.ఇస్లాంలో నమాజ్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. కొందరు ఎలా చదవాలో తెలియక మరియు కొందరు తెలిసి నమాజ్ ను చదవరు. నమాజ్ ఎలా చేయాలో తెలిని వారి కోసం ఈ నమాజ్ చేయు విధానం.
నమాజు సమయం అయినప్పుడు “ఉజూ”, “ఆజాన్” మరియు “ఇఖామత్” తరువాత నమాజు మొదలు పెట్టాలి. నమాజ్లో కొన్ని పనులు తప్పకుండా చేయాలి అవి చేయకుంటే నమాజ్ వ్యర్థమౌతుంది. మరికొన్ని పనులున్నాయి అవి తప్పకుండా చేయవలసినవసరం లేదు కాని చేస్తే మంచిది.
నమాజ్ లో తప్పకుండా చేయవలసిన పనులు
1. నియ్యత్: ముందుగా ఏ నమాజ్ అయితే చదవాలి అని అనుకుంటున్నారో దాని నియ్యత్ చేయాలి ఉదాహరణకి “నమాజే ఫజ్ర్ పఢ్తా/పఢ్తీ హుఁ వాజిబ్ ఖుర్బతన్ ఇలల్లాహ్” (నియ్యత్ ను నోటితో చెప్పనవసరం లేదు మనసులో కూడా అనుకోవచ్చు).
2. తక్బీరతుల్ ఇహ్రామ్: నియ్యత్ తరువాత చేతులను చెవుల వరకు ఎత్తి “అల్లాహుఅక్బర్” అని అనాలి. దీనినే “తక్బీరతుల్ ఇహ్రామ్” అంటారు.
3. ఖిరాఅత్: “తక్బీరతుల్ ఇహ్రామ్” తరువాత సూరయే “అల్ హంద్” చదవాలి ఆ తరువాత ఏదో ఒక పూర్తి సూరాను చదవాలి ఉదాహారణకు సూరయే “ఇన్నా అన్‌జల్‌నా” లేదా “కౌసర్” చదవాలి.
4. రుకూ: “ఖిరాఅత్” తరువాత్ “రూకూ” చేయాలీ. రుకూలో ఇలా అనాలి: “సుబ్హాన రబ్బియల్ అజీమి వబి హందిహ్”
5. సజ్దా: “రుకూ” తరువాత పూర్తిగా నిలబడి “సజ్‌దా” లోకి వెళ్ళి ఇలా అనాలీ: “సుబ్హాన రబ్బియల్ అ’లా వబి హందిహ్”. ఆ తరువాత కూర్చోని మరళ సజ్‌దా చేయాలీ. అందులోను మరళ అదే వాక్యాన్ని చదవాలీ.
ఇలా మొదటి రక్అత్ పూర్తి అవుతుంది.
ఇదే విధంగా రెండవ రకత్ కూడా చదవాలి. కాని ఇందులో నియ్యత్ మరియు తక్బీరతుల్ ఇహ్రామ్ చెప్పకుండా నిలబడగానే సూరయే అల్ హంద్ మొదలు పెట్టేయాలి.
6. తషహ్హుద్: రెడవ రక్అత్ యొక్క రెండవ సజ్దా పూర్తైన తరువాత కూర్చోని ఇలా చదవాలి: “అష్హదు అల్ లా ఇలాహ ఇల్లల్ ల్లాహు వహ్దహు లా షరీక లహ్, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహ్, అల్లాహుమ్మ సొల్లి అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్.
7. సలామ్: “తషహ్హుద్” అయిన తరువాత “సలామ్”ను ఇలా చదవాలి: “అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్”.
ఇంతటితో రెండవ రక్అత్ కూడా పూర్తి అవుతుంది.
ఒకవేళ మూడు లేదా నాలుగు రక్అతుల నమాజ్(అనగ మగ్రిబ్, జొహ్, అస్ర్ లేదా ఇషా) చదవాలనుకుంటే తషహ్హుద్ తరువాత సలామ్ చదవకుండా నిలబడి “తస్బీహాతె అర్బఅ”ను మూడు సార్లు ఇలా చదవాలి: “సుబ్హానల్లాహి వల్ హందు లిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్”, ఆ తరువాత రుకూ మరియ సజ్దాలు చేసి తషహ్హుద్ మరియు సలామ్ చదివి నమాజ్ ను పూర్తి చేయాలి.
వ్యాఖ్యలు
Mashaallah.....
Shukriya... Iltemase Dua.
వ్యాఖ్యానించండి