దుఆ

బుధ, 09/15/2021 - 15:40

దుఆ యొక్క అర్థం, దాని ప్రాముఖ్యత మరియు ఉత్తమ దుఆ యొక్క రీతి గురించి సంక్షిప్త వివరణ... 

దుఆ

దుఆ, ఉనికి యొక్క మూలం మరియు విశ్వం యొక్క ప్రభువు పై మనిషి శ్రద్ధ చూపడం. దుఆ అల్లాహ్ తన దాసులకు ప్రసాదించిన మంచి అవకాశం; దాంతో మనిషి తన ప్రభువు సన్నిధి నుంచి ఉత్తమత్వాన్ని పొందగలడు; అది సంపూర్ణత్వం, సజ్జనత్వం మరియు ఆత్మగౌరవం పొందడానికి సహాయపడుతుంది. దుఆ ఆత్మ మరియు శారీరక కష్టాలకు తొలగిస్తుంది.
మనిషి దుఆ ద్వారా అల్లాహ్ తో మాట్లాడి కష్టాలు మరియు ఆపదల నుంచి తమను తాము కాపాడుకుంటాడు. దుఆ మనిషి యొక్క మోక్షానికి మరియు ఉపశమనానికి దారి తీస్తుంది.
దైవప్రవక్త(స.అ) మరియు వారి అహ్లెబైత్(అ.స)లు దుఆ గురించి చాలా తాకీదు చేశారు. పవిత్ర మాసూమీన్(అ.స) దూఆల సేకరణలు కూడా ఉన్నాయి; ఉదా; “సహీఫయె సజ్జాదియహ్”, “సహీఫయె సాదిఖియహ్”, “సహీఫయె కాజిమియాహ్” మరియు “సహీఫయె రజవియహ్” మొ.. ఇస్లాం దుఆను చాలా ప్రోత్సహిస్తుంది.
పవిత్ర మాసూమీన్(అ.స) దుఆలను చూసుకున్నట్లైతే ఒక మాట స్పష్టంగా తెలుస్తుంది, అదేమిటంటే వారి దృష్టిలో దుఆ యొక్క ఉత్తమ స్థానం అల్లాహ్ పట్ల ప్రేమను వ్యక్తం చేయడం, తమ ప్రభును స్తుతించడం, ఆయన గొప్పతనాన్ని జపించడం. దైవప్రవక్త(స.అ) ఇలా దుఆ చేసేవారు: “ఓ అల్లాహ్! నేను నీ నుంచి నీ ప్రేమను కోరుతున్నాను. అలాగే నీవు ఇష్టపడేవారి ప్రేమను కూడా. నన్ను నీ ప్రేమతో జత చేసే కార్యముల వైపు వెళ్తున్నాను. ఓ అల్లాహ్! నీ పట్ల ప్రేమ నా స్వయం కన్నా, నా కుటుంబం కన్నా మరియు రుచికరమైన నీరు కన్నా ఎక్కువ ఇష్టపడేవాడిగా నిర్ధారించు”[1]
اللهم انی اسالک حبک و حب من یحبک، و العمل الذی یبلغنی حبک. اللهم اجعل حبک احب الی من نفسی و اهلی و من الماء البارد
అల్లాహ్ తన దాసులకు వారి ప్రార్థనలకు సమాధానమిస్తానని హామీ ఇచ్చాడు. మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను”[సూరయె గాఫిర్, ఆయత్60]
“(ఓ ప్రవక్తా! నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని(నువ్వు వారికి చెప్పు) కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి (ఈ విషయం నీవు వారికి తెలియజేయి) తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగల్గుతారు”[సూరయె బఖరహ్, ఆయత్186].

దుఆయె కుమైల్
కుమైల్ ఇబ్నె జియాద్ అనే వ్యక్తి ఒకసారి ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స)ను దేవుడిని సంప్రదించడానికై ఒక మార్గం చూపమని అడిగారు. దీనికి ప్రతిస్పందనగా, ఇమామ్ అలీ(అ.స) అతనికి ఈ ప్రార్థన ఇచ్చారు. మరియు అతనికి ఆ దుఆను ప్రతిరోజు, లేదా వారానికి ఒకసారి, లేదా సంవత్సరానికి ఒకసారి అది కూడా చాలా కష్టంగా అనిపిస్తే కనీసం పూర్తి జీవితంలో ఒకసారి చదవమని చెప్పారు. ఈ ప్రార్థన "దుఆయె కుమైల్" (కుమైల్ కొరకు చేసిన ప్రార్థన)గా పిలువబడింది. అనేకమంది ముస్లింలు కలిసి గురువారం రాత్రి, వారానికి ఒకసారి ప్రార్ధన చేస్తారు.
అల్లాహ్ పేరిట, అత్యంత అపార కరుణాప్రదాత, అనంత కృపాశీలుడు. ఓ అల్లాహ్, అన్నింటిని చుట్టుముట్టి ఉన్న నీ కరుణను ఆశ్రయించి నిన్ను వేడుకుంటున్నాను. అన్నింటి పై ఆధిపత్యం వహించే నీ శక్తి ద్వారా, మరియు దాని ముందు అన్నీ నమ్రతతో ఉన్నాయి మరియు అన్నీ దుర్గతిలో ఉన్నాయి.

రిఫరెన్స్
కన్జుల్ ఉమ్మాల్, హదీస్3648

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13