హజ్రత్ అలీ(అ.స) విలాయత్ పై సాక్ష్యం

గురు, 09/30/2021 - 15:22

హజ్రత్ అలీ(అ.స) యొక్క విలాయత్‌ను నిరాకరించి అల్లాహ్ శిక్షకు అర్హుడైన హారిస్ ఇబ్నె నోమాన్ సంఘటన నిదర్శనం...

హజ్రత్ అలీ(అ.స) విలాయత్ పై సాక్ష్యం

హజ్రత్ అలీ(అ.స) దైవప్రవక్త(స.అ) తరువాత ముస్లిముల యొక్క నిజమైన ఖలీఫా అని ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి వాటి నుంచి ఒకటి:

హజ్రత్ అలీ(అ.స) యొక్క విలాయత్‌ను నిరాకరించి అల్లాహ్ శిక్షకు అర్హులయిన వారు.
వివరణ: “గదీరె ఖుమ్” వార్త వ్యాప్తి చెందింది, హజ్రత్ అలీ(అ.స)కు ఖలీఫతుల్ ముస్లిమీన్(ముస్లిముల నాయకుడు)గా నియమించిన వార్త అందరికి తెలిసింది. దైవప్రవక్త(స.అ) యొక్క ఈ వాక్యం: “ఇక్కడున్న వాళ్ళు ఇక్కడ లేని వాళ్ళ వరకు ఈ సందేశాన్ని చేర్చండి” ఎప్పుడైతే ఈ వార్త అందరి నోట రావడం మొదలయ్యిందో అలా అలా “హారిస్ ఇబ్నె నోమానె ఫెహ్రీ” వరకు కూడా చేరింది కాని అతడికి ఈ మాట నచ్చలేదు(జీర్ణించికోలేకపోయాడు).[1]

నోమాన్ దైవప్రవక్త(స.అ) వద్దకు వచ్చి తన ఒంటెను మస్జిదున్నబీ ముందు కూర్చోబెట్టి దైవప్రవక్త(స.అ) దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు: ఓ ముహమ్మద్! నీవు  “అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్నక రసూలల్లాహ్” అని చెప్పమని ఆదేశించావు మేము నీ మాటను అంగీకరించాము ఆ తరువాత నీవు మాకు రోజుకు ఐదు సార్లు నమాజు చదవమని మరియు రమజాన్ మాసంలో ఉపవాసాల దీక్షలు నిర్వర్తించాలని ఆదేశమిచ్చావు ఆ తరువాత జకాత్ ఇవ్వమని ఆదేశించావు మేము నీ ఆదేశాలన్నింటిని స్వీకరించాము ఇక ఇప్పుడు నీ తమ్ముడ్ని నిలబెట్టి “నేను ఎవరికి స్వామినో అలీ కూడా వారి స్వామియే” అని అందరిపై ప్రతిష్టను ఇచ్చావు. ఈ ఆదేశం అల్లాహ్ తరపు నుంచి వచ్చింది లేక నీ మనసు మాటా?.

ఇది విని దైవప్రవక్త(స.అ) కళ్ళు(కోపంతో) ఎర్రబడ్డాయి, మూడు సార్లు ఇలా అన్నారు: “ఆయన తప్ప మరెవ్వరూ పరమేశ్వరుడు కానటువంటి ఆ అల్లాహ్ ప్రమాణంగా ఇది అల్లాహ్ తరపు నుండి నా తరపు నుండి కాదు” హారిస్ ఇది విని అక్కడ నుండి నిలబడి ఇలా అన్నాడు: “ఓ అల్లాహ్ ముహమ్మద్(స.అ) చెప్పేది ఒకవేళ నిజం అయితే నా పై ఆకాశం నుండి రాళ్ళను కురిపించు లేదా బాధాకరమైన శిక్ష విధించు”. రావి ఇలా ప్రవచించెను: అల్లాహ్ సాక్షిగా అతడు ఇంకా తన ఒంటె వరకు కూడా చేరలేకపోయాడు ఆకాశం నుండి అతడి తలపై ఒక రాయి వచ్చి పడింది మరియు అతడి క్రింది నుండి బయటకు వచ్చేసింది మరియు అతడు అక్కడికక్కడే చనిపోయాడు మరియు అల్లాహ్ ఈ ఆయత్‌ను అవతరింపచేశాడు” ఆయత్: سَأَلَ سَآئِلُۢ بِعَذَابٖ وَاقِعٖ لِّلۡكَٰفِرِينَ لَيۡسَ لَهُۥ دَافِعٞ
అనువాదం: అడిగేవాడు అవిశ్వాసుల కొరకే సంభవించే శిక్షను గురించి అడిగాడు. అది తప్పకుండా సంభవిస్తుంది.[అల్ మఆరిజ్ సూరా:70, ఆయత్:1,2]
పై చెప్పబడిన సంఘటన ..మజ్మవుల్ బయాన్.. నుంచి ..అబుల్ ఖాసిమె హస్కానీ.. రావీయుల క్రమంతో ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ద్వార ఉల్లేఖించబడి ఉంది[2]
ఇదే రివాయత్ ను అహ్లె సున్నత్ కు చెందిన ఎన్నో ముఫస్సిరీన్లు మరియు రావీయులు కొద్దిపాటి తేడాతో ఉల్లేఖించారు. అల్లామా అమీనీ గారి పుస్తకం “అల్ గదీర్” లో ఈ హదీస్ ను 30 ప్రముఖ ఉలమాల నుంచి ఉల్లేఖించారు.[3]. వారిలో ముఖ్యమైనవారు:
తఫ్సీరె గరీబుల్ ఖుర్ఆన్ లో హాఫిజ్ అబూ ఉబైదె హరవీ
తఫ్సీరె షిఫా అల్ సుదూర్ లో అబూబక్ర్ నఖ్ఖాషె మూసలీ
తఫ్సీరుల్ కష్షాఫ్ వల్ బయాన్ లో అబూ ఇస్హాఖె సఆలబీ
ఫరాయిదుస్ సంతైన్ లో షేఖ్ మొహమ్మద్ జరందీ
తఫ్సీరె సిరాజుల్ మునీర్ లో షంసుద్దీన్ షాఫెయీ
నూరూల్ అబ్సార్ లో సయ్యద్ మొమిన్ షబ్ లంజీ
షర్హె జామె అల్ సగీర్ సీవ్తీ షంసుద్దీన్ షాఫెయీ మొ..[4]
చాలా గ్రంథాలలో పై ఆయత్ క్రమంలో అవతరించబడ్డాయి అని వివరించారు. కాని ఆ మనిషి ఎవరు అన్న విషయంలో వ్యతిరేకత ఉంది. కొందరు ఆ వ్యక్తి “హారిస్ ఇబ్నె నోమాన్” అని మరి కొందరు “జాబిర్ ఇబ్నె నజర్” అని కొందరు వ్రాశారు. అయితే ఈ వ్యతిరేకత జరిగిన సంఘటన పై ప్రభవం చూపించదు అని అని అందరికి తెలుసు.

రిఫరెన్స్
1. దానికి సాక్ష్యం; మదీనా బయట ఉండే బద్దూ(ఒక తెగ అరబ్బులు) హజ్రత్ అలీ(అ.స) పట్ల వైరం కలిగి ఉండే వారు, వాళ్ళకు దైవప్రవక్త(స.అ) అంటే కూడా ఇష్టం ఉండేది కాదు. అందుకనే ఈ బద్దూ అరబ్బులు సలాము లేకుండ వచ్చిరాగానే మాట్లాడడం మొదలు పెట్టాడు: “ఓ ముహమ్మద్(స.అ) అల్లాహ్ ప్రవచించింది నిజమేనా” الاعراب کفرا و نفاقا واجد الا یعلمو احد و ما انزل اللہ علی رسولہ.
2. మజ్ముఅల్ బయాన్, భాగం10, పేజీ352
3. తఫ్సీరె నమూనహ్, భాగం25, పేజీ7
4. అల్ గదీర్, భాగం1, పేజీ239 – 246 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21