.నమాజ్ లో కొన్ని పనులు తప్పకుండా చేయాలి అవి చేయకుంటే నమాజ్ వ్యర్థమౌతుంది. మరికొన్ని పనులున్నాయి అవి తప్పకుండా చేయవలసినవసరం లేదు కాని చేస్తే మంచిది.
నమాజు సమయం అయినప్పుడు “ఉజూ”, “ఆజాన్” మరియు “ఇఖామత్” తరువాత నమాజు మొదలు పెట్టాలి. నమాజ్లో కొన్ని పనులు తప్పకుండా చేయాలి అవి చేయకుంటే నమాజ్ వ్యర్థమౌతుంది. మరికొన్ని పనులున్నాయి అవి తప్పకుండా చేయవలసినవసరం లేదు కాని చేస్తే మంచిది.
నమాజ్ లో ముస్తహబ్ ప్రస్తావనలు
1. ఖునూత్: రెండవ రక్అత్ లో రెండు సూరహ్ లను చదివిన తరువాత రెండు చేతులను ముఖానికి ఎదురుగా పెట్టి ఇలా చదవాలి: “రబ్బనా ఆతినా ఫిద్దుని హసనహ్, వ ఫిల్ ఆఖిరతి హసనహ్, వ ఖినా అజాబన్నార్”
1. రుకూ నుండి నిలబడుతూ ఇలా అనాలి: “సమిఅల్లాహు లిమన్ హమిదహ్”
2. రెండు సజ్‌దాల మధ్య కూర్చున్నప్పుడు ఇలా అనాలి: “అస్తగ్ ఫిరుల్లాహ రబ్బీ వ అతూబు ఇలైహ్”
3. సజ్‌దాల తరువాత నిలబడేటప్పుడు ఇలా అనాలి: “బి హౌలిల్లాహి వ ఖువ్వతిహీ అఖూము వ అఖ్వుద్”
4. నమాజ్ పూర్తి అయిన తరువాత (అదీ రెండు రక్అతుల నమాజు కానివ్వండీ లేదా మూడూ లేదా నాలుగు రక్అతుల నమాజు కానివ్వండి) తస్‌బీహే హజ్రతే జహ్రా[సలాముల్లాహ్ అలైహా] చదవాలి అనగ
అల్లాహు అక్బర్ 34 సార్లు
అల్ హందు లిల్లాహ్ 33 సార్లు
సుబ్‌హానల్లాహ్ 33 సార్లు.
వ్యాఖ్యానించండి