హజ్రత్ అలీ(అ.స) విలాయత్ నిరాకరణ ఫలితం

శుక్ర, 10/01/2021 - 09:56

గదీర్ సంఘటన ను నిరాకరించిన వారు మరియు సాక్ష్యం ఇవ్వమని అడిగినా సరే ఏదో సాకుతో ఇవ్వనటువంటి వారి గురించి మరియు వారు గురి అయిన రోగం గురించి సంక్షిప్త వివరణ...

హజ్రత్ అలీ(అ.స) విలాయత్ నిరాకరణ ఫలితం

గదీర్ సంఘటన సాక్ష్యాన్ని దాచిపెట్టిన మరియు హజ్రత్ అలీ(అ.స) యొక్క శాపం తగిలిన వాళ్ళకు సంబంధించింది.
వివరణ: హజ్రత్ అలీ(అ.స) తన ఖిలాఫత్ కాలంలో “రహ్బహ్” అని ప్రదేశంలో ఒకపెద్ద సభను ఉద్దేశిస్తూ పీఠం నుండి ఉపన్యాసం ఇస్తూ ఇలా అన్నారు: “నేను ప్రతీ ముస్లిముకు అల్లాహ్ ఆనతి ఇస్తున్నాను, “గదీరె ఖుమ్‎”‎లో దైవప్రవక్త(స.అ) “من کنت مولاه فعلی مولاه” అని ప్రకటిస్తుండగా అతని ప్రచారం విన్న వాళ్ళు నిలబడి ఏదైతే విన్నారో దానిపై సాక్ష్యం ఇవ్వండి అది కూడా ఎవరైతే తన కళ్ళతో చూశాడో మరియు తన చెవులతో విన్నాడో అతడే సాక్ష్యం ఇవ్వండి!” ఆ విధంగా ముఫ్ఫై మంది సహాబీయులు నిలబడ్డారు అందులే 16 బద్రీయులు వాళ్ళు ఇలా అన్నారు: “దైవప్రవక్త(స.అ) హజ్రత్ అలీ(అ.స) చేయిని పట్టి ప్రజలతో ఇలా అన్నారు: నేను మీ పై మీ కన్న ఎక్కువ అధికారం కలిగినవాడిని అని మీకు తెలియదా? అందరు అవును మాకు తెలుసు అని అన్నారు. అప్పుడ దైవప్రవక్త(స.అ) ఇలా ప్రకటించారు: “مَنْ‏ كُنْتُ‏ مَوْلَاهُ‏ فَعَلِيٌ‏ مَوْلَاهُ‏ اللَّهُمَّ وَالِ مَنْ وَالاهُ وَ عَادِ مَنْ عَادَاهُ ...،” ‎ 

కాని సహాబీయులలో కొందరు గదీర్ మైదానంలో ఉన్నారు మరియు వారి పట్ల వైరం మరియు ద్వేషం కలిగినవారు, వాళ్ళు సాక్ష్యమివ్వడానికి నిలబడలేదు అందులో ‎“‎అనస్ బిన్ మాలిక్” కూడా ఉన్నారు. హజ్రత్ అలీ(అ.స) పీఠం నుండి దిగి అనస్ వద్దకు వచ్చి ఇలా అన్నారు: ‎“‎ఓ అనస్ నీకు ఏమైంది! దైవప్రవక్త(స.అ) సహాబీయులతో పాటు నీవు సాక్ష్యం ఎందుకు ఇవ్వవు(దేనినైతే నీవు విన్నావో) ఎలాగైతే వీళ్ళు సాక్ష్యం ఇస్తున్నారో”. అనస్ ఇలా అన్నాడు: “ఓ అమీరుల్ మొమినీన్! నా వయసు ఎక్కువయ్యింది మరియు నేను మరిచిపోయాను” అందుకు హజ్రత్ అలీ(అ.స) “ఒకవేళ నీవు అబద్ధం చెబుతున్నట్లైతే అల్లాహ్ నీకు నీ తలపాగ కూడా దాచనటువంటి తెల్లకుష్ఠు రోగానికి గురవ్వాలి” అని అన్నారు. అనస్ తన ఉన్న స్ధానం నుండి ఇంకా నిలబడక ముందే ముఖమంతా తెల్లకుష్ఠి వచ్చేసింది. ఆ తరువాత అనస్ ఏడ్చిఏడ్చి చెబుతూ ఉండే వాడు నేను (గదీర్ ప్రచారంపై) సాక్ష్యం ఇవ్వనందుకు నేను సజ్జనుని శాపానికి గురి అయ్యాను అని.

ఈ సంఘటన చాలా ప్రఖ్యాతి చెందింది. “ఇబ్నె ఖుతైబహ్” తన పుస్తకంలో 251వ పేజీ పై ఈ సంఘటనను ఉల్లేఖిస్తూ అనస్‌ను తెల్లకుష్ఠురోగి అని వ్రాశారు. “అహ్మద్ బిన్ హంబల్” తన పుస్తకం ముస్నద్‌లో భాగం1, పేజీ 119 పై దీనిని ప్రస్తావిస్తు ఇలా ఉల్లేఖించారు: “అందరు సాక్ష్యమిచ్చారు కేవలం మూడు వ్యక్తులు సాక్ష్యం ఇవ్వలేదు మరియు ఆ ముగ్గురికి అలీ(అ.స) శాపం తగిలింది”.

నేను ఇక్కడ ఆ ముగ్గురి వ్యక్తుల పేర్లు “బలాజరీ” పుస్తకం “అన్సాబుల్ అష్రాఫ్” భాగం1,2 పేజీ152 నుండి వ్రాస్తున్నాను. బలాజరీ ముందుగా హజ్రత్ అలీ(అ.స) ప్రమాణం గుర్తు చేసిన విషయాన్ని ప్రస్తావించారు ఆ తరువాత ఇలా అన్నారు: పీఠం క్రింద “అనస్ ఇబ్నె మాలిక్”, “అల్ బర్రా ఇబ్నె ఆజిబ్” మరియు “జురైర్ ఇబ్నె అబ్దుల్లాహ్ అల్ బిజ్లీ” ఉన్నారు, హజ్రత్ అలీ(అ.స) తన మాటను మరో సారు చెప్పారు కాని ఆ ముగ్గురిలో నుండి ఒక్కడు కూడా జవాబివ్వనప్పుడు హజ్రత్ అలీ(అ.స) ఇలా అన్నారు: ఓ అల్లాహ్ ఆ సంఘటన తెలిసి ఉండి కూడా నిరాకరిస్తున్న వాడికి అందరికి తెలిసి వచ్చేటువంటి గుర్తు అతడికి ఇవ్వనంత వరకు ఈ లోకం నుండి తీసుకొని వెళ్ళకు!. బలాజరీ ఇలా అన్నారు: ఆ తరువాత ‎“‎అనస్ ఇబ్నె మాలిక్” తెల్లకుష్ఠికి గురయ్యారు, “బర్రా ఇబ్నె ఆజిబ్” గుడ్డివాడయ్యారు, “జురైర్” హిజ్రత్ తరువాత ఆరాబీ అయ్యారు మరియు “షర్రాత్”కు వచ్చి తన తల్లి ఇంట్లోనే చనిపోయారు.

ఈ సంఘటన ప్రసిధ్ధి కావడం వల్ల చాలా మంది చరిత్ర కారులు[1] కూడా ప్రస్తావించారు అందుకని వివేకులు బుద్ధి తెచ్చుకోండి! ఈ సంఘటనను హజ్రత్ అలీ(అ.స) 25 సంవత్సరముల తరువాత అప్పటికి జనం దానిని మరిచిపోయారు మరలా దానిని గుర్తు చేశారు దీనితో హజ్రత్ అలీ(అ.స) గారి ఘనత, ఆత్మ పవిత్రత మరియు ధైర్యాన్ని గుర్తించ వచ్చు. వాస్తవానికి అతను అవసరానికి మించి సహించారు మరియు అవసరం పడినప్పుడు కేవలం ఇస్లాం మరియు ముస్లిముల కోసం అబూబక్ర్, ఉమర్ మరియు ఉస్మాన్‌లకు అనుకూలమైన సలహాలు కూడా ఇచ్చారు. మరియు ఇవన్నీ గదీర్ సంఘటనను గుండెలో పెట్టుకొని ఉన్న సమయంలో చేశారు, ఈ విషయం జీవితంలో ప్రతీ నిమిషం అతని గుండెలను పిండేస్తూ ఉండేదేమో. అందుకే వీలు దొరకగానే అతను ప్రజల ముందు ఆ సంఘటనను సాక్ష్యాలతో మరల గుర్తు చేయించారు. ప్రతీ పరిశోధకుడు ఈ సంఘటన[2] తో యదార్థం ఏమిటి అని ఒక అంచనా వేయగలుగుతాడు. మరియు హజ్రత్ అలీ(అ.స) గారి గొప్పతనం తెలుస్తుంది! ఇక మీరే తిలకించండి, హజ్రత్ అలీ(అ.స) ఎలా హృదయానికి ఆకట్టుకునే విధంగా ఆ శుభకరమైన సంఘటనను ప్రవచించారో మరియు గదీర్ సంఘటన రోజు ఉన్న లేదా లేని  ముస్లిములందరి పై సాక్ష్యాన్ని వ్యక్తం చేసేశారు. ఆలోచించండి ఒకవేళ హజ్రత్ అలీ(అ.స) “ప్రజలారా! దైవప్రవక్త(స.అ) గదీరె ఖుమ్‌లో నా ఖిలాఫత్‌పై అందరి బైఅత్ తీసుకున్నారు” అని ప్రవచించినట్లైతే దాని ప్రభావం ప్రజలపై ఇంకా ఎక్కువగా ఉండేది కాదా? అంతేకాదు జనం అయితే మీరు ఇంత కాలం ఎందుకు మౌనంగా ఉన్నారు? అని అనే వారు. కాని వేరే విధంగా “ప్రతీ ముస్లిముకు ప్రమాణం గుర్తు చేస్తున్నాను దైవప్రవక్త(స.అ)కు గదీర్‌లో “مَنْ كُنْتُ مَوْلَاهُ فَعَلِيٌّ مَوْلَاه‏” అని ప్రకటిస్తూ విన్న వారు నిలబడి సాక్ష్యం ఇవ్వండి” అని ప్రవచించారు. దాని ఫలితంగా  దైవప్రవక్త(స.అ)‎ హదీస్‌ను ముఫ్ఫై సహాబీయుల నోట ప్రవచించబడింది వాళ్ళలో 16 మంది బద్రీయులు, ఇలా సందేహించేవాళ్ళ మరియు నిరాకరించేవాళ్ళ మరియు  ఎందుకు హజ్రత్ అలీ(అ.స) ఇంతకాలం మౌనంగా ఉన్నారు? అని అడిగే వాళ్ళ నోళ్ళు మూయబడ్డాయి ఎందుకంటే హజ్రత్ అలీ(అ.స)తో పాటు ముఫ్ఫై మంది సహాబీయులు కూడా మౌనంగా ఉన్నారు మరియు ఈ ముఫ్ఫై మంది ఉన్నత స్థాయి గల వారు, వీళ్ళందరి మౌనం పరిస్థితులు బాగుండక పోవడం మరియు మౌనంగా ఉండడంలోనే ఇస్లాం సౌకర్యం దాగి ఉంది అనడానికి సాక్ష్యం.

రిఫరెన్స్
తారీఖె దమిష్ఖె ఇబ్నె అసాకిర్, భాగం2, పేజీ7 మరియు భాగం3, పేజీ150. షర్హె నెహ్జుల్ బలాగహ్ ఇబ్నె అబిల్ హదీద్, మహమ్మద్ అబుల్ ఫజ్ల్ పరిశోధనతో, భాగం19, పేజీ217. అబఖాతుల్ అన్వార్, భాగం2, పేజీ309. మనాఖిబె అలీ(అ.స), ఇబ్లుల్ మగాజీ అల్ షాఫేఈ, పేజీ23. సీరతుల్ హలబియ్యాహ్, భాగం3, పేజీ337.
2. అనగా రహ్బహ్ స్ధానంలో హజ్రత్ అలీ(అ.స) ప్రమాణం గుర్తుచేసిన మరియు ప్రజలు సాక్ష్యం ఇచ్చిన సంఘటన.
 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14