హజ్రత్ అలీ(స.అ) సహాబీయులందరిలో కల్లా విజ్ఞానవంతులై ఉండి కూడా ఎందుకు ఉమ్మత్ లో ఉన్న వ్యతిరేకతలను పరిష్కరించలేదు అన్న ప్రశ్నకు సమాధానం...
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
ప్రశ్న: హజ్రత్ అలీ(అ.స) సహాబీయులందరిలో కల్లా విజ్ఞాన పరంగా ఉత్తమ స్థానంలో ఉన్నప్పుడు వారు దైవప్రవక్త(స.అ) తరువాత ఉమ్మత్‌లో ఉన్న వ్యతిరేకతలను ఎందుకు పరిష్కరించలేదు?
జవాబు: హజ్రత్ అలీ(అ.స) ఉమ్మత్ యొక్క కష్టాలను పరిష్కరించడంలో ఎటువంటి లోటు చేయలేదు. సహాబీయుల కష్ట సమయములలో ఆశ్రయం వీరే. వారు వచ్చి సమస్యను వివరించి, సద్బోధించి మరీ వెళ్ళే వారు. కాని వాళ్ళు కేవలం వాళ్ళకు నచ్చిన మరియు వాళ్ళ అధికారానికి అడ్డురాని మాటలనే అంగీకరించే వారు. మిగిలిన విషయాలను వదిలేసేవారు. వీటన్నింటికీ చరిత్రే సరైనటువంటి సాక్షి.
యదార్ధం ఏమిటంటే ఒకవేళ హజ్రత్ అలీ(అ.స) మరియు అతని పవిత్ర కుటుంబ సభ్యులు ఉండకపోయి ఉంటే ప్రజలకు ఇస్లాం ఆదేశాలు కూడా తెలిసేవి కావు. కాని ఖుర్ఆన్ ఆదేశం ప్రకారం జనం సత్యాన్ని ఇష్టపడరు అందుకే వాళ్ళు తమ మనోవాంఛల బానిసలయ్యారు మరియు అహ్లెబైత్(అ.స)లకు వ్యతిరేకంగా కొత్త వర్గాలను, మతాలను సృష్టించుకున్నారు. అహ్లెబైత్(అ.స)లకు ఊపిరి పీల్చుకునేంత సమయం కూడా ఇవ్వలేదు, వాళ్ళకు స్వాతంత్రం ఉండే లేదా ప్రజలతో కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు.
హజ్రత్ అలీ(అ.స) పీఠం నుండి ఇలా ప్రకటించారు: “నేను మరణించక ముందే నాతో ఇష్టం వచ్చింది అడగండి”. హజ్రత్ అలీ(అ.స) యొక్క నైపుణ్యంపై స్వయంగా నెహ్జుల్ బలాగహ్ గ్రంథమే నిదర్శనం. ఆయిమ్మయే అహ్లెబైత్(అ.స)లే ఇహపరలోకములు నిండిపోయేవన్ని విద్యలను వదిలి వెళ్ళారు. మరియు ఉలమాలు., వారిని అనుసరించే షియా ముస్లిములు కానివ్వండి లేదా అహ్లె సున్నత్ వారు కానివ్వండి, అందరూ ఈ విషయం పై సాక్ష్యం ఇచ్చారు.
యదార్థమేమిటంటే; ఒకవేళ హజ్రత్ అలీ(అ.స)కు ముఫ్పై సంవత్సరాల వరకు దైవప్రవక్త(స.అ) సున్నతుల ప్రకారం ఉమ్మత్‌పై అధికారం చేసే అవకాశం దొరికి ఉంటే ఈనాడు ప్రపంచమంతట ఇస్లాం వ్యాపించి ఉండేది, ప్రజల విశ్వాసాలు దృఢంగా ఉండేవి, కలహాలు (అవి చిన్న కలహం కానివ్వండి లేదా పెద్ద కలహం కానివ్వండి) వాటి మంటలు రేపి ఉండేవి కావు, కర్బలా యదార్ఢగాథ మరియు ఆషూరా సంభవించి ఉండేది కాదు. అదే ఒకవేళ హజ్రత్ అలీ(అ.స) తరువాత పదకొండు ఇమాములకు ఖిలాఫత్ అధికారం దక్కి ఉంటే ప్రపంచమంతా ముస్లిములు తప్ప మరెవ్వరూ ఉండే వారు కాదు మరియు ఈనాడు మేము చూసే ఈ భూమీ ఇలా ఉండేది కాదు. అలాగే మన జీవితం ఒక నిజమైన మనిషి జీవితం అయ్యి ఉండేది. కాని అల్లాహ్ ప్రవచనం: “(కేవలం) ‘మేము విశ్వసించాము’ అని అన్నంత మాత్రాన్నే వారిని వదిలివేయటం జరుగుతుందనీ, వారిని పరీక్షించటం జరగదనీ ప్రజలు భావిస్తున్నారా?”[అన్కబూత్ సూరా:29, ఆయత్:2]
కాని ఇస్లాం ఉమ్మత్ కూడా ఇంతకు ముందు ఉమ్మత్‌ల వలే పరీక్షలో విఫలమయ్యింది. మరియు స్వయంగా దైవప్రవక్త(స.అ) కూడా చాలా సందర్భములలో స్పష్టించారు.[1]
మరి అలాగే ఖుర్ఆన్ కూడా చాలా సందర్భాములలో ఈ విషయాన్ని వ్యక్తం చేసింది.[2]
నిజానికి మనిషి దుర్మార్గుడు మరియు అజ్ఞాని, ఆ మనిషి గురించే దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించెను: ఏ ఒక్క వ్యక్తి కూడా అల్లాహ్ యొక్క దయా మరియు ఆయన కరుణ లేకుండా తను చేసుకున్న పనులతో స్వర్గంలో ప్రవేశించ లేడు.[3]
రిఫరెన్స్
1. ఉదా: ఈ విషయాన్ని వివరించిన హదీస్, దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించెను: నా ఉమ్మత్, యూధుల మరియు క్రైస్తవుల అడుగుజాడలలో నడుస్తుంది చివరికి వాళ్ళు ఉడుము పుట్టలో దూరితే ఈ ఉమ్మత్ కూడా అందులో దూరిపోతుంది. (బుఖారీ మరియు ముస్లిం తమ సహీ అను పుస్తకంలో ఈ హదీస్ ను ఉల్లేఖించారు ఇంతకు ముందు కూడా ఈ హదీస్ ను సూచించబడింది). మరి అలాగే సేలయేరు హీదీస్(హదీసె హౌజె కౌసరే) అందులో దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: కొంత మంది స్వేచ్చ జంతువుల వలే తిరుగుతూ ఉంటారు వాళ్ళు తప్ప అందరూ నరకం వైపుకు తీసుకుని వెళ్ళబడతారు.
2. ఉదా: ఆలి ఇమ్రాన్ సూరా:3, ఆయత్:144. లేదా అల్ ఫుర్ఖాన్ సూరా:25, ఆయత్:30.
3. సహీ బుఖారీ, భాగం7, పేజీ10. సహీ ముస్లిం, సిఫాతుల్ మునాఫీఖీన్ అని భాగంలో.
వ్యాఖ్యలు
Mashallah
Jazakallah
వ్యాఖ్యానించండి