సైన్స్ మరియు ఖుర్ఆన్

గురు, 09/16/2021 - 06:58

అనేక శాస్త్రీయ వాస్తవాలు మరియు యదార్థాలు ఖుర్ఆన్ లో ఉన్నాయి. ఖుర్ఆన్ సైన్స్ కు విరుద్ధంగా కాదు అన్న విషయం పై కొన్ని ఆయతుల నిదర్శనం...

సైన్స్ మరియు ఖుర్ఆన్

అనేక శాస్త్రీయ వాస్తవాలు మరియు యదార్థాలు ఖుర్ఆన్ లో ఉన్నాయి. ఖుర్ఆన్ సైన్స్ కు విరుద్ధంగా ఉండదు. ఖుర్ఆన్ లో గర్భానికి మరియు మానవ సృష్టికి సంబంధించి వివరణ ఉంది. ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది: “నిశ్చయంగా మేము మనిషి (ఆదమ్)ను మట్టిసారముతో సృజించాము. తరువాత అతన్ని వీర్య బిందువుగా చేసి ఓ సురక్షిత చోటులో నిలిపి ఉంచాము. మరి ఆ వీర్య బిందువును ఘనీభవించిన రక్తంగా చేశాము. మరి ఆ రక్తపు ముద్దను మాంసపు పిండంగా మార్చాము. దరిమిలా ఆ పిండాన్ని ఎముకలుగా చేశాము. పిదప ఆ ఎముకలకు మాంసం తొడిగించాము. ఆటుపిమ్మట దాన్ని భిన్నమైన సృష్టిగా ప్రభవింపజేశాము. అందరికన్నా ఉత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్ శుభకరుడు”[సూరయె మొమినూన్, ఆయత్12-14].

జీవన సృష్టి, భూమి మరియు ఖగోళ విశ్వం ఆధునిక శాస్త్రీయ సిద్ధాంతానికి సమాంతరంగా వివరించబడ్డాయి. వీటి నమూనాలు ఖుర్ఆన్ లో:
సూరయె అంబియా లో ఇలా ఉంది: “భూమ్యాకాశాలు కలిసి వుండగా, మేము వాటిని విడదీసిన వైనాన్ని తిరస్కారులు చూడలేదా? ఇంకా, ప్రాణమున్న ప్రతి దానినీ మేము నీటితోనే చేశాము. అయినప్పటికీ వీళ్లు విశ్వసించరా? భూమి వారిని కుదిపివేయకుండా ఉండటానికని మేము అందులో పర్వతాలను చేశాము. వారు తమ మార్గాలను పొందటానికి అందులో సువిశాలమైన రహదార్లను ఏర్పరచాము. మరి ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా చేసినది కూడా మేమే. కాని ప్రజలు దాని సూచనలపై (పనితనంపై, సృష్టిప్రక్రియపై) బొత్తిగా ధ్యాస కనబరచరు. రేయింబవళ్లనూ, సూర్యచంద్రులనూ సృష్టించినవాడు కూడా ఆయనే. వాటిలో ప్రతిదీ తన తన కక్ష్యలో తేలియాడుతూ ఉంది”[సూరయె అంబియా, ఆయత్30-33]

సూరయె షమ్స్ లో ఇలా సూచించబడి ఉంది: సూర్యుని సాక్షిగా! దాని ఎండ సాక్షిగా! (సూర్యుణ్ణి) వెంబడిస్తూ వచ్చేటప్పటి చంద్రుని సాక్షిగా! (సూర్యుణ్ణి) దేదీప్యమానం చేసినప్పటి పగటి సాక్షిగా! (సూరీడును) క్రమ్ముకున్నప్పటి రాత్రి సాక్షిగా! ఆకాశం సాక్షిగా! దాని (అద్భుత) నిర్మాణం సాక్షిగా! భూమి సాక్షిగా! దాన్ని సుగమం చేసిన ప్రక్రియ సాక్షిగా!....” [సూరయె షమ్స్, ఆయత్1-6].

సూరయె యాసీన్ లో ఇలా ఉంది: సూర్యుడు తన కోసం నిర్ధారించబడిన కక్ష్యలోనే పయనిస్తున్నాడు. ఇది సర్వాధిక్యుడు, సర్వజ్ఞుడు అయిన అల్లాహ్ నిర్ధారించిన విధానం. మరి చంద్రుని మజిలీలను కూడా మేము నిర్ధారించాము. తుదకు అది (వాడిపోయిన ఖర్జూరపు) పాత మండలా తయారవుతుంది. చంద్రుణ్ణి పట్టుకోవటం సూర్యుని తరంకాదు. పగటిని మించిపోవటం రాత్రి వల్ల కాదు. అవన్నీ (తమ తమ నిర్ధారిత) కక్ష్యల్లో తేలియాడుతున్నాయి.[సూరయె యాసీన్, ఆయత్38-40].

విశ్వం యొక్క సృష్టిని నమస్కరించి, వాటి పాత్రను పరిగణించాలని మానవులు కోరబడ్డారు. ఖుర్ఆన్ వివరణ: “వారు నిల్చుని, కూర్చుని, తమ పడకల పై ఒత్తిగిలి అల్లాహ్ ను స్మరిస్తూ ఉంటారు. భూమ్యాకాశాల సృష్టి గురించి యోచన చేస్తూ ఉంటారు. వారిలా అంటారు: “మా ప్రభూ! నువ్వు ఈ సృష్టిని నిరర్థకంగా చేయలేదు. నువ్వు పవిత్రుడవు. మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుంచి కాపాడు”[సూరయె ఆలిఇమ్రాన్, ఆయత్191].

సూరయె నాజిఆత్ లో ఇలా ఉంది: “ఏమిటి, మిమ్మల్ని సృష్టించటం కష్టంతో కూడుకున్న పనా? లేక ఆకాశాన్నా?”[సూరయె నాజిఆత్, ఆయత్27].

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7