ఉమత్ మేలు కోసం సఖ్లైన్

ఆది, 10/03/2021 - 16:06

దైవప్రవక్త(స.అ) తన తరువాత జరిగే విభేదాలలో ఉమ్మత్ శరణుకోరేందుకు మరియు సహాయం పోందేందుకు ఏదైనా విడిచి వేళ్ళారా? అన్న ప్రశ్నకు నిదర్శనలతో సఖ్లైన్ హదీస్ ద్వార సమాధానం.

ఉమత్ మేలు కోసం సఖ్లైన్

ప్రశ్న: దైవప్రవక్త(స.అ) తన తరువాత జరిగే విభేదాలలో ఉమ్మత్ శరణుకోరేందుకు మరియు మద్దత్తు పోందేందుకు ఏదైనా విడిచి వేళ్ళారా?

సమాధానం: ఖుర్ఆన్‌లో ఉపదేశం:
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَطِيعُواْ ٱللَّهَ وَأَطِيعُواْ ٱلرَّسُولَ وَأُوْلِي ٱلۡأَمۡرِ مِنكُمۡۖ فَإِن تَنَٰزَعۡتُمۡ فِي شَيۡءٖ فَرُدُّوهُ إِلَى ٱللَّهِ وَٱلرَّسُولِ إِن كُنتُمۡ تُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِۚ ذَٰلِكَ خَيۡرٞ وَأَحۡسَنُ تَأۡوِيلًا
అనువాదం: విశ్వసించిన ప్రజలారా! విధేయత చూపండి అల్లాహ్‌కు, విధేయత చూపండి ప్రవక్తకు, మీలో (దైవప్రవక్త వలే) అధికారం అప్పగించబడిన వారికి. మీ మధ్య ఏ విషయంలోనైనా వివాదం తల ఎత్తితే దాన్ని అల్లాహ్‌కు, ప్రవక్తకు నివేదించండి. మీరు నిజంగానే అల్లాహ్ మీద అంతిమదినం మీదా విశ్వాసం కలవారే అయితే. ఇదే సరియైన పద్ధతి. ఫలితాన్ని బట్టి కూడా ఇదే ఉత్తమమైనది[అల్ నిసా సూరా:4, ఆయత్:59]

దైవప్రవక్త(స.అ) కరుణకు ప్రతిరూపంగా నియమించి అవతరించబడ్డారు. వారి ఉమ్మతే అన్ని ఉమ్మతులలో ఉత్తమమైనదిగా ఉండాలని చాలా ఆశతో ఉండేవారు. వారి తరువాత ఎటువంటి భేదం ఏర్పడకూడదు అందుకని దైవప్రవక్త(స.అ)కు ఉమ్మత్ కోసం ఒక పద్ధతిని నిర్ణయించి వెళ్ళవలసిన అవసరం ఎంతైన ఉంది మరియు అందుకే సహాబీయులు ముహద్దిసీనులు వారి నుంచి రివాయత్‌ను ఇలా ఉల్లేఖించారు:
”تَرَكْتُ‏ فِيكُمُ‏ الثَّقَلَيْنِ‏ مَا إِنْ‏ تَمَسَّكْتُمْ‏ بِهِمَا لَنْ تَضِلُّوا بَعْدِي ابدا كِتَابُ اللَّهِ وَ عِتْرَتِي أَهْلُ بَيْتِي لَنْ يَفْتَرِقَا حَتَّى يَرِدَا عَلَيَّ الْحَوْضَ فَانْظُرُوا كَيْفَ‏ تَخْلُفُونِّي‏ فِيهِمَا“
అనువాదం: “మీ మధ్య రెండు అమూల్యమైన వాటిని వదిలి వెళ్తున్నాను ఆ రెండింటితో కలిసి ఉన్నంత వరకు మీరు దారి తప్పరు (ఆ రెండు) ఖుర్ఆన్ మరియు నా ఇత్రత్ అనగా నా అహ్లెబైత్(అ.స)లు. ఆ రెండు నా వద్దకు (కౌసర్) సేలయేరు పై చేరనంత వరకు వేరు అవ్వరు. ఇక చూద్దాం మీ ప్రవర్తన వాళ్ళ పట్ల ఎలా ఉంటుందో”[1].

ఈ హదీస్ సరైనది, అని రుజువైన హదీసు. ముహద్దిసీన్లు, వారు సున్నీయులు కానివ్వండి లేదా షియాలు కానివ్వండి అందరు దానిని తమ మసానీద్ మరియు సహీ పుస్తకాలలో ముఫ్ఫై కన్న ఎక్కువ సహాబీయుల ద్వారా ఉల్లేఖించారు.
ఇక్కడ హదీసె సఖ్లైన్‌ను ఉల్లేఖించి దానిని సరైన హదీస్ గా ఒప్పుకున్న ఆ అహ్లె సున్నత్ ఉలమాల గురించి తెలుసుకుందాం. ఈ హదీస్‌ను ఉల్లేఖించిన అహ్లెసున్నత్ ఉలమాల సంక్షిప్త సూచిక మీ ముందు ప్రదర్శిస్తున్నాము తిలకించండి:
1. సహీ ముస్లిం, కితాబు ఫజాయిలి అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స), భాగం7, పేజీ122.
2. సహీ తిర్మిజీ, భాగం5, పేజీ328.
3. అల్ ఇమామ్ అన్నిసాయి, అల్ ఖసాయిస్ అను పుస్తకం పేజీ21.
4. ముస్నదె అహ్మద్ ఇబ్నె హంబల్, భాగం3, పేజీ17.
5. ముస్తద్రికుల్ హాకిం, భాగం3, పేజీ109.
6. కన్జుల్ ఉమ్మల్, భాగం1, పేజీ154.
7. అల్ తబఖాతుల్ కుబ్రా, ఇబ్నె సఅద్, భాగం2, పేజీ194.
8. జామివుల్ ఉసూల్, ఇబ్నె అసీర్, భాగం1, పేజీ187.
9. అల్ జామివుస్సగీర్, సీవ్తీ, భాగం1, పేజీ353.
10. మజ్మవుజ్జవాయిద్, హైసమీ, భాగం9, పేజీ163.
11. అల్ ఫత్హుల్ కబీర్, బన్హానీ, భాగం1, పేజీ451.
12. ఉస్దుల్ గాబహ్ ఫి మారిఫతిస్సహాబహ్, ఇబ్నె అసీర్, భాగం2, పేజీ12.
13. తారీఖె ఇబ్నె అసాకిర్, భాగం5, పేజీ436.
14. తఫ్సీరె ఇబ్నె కసీర్, భాగం4, పేజీ133.
15. అల్ తాజుల్ జామే లిల్ ఉసూల్, భాగం3, పేజీ308.

వీళ్ళే కాకుండా “ఇబ్నె హజర్” (తన పుస్తకం)  “సవాయిఖ్”లో ఈ హదీస్ సరైనది అని ఒప్పుకుంటూ ప్రస్తావించారు. “అల్లామా జహబీ” తన “తల్ఖీస్”లో ఈ హదీస్‌ను సరైనది అని అంగీకరిస్తూ ప్రస్తావించారు. కాని షైకైన్ల షరత్తుతో –అల్ ఖారజ్మి మరియు ఇబ్నుల్ మగాజిలీ అల్ షాఫెయీ – “తబరానీ” తన “మోజం”లో, “సీరత్తున్నబవియ్యాహ్”‎ రచయిత “అల్ సీరతుల్ హలబియ్యాహ్” యొక్క శీర్షికలో ప్రవచించారు, “యనాబీవుల్ మవద్దహ్” మరియు వేరే ఉలమాలు కూడా ప్రవచించారు.
ఈ రిఫరెన్సులన్నీటి తరువాత కూడా ఇంకా ఎవరైన “హదీసె సఖ్లైన్” గురించి సున్నీ ఉలమాలకు తెలియనే తెలియదు ఇది షియాలు సృష్టించింది, అని అనగలడా!?. అల్లాహ్ ఆ స్వమతపక్షపాతం గలవారి, ఆలోచన లేని వారి మరియు అజ్ఞానులను సహకరించే వారందరిని నాశనం చేయుగాక!. ఆ స్వమతపక్షపాతం గలవారిని వదిలేయండి. ఇక రండీ మేము మన సంభాణను ఆలోచన స్వేచ్చ కలిగి ఉన్న వారి కోసం విరరిద్దాం. వీళ్ళు కేవలం అల్లాహ్ కోసమై సత్యాన్వేషణ చేస్తూ ఉంటారు. మరి అల్లాహ్ వాళ్ళను సరైన మార్గం వరకు చేరుస్తాడేమో.
అంటే అహ్లె సున్నత్‌లలో కూడా ‎“‎హదీసె సఖ్లైన్” సరైన హదీస్ మరియు షియాలలో కూడా చాలా పెద్ద స్థాయికి చెందిన ముతవాతిర్[2] హదీస్ అనీ మరియు పవిత్ర ఆయిమ్మహ్‌ల నుంచి దాని రావీయుల క్రమం సమ్మతీయమైనదని రుజువు అయ్యింది. అయితే అర్ధం కాని విషమేమిటంటే ఈ హదీస్ పట్ల కొందరు ఎందుకు సందేహిస్తారో? మరి ఎందుకు దానిని ‎“‎కితాబుల్లాహి వ సున్నతీ”గా మార్చేస్తారో అర్ధం కాదు? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే “మిఫ్తాహె కునూజుస్సున్నహ్” రచయిత తన పుస్తకంలో పేజీ 478 పై ఆ హదీస్‌ను “బుఖారీ”, “ముస్లిం”, “తిర్మిజీ”, “ఇబ్నె మాజా” సూచనలతో ఈ పేరు శీర్షికతో ఉల్లేఖించారు “దైవప్రవక్త(స.అ) వసియ్యత్ చేశారు: అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్‌తో కలిసి ఉండండి” అని. నిజంగా మీరు ఒకవేళ ఆ నాలుగు పుస్తకాలలో చూసినట్లైతే ఈ హదీసు జాడ కూడా లేదు మరి “మిఫ్తాహు కునూజుస్సున్నహ్” రచయిత ఎందుకు ఇంత పెద్ద అబధ్ధం చెప్పారు?, అన్న మాట ఆలోచించదగ్గ విషయం. సహీ బుఖారీలో “కితాబుల్ ఏతెసాబ్ బిల్ కితాబి వల్ సున్నహ్”[3] అనే అధ్యాయం ఉంది కాని అందులో ఈ హదీస్ ప్రస్తావన లేదు.
సహీ బుఖారీ మరియు మిగిలిన మూడు పుస్తకాలలో కనిపించేది కేవలం ఇదే: “తల్హా ఇబ్నె మస్తఫ్” ఇలా ప్రవచించారు: నేను ‘అబ్దుల్లాహ్ ఇబ్నె అబీ ఔఖా’తో దైవప్రవక్త(స.అ) ఏదైన వసీయత్ చేశారా? అని ప్రశ్నించాను, అతను ఇలా అన్నాడు: లేదే!, నేను ఇలా అన్నాను: అయితే ప్రజలపై వసీయత్ చేయడం వాజిబ్ అని ఎందుకు నిర్దారించబడుతుంది లేదా ఎందుకు ప్రజలను వసీయత్‌పై అమలు చేయడం వాజిబ్ అని చెప్పబడింది? అయితే అతను ఇలా అన్నారు: అవును, వారు అల్లాహ్ గ్రంథం గురించి వసీయ్యత్ చేశారు.[4]
మరియు దైవప్రవక్త(స.అ) యొక్క ‎“‎ ترکت فيکم الثقلين.....الخ”  అనే హదీసులో “ کتاب الله و سنتی”  లేదు మరియు ఒకవేళ కొన్ని పుస్తకాలలో ఈ హదీస్ ప్రస్తావన ఉంది అని భావించినా దానికి వ్యతిరేకంగా ఇజ్మా స్థాపించబడింది అందుకని అది మాన్యత లేనిది అవుతుంది.

రిఫరెన్స్
1. హాకిమె నైషపూరీ, ముస్తద్రికుల్ హాకిం, భాగం3, పేజీ148.
2. ఒకే రివాయత్‌ను చాలా మంది ప్రవచించడంతో ఇక దాన్ని అసత్యపు రివాయత్ అని చెప్పడానికి వీలు కానటువంటి రివాయత్.
3. బుఖారీ, సహీ బుఖారీ, భాగం8, పేజీ137.
4. బుఖారీ, సహీ బుఖారీ, భాగం3, పేజీ168. తిర్మిజీ, కితాబుల్ వసాయా. ముస్లిం, అల్ వసాయా. ఇబ్నె మాజా, కితాబుల్ వసాయా.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18