల్లాహ్ యే ఉపాధిని ఇస్తున్నాడు”[సూరయె అన్కబూత్, ఆయత్60]

రిఫరెన్స్
1. ఇస్లాం దర్ ఎక్ నిగాహ్, ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, పేజీ85-86

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 33