అలీ(అ.స) అధికారం ఎలా ఉండేది

గురు, 09/23/2021 - 02:49

హజ్రత్ అలీ(అ.స) గనక ఖలీఫా అయితే వారి అధికారం నిజమైన ఇస్లామీయ అధికారం అయ్యేది కాని వేరే వారు అధికారం పై రావడంతో దైవప్రవక్త(స.అ) సున్నత్ మార్చబడింది అన్న విషయాలతో పాటు ఒక ప్రశ్నకు సమాధానం సంక్షిప్తగా...

అలీ(అ.స) అధికారం ఎలా ఉండేది

అల్లాహ్ మరియు ప్రవక్త అభిప్రాయం ప్రకారంగా ఉమ్మత్ హజ్రత్ అలీ(అ.స)ను ఖలీఫా చేసి అతని అడుగుజాడలలో నడిచి ఉంటే ఎంత బాగుండేదో. ఎందుకంటే హజ్రత్ అలీ(అ.స) యొక్క సంపూర్ణమైన ఖిలాఫత్ లాంటి ఖిలాఫత్ యొక్క ఊహాలోచన కూడా అసాధ్యం –ఎలాగైతే దైవప్రవక్త(స.అ)(ఉమ్మత్ మార్గదర్శిగా) ఉన్నారో అలాగే హజ్రత్ అలీ(అ.స) ముప్పై ఏళ్ళు ఉమ్మత్ మార్గదర్శిగా ఉండేవారు– అందులో ఎటువంటి మార్పులు చేసేవారు కారు (అంటే) అబూబక్ర్ మరియు ఉమర్ చేసిన వాటికి పూర్తి వ్యతిరేకం(అన్నమాట) వాళ్ళిద్దరు షరీఅత్‌ను మార్చేశారు, స్పష్ట ఆదేశాలకు వ్యతిరేకంగా స్వయపరియాలోచనను(అమలులోకి) తీసుకొని వచ్చారు(మరియు చివరికి) జనం వాళ్ళ పధ్ధతులను సున్నతులుగా నిర్ధారించారు. మరి ఇక హజ్రత్ ఉస్మాన్ అయితే అల్లాహ్ గ్రంథం, దైవప్రవక్త(స.అ) సున్నత్ మరియు షైఖైన్(అబూబక్ర్ మరియు ఉమర్)ల సీరత్(చరితము)ను కూడా మార్చేశారు. మరియు సహాబీయులకు అతని పనులు నచ్చలేదు, చివరికి సాధారణ ప్రజలే అతనిని వ్యతిరేకించి అతని పై తిరగబడ్డారు దాని వల్ల హజ్రత్ ఉస్మాన్‌కు తన ప్రాణం కోల్పోవలసి వచ్చింది మరియు “ఉమ్మతే ముస్లిమహ్” తీవ్ర సంక్షోభాలకు(ఫిత్నయే కుబ్రా)కు గురి అయ్యింది, దాని గాయాలు ఇప్పటికీ నయమవ్వలేదు.

కాని హజ్రత్ అలీ(అ.స) అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్ విషయంలో ఎంత కట్టుబాటుగా ఉండే వారంటే కొంచెం కూడా వ్యతిరేకతను సహీంచే వారు కాదు మరియు ఎప్పుడైతే అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్‌తో పాటు ఖిలాఫత్ పదవి కోసం షైఖైనుల సీరత్[2]ను షరత్తుగా పెట్టారో అప్పుడు ఇమామ్ అలీ(అ.స), ఖిలాఫత్‌ను త్యజించి, కేవలం అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) సున్నతుల షరత్తు పైనే స్వీకరించుటకు సిధ్ధమవ్వడమే ఈ విషయంపై అన్నీటి కన్న పెద్ద సాక్ష్యం.

ఇక్కడ ఒక ప్రశ్న పుట్టుకొస్తుంది అదేమిటంటే అబూబక్ర్, ఉమర్ మరియు ఉస్మాన్‌లు పరిస్థితులను బట్టి బలవంతంగా స్వయపరియాలోచన పై అమలు చేశారు మరియు నిస్సహాయులై మార్చడానికి సిధ్ధమయ్యారు అయితే హజ్రత్ అలీ(అ.స) ఎందుకని అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్ పైనే నిలబడి ఉన్నారు?

దీనికి జవాబు ఏమిటంటే హజ్రత్ అలీ(అ.స)(విజ్ఞాన పట్టణానికి ద్వారం) కాబట్టి అతనికి ఉన్నంత జ్ఞానం మరెవ్వరి వద్ద లేదు, దైవప్రవక్త(స.అ) విజ్ఞానం యొక్క వెయ్యి అధ్యాయాలు నేర్పించారు ఆ తరువాత ఒక్కోక్క అధ్యాయం వెయ్యి అధ్యాయాలుగా అలీ(అ.స) పై తెరుచుకున్నాయి[3] దైవప్రవక్త(స.అ) హజ్రత్ అలీ(అ.స)తో ఇలా అన్నారు: “ఓ అలీ(అ.స) నా తరువాత ఈ ఉమ్మత్‌లో ఏర్పడే వ్యతిరేక(అభిప్రాయాలను) పరిష్కరించే శక్తి కేవలం నీకు మాత్రమే ఉంది”[4] కాని ఖులఫాలలో ఈ శక్తి లేదు వీళ్ళకు ఖుర్ఆన్‌లో ఉన్న స్పష్ట ఆదేశాలే తెలియవు అలాంటిది అంతరర్ధాల గురించి తెలిసే సమస్యే లేదు. “బుఖారీ” మరియు “ముస్లిం” ఇద్దరూ “తయమ్ముమ్” అను అధ్యాయంలో ఇలా ఉల్లేఖించారు: ఒక వ్యక్తి ఉమర్ ఖిలాఫత్ కాలంలో ఉమర్‌తో ఇలా ప్రశ్నించాడు: నేను అపవిత్రుడినయ్యాను(ముజ్నిబ్) అయ్యాను మరియు గుస్ల్ స్నానం చేయాడానికి నీళ్ళు కూడా దొరక లేదు అప్పుడు నేను ఏమి చేయ్యాలి? ఉమర్ ‎“‎నీవు నమాజ్ చదవకు” అని అన్నారు. మరి అదే విధంగా పాపం అతనికి చివరి క్షణం వరకు “కలాలహ్” అదేశం గురించి తెలియలేదు. మరియు అతను చేబుతూ ఉండే వారు “నేను దైవప్రవక్త(స.అ)తో ‘కలాలహ్’ నిర్బంధన గురించి అడిగి ఉంటే ఎంతబాగుండేదో” అని, వాస్తవానికి ఖుర్ఆన్‌లో దాని యొక్క ఆదేశం ఉంది. అహ్లెసున్నతులు అతనిపై ఆకాశవాణి అవతరింస్తుంది అని చెబుతూ ఉండేటువంటి ఆ ఉమర్ గారి పరిస్థితే ఇలా ఉందంటే ఇక అబూబక్ర్ మరియు ఉస్మాన్ పరిస్థితి ఏమిటో!. అందుకే వాళ్ళు హిదాయత్(మార్గదర్శనం), విజ్ఞానం మరియు దివ్య ఖుర్ఆన్ వెలుగు లేకుండా అల్లాహ్ యొక్క దీన్‌లో బిద్అత్‌లను సృష్టించారు మరియు ఇవన్నీ వాళ్ళ సొంత అభిప్రాయాలు అంతే మరేదీ కాదు.

రిఫరెన్స్
1. అబూబక్ర్ మరియు ఉమర్‌ల చరితము.
2. కన్జుల్ ఉమ్మాల్, భాగం6, పేజీ392, హదీస్ నం6009. హిల్యతుల్ ఔలియా. యనాబీవుల్ మవద్దహ్, పేజీ73, 77 మరి అలాగ్ తారీఖె దమిష్ఖ్ ఇబ్నె అసాకిర్ భాగం2, పేజీ483 పై కూడా ఉంది.
3. ముస్తద్రికుల్ హాకిం, భాగం3, పేజీ123. తారీఖె దమిష్ఖె ఇబ్నె అసాకిర్, భాగం2, పేజీ488.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20