ఉస్మాన్ ఎన్నిక

ఆది, 09/19/2021 - 16:00

ఉమర్ తరువాత ఉస్మాన్ ను ఎలా ఖిలాఫత్ అధికారం పై వచ్చారు, వారు అధికారం పై రావడానికి ఉమర్ ఏర్పర్చిన కమిటీ మరియు ఆ కమిటీ సభ్యుల గురించి సంక్షిప్త వివరణ... 

ఉస్మాన్ ఎన్నిక

ఉమర్ ఆరుగురు మందితో కూడిన ఒక కమిటీని నియమించి ఖలీఫాను ఎన్నుకునే బాధ్యత ఆ కమిటీకి అప్పగించారు. ఆ కమిటీ తప్ప వేరే ముస్లిముకు ఖలీఫా విషయంలో ఏదైనా చెప్పే లేదా వినే హక్కు లేదు.  ఉమర్‌కు తెలుసు ఆ ఆరుగురిలో అభిప్రాయభేదం ఏర్పడుతుంది అందుకే అతను ఆ గ్రహించిన వ్యతిరేకతకు కూడా ఒక పరిష్కారం చెప్పారు; “ఇరు వైపుఒకవేళ అభిప్రాయభేదం ఏర్పడితే ముస్లిములందరు ఎవరి వైపు “అబ్దుల్ రహ్మాన్ బిన్ ఔఫ్” ఉంటారో అతనినే సమ్మతించండి, అబ్దుల్ రహ్మాన్‌తో లేని ఆ ముగ్గురిని చంపవలసి వచ్చినా సరే జనం మాత్రం అబ్దుల్ రహ్మన్‌నే సహకరించాలి”. ఇది ఎప్పుడు సంభవిస్తుందీ, ఎప్పుడైతే ఒకవైపు ముగ్గురూ మరో వైపు ముగ్గురు ఉండాలి. నిజానికి ఇలా జరగడం అసాధ్యం ఎందుకంటే ఉమర్‌కు తెలుసు “సఅద్ బిన్ అబీ వఖ్ఖాస్”, “అబ్దుల్ రహ్మాన్” యొక్క పినతండ్రి కుమారుడు మరియు ఇద్దరు కూడా “బనీ జోహ్రా” సమూహానికి చెందిన వారు మరియు హజ్రత్ అలీ(అ.స), అబ్దుల్ షంస్ సంతానమైన అతడి మావయ్యలను చంపారు కాబట్టి సఅద్, హజ్రత్ అలీ(అ.స)తో వైరం గలవాడు అని ఉమర్‌కు తెలుసు. మరి అలాగే ఉమర్‌కు అబ్దుల్ రహ్మాన్ భార్య ఉమ్మె కుల్సూమ్, హజ్రత్ ఉస్మాన్ యొక్క(అమ్మ తరపు నుండి) చెల్లి అని కూడా తెలుసు, మరియు తల్‌హా యొక్క మక్కువ ఉస్మాన్ తరపు ఉంది ఎందుకంటే చరిత్ర కారులు వ్రాసినట్లు వాళ్ళ మధ్య కొన్ని అనుబంధాలు ఉన్నాయి, ఉస్మాన్ వైపు మక్కువ ఉంది అనడానికి తల్‌హా, హజ్రత్ అలీ(అ.స)కు విరోధి ఎందుకంటే తల్‌హా, తైమీ (సమూహానికి చెందిన) వారు మరియు బనీ హాషిం సమూహాం మరియు బనీ తైమ్ సమూహాల మధ్య అబూబక్ర్ ఖిలాఫత్ గురించి చాలా అసమాధానము ఉండేది, అని కూడా ఉమర్‌కు తెలుసు[1]; అందుకే అతను ఆ ఆరుగురినే ఎన్నుకున్నారు మరియు ఈ ఆరుగురు ఖురైష్ వంశానికి చెందిన వారు మరియు అందరు మూహాజిరీనులు, వాళ్ళలో ఒక్కరు కూడా అన్సారుల నుండి లేరు. వాళ్ళలో ప్రతీ వ్యక్తి ఒక్కొక ముఖ్య సమూహాము తరపు నుండి ప్రతినిధి, ఉదాహారణకు:
1. హజ్రత్ అలీ(అ.స), బనీ హాషిం యొక్క ప్రతినిధి
2. ఉస్మాన్, బనీ ఉమయ్యహ్ యొక్క ప్రతినిధి
3. అబ్దుల్ రహ్మాన్ బిన్ ఔఫ్, బనీ జోహ్రా యొక్క ప్రతినిధి
4. సఅద్ బిన్ అబీ వఖ్ఖాస్, ఇతను బనీ జోహ్రాకు చెందిన వారు కాని అతని మావయ్యా బని ఉమయ్యాహ్‌కు చెందిన వారు.
5. తల్‌హా బిన్ ఉబైదుల్లాహ్, బనీ తైమ్ యొక్క నాయకులు.
6. జుబైర్, దైవప్రవక్త(స.అ) యొక్క అత్త సుఫియహ్ కుమారుడు మరియు అస్మా బింతే అబీ బక్ర్ యొక్క భర్త.

ఈ ఆరుగురే సలహా మండలిగా నియమించబడ్డవారు మరియు వాళ్ళ తీర్పు ముస్లిములందరి పై శాసనము చేయబడింది. ఆ ముస్లిములు ముఖ్యపట్టణమైన మదీనాకు చెందిన వారు కానివ్వండి లేదా వేరే ఇస్లామీయా పట్టణానికి చెందిన వారు కానివ్వండి. ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా ఆ కమిటీ తీర్పును అంగీకరించాలి మరియు ఆ కమిటీ యొక్క తీర్పును అంగీకరించని వారి రక్తం మూల్యం లేనిది(అనగా అతడిని చంపడం సమ్మతించబడినది) అని ముస్లిములందరిని పై అవశ్యకమైనదిగా నిర్ధారించబడింది.

 ఉమర్‌కు ఆ ఆరుగురి యొక్క ఉద్రేకములు మరియు అనుభూతులు చాలా బాగా తెలుసు అలా అతను ఉస్మాన్‌నే ఖిలాఫత్ పదవి కోసం అభ్యర్ధిని చేశారు, అని ఒప్పుకోవలసిందే లేదా కనీసం అతనికి తెలుసు ఎక్కువ మంది ఉస్మాన్ వైపు ఉన్నారు, వీళ్ళు హజ్రత్ అలీ(అ.స)ని ఎన్నుకోరు, ఇలా కాకుండా ఉంటే అతను అబ్దుల్ రహ్మాన్ యొక్క వైపు ఉన్న తక్కెడ బరువును ఎక్కువగా పెట్టి ఉండేవారు కాదు. నిజానికి ముస్లిముల అస్తిత్వం ఏర్పడినప్పటి నుండి ఈనాటి వరకు ప్రజలు అబూబక్ర్ మరియు అలీ(అ.స)లలో ఎవరు ప్రతిష్టులు అనే చర్చించు కుంటూ వచ్చారు గాని, ఇప్పటి వరకు ఎవ్వరు కూడా హజ్రత్ అలీ(అ.స) మరియు అబ్దుల్ రహ్మాన్‌లలో ఎవరు ప్రతిష్టులు అని చర్చించుకోవడం విని ఉండరు.

అహ్లెసున్నత్ మరియు షూరా(సలహా మండలి) పునాది పెట్టిన వారితో మరియు భావస్వాతంత్రం గలవారితో కేవలం ఒక ప్రశ్న; మీరు సలహా మండలి మరియు ఉమర్ అభిప్రాయం –అనగా ఈ కొత్త అభిప్రాయం ఏదైతే నిరంకుశత్వం పై నిలిచి ఉందో ఎందుకంటే ఉమర్ ఒక్కరే తన అభిప్రాయంతో ముస్లిముల సలహా లేకుండా ఆ ఆరుగురు వ్యక్తులను అభ్యర్ధులు చేశారు– ఆ రెండింటిని ఎలా కలపగలరు? మరియు స్వయంగా అతనే ఖిలాఫత్ వరకు అకస్మాత్తుగా చేరినటువంటి వారు అలాంటిది ఆ ఆరుగురులలో నుండి ఒకరిని ఆచరించడానికి ముస్లిములకు బలవంతం పెట్టడానికై అతనికి హక్కు ఎక్కడిది? అందుకని వీళ్ళ అభిప్రాయం ప్రకారం మరియు వీళ్ళు ప్రకటించుకున్నట్లు “ఇస్లాం పరిపాలన రిపబ్లిక్ పరిపాలన” అయ్యే సమస్యే లేదు, అనే విషయాన్ని అంగీకరించాల్సిందే.

రిఫరెన్స్
1. షర్హే నెహ్జుల్ బలాగహ్, ముహమ్మద్ అబ్దోహ్, భాగం1, పేజీ88.
2. లె అకూన మఅస్సాదిఖీన్, డాక్టర్ మొహమ్మద్ తీజానీ సమావీ, పేజీ220.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7