కితాబల్లాహి వ సున్నతీ పరిశోధన - 1

సోమ, 10/04/2021 - 18:47

అంతిమ దైవప్రవక్త(స.అ) తమ చివరి క్షణాలలో ఉల్లేఖించిన సఖ్లైన్ హదీస్ లో “కితాబల్లాహి వ ఇత్రతీ” కాదు “కితాబల్లాహి వ సున్నతీ” అని వాదించేవారి కోసం “కితాబల్లాహి వ సున్నతీ” కాదు “కితాబల్లాహి వ ఇత్రతీ”  వివరిస్తూ కొన్ని సాక్ష్యాల వివరణ... 

కితాబల్లాహి వ సున్నతీ పరిశోధన

సఖ్లైన్ హదీస్ లో “కితాబల్లాహి వ ఇత్రతీ” కాదు “కితాబల్లాహి వ సున్నతీ” అని అహ్లె సున్నత్ ఉలమాలు వాదిస్తారు. అయితే దీనిని పరిశోధించినట్లైతే ఉల్లేఖన పరంగా గాని లేదా వివేక పరంగా గాని యదార్ధానికి అనుకూలంగా కనిపించదు. దానిని అసత్యంగా నిరూపించడం పై కొన్ని సాక్ష్యాలు ప్రదర్శిస్తున్నాను తిలకించండి;

కితాబల్లాహి వ సున్నతీ హదీస్ అసత్యమైనది:

మొదటి సాక్ష్యం:
చరిత్రకారులు మరియు ముహద్దిసీన్ల యొక్క ఇజ్మా[1] దైవప్రవక్త(స.అ) తన హదీసుల ఉల్లేఖనను ఆపివేశారు మరియు ఎవరు కూడా దైవప్రవక్త(స.అ) కాలంలో అతని సున్నత్‌లను ఉల్లేఖించే వాళ్ళము అని చెప్పలేదు. అయితే దైవప్రవక్త(స.అ) యొక్క సున్నతే లేనప్పుడు దానిని విడిచి వెళ్ళడానికి, అర్ధం ఏమిటి?. అందుకే ترکت فيکم کتاب الله و سنتی!  సత్యం కాలేదు ఎందుకంటే అల్లాహ్ గ్రంథం మాటకోస్తే దానిని దైవవాణి లేఖుల ద్వార లిఖించబడింది మరియు ఖుర్ఆన్ హుఫ్ఫాజుల[2] హృదయాలలో సురక్షితంగా ఉంది, ఏ సహాబీ అయినా అతడు ఖుర్ఆన్ కంఠస్తుడు కాకపోయినా అవసరం ఉన్నప్పుడల్లా ఖుర్ఆన్‌ పత్రాలను చూసేవాడు.
ఇక మిగిలింది దైవప్రవక్త(స.అ) సున్నత్ అది రచించబడి, లేదా అవి దైవప్రవక్త(స.అ) కాలంలో నిక్షిప్తబరచ లేనప్పుడు, దేన్ని వదిలి వెళ్తారు? చూడండి... దైవప్రవక్త(స.అ) సున్నత్ అంటే దైవప్రవక్త(స.అ) వచనం లేదా కార్యం లేదా తఖ్రీర్[3] అని అర్ధం.
దైవప్రవక్త(స.అ) తన సహాబీయులందరిని ఒకే చోట పిలిచి సున్నతులను భోదించే వారు కాదు సందర్భానికి బట్టి ఎదైన ప్రవచించే వారు ప్రవచించినప్పుడల్లా కొందరు మాత్రమే ఉండేవారు మరి అప్పడప్పుడు కేవలం ఒక్కరు ఇద్దరు మాత్రమే ఉండేవారని అందరికి తెలిసిందే మరి అలాంటి సమయంలో దైవప్రవక్త(స.అ) “నేను మీ మధ్య నా సున్నతులను విడిచి వెళ్తున్నాను ”‎ అని ఎలా చెప్పగలరు?

రెండవ సాక్ష్యం:
మరణానికి మూడు రోజుల ముందు దైవప్రవక్త(స.అ)కు రోగ తీవ్రత ఎక్కువ అయ్యినప్పుడు అతను తన తరువాత ఉమ్మత్ రుజుమార్గం తప్పకుండా ఉండాలని ఒక లేఖనం వ్రాసేందుకు కలం మరియు కాగితం ఇవ్వమని కోరారు. అందుకు ఉమర్ ఇలా అన్నారు: “దైవప్రవక్త(స.అ) హిజ్యాన్[4] స్థితిలో మాట్లాడుతున్నారు మా కొరకు అల్లాహ్ గ్రంథమే చాలు”.[5] ప్రశ్నేమిటంటే ఒకవేళ అంతకు ముందు దైవప్రవక్త(స.అ) “ترکت فيکم کتاب الله و سنتی” అని ప్రవచించి ఉంటే ఉమర్ యొక్క ఈ ప్రవచనం; “మాకు అల్లాహ్ గ్రంథం చాలు!” అసత్యం అవుతుంది. ఎందుకంటే ఇలా ఉమర్ మరియు అతని అనుచరులు దైవప్రవక్త(స.అ) యొక్క మాటను రద్దు చేశారు –ఎందుకంటే (వారి విశ్వాసం ప్రకారం) అల్లాహ్ గ్రంథం మరియు సున్నత్‌ను విడిచి వెళ్తున్నాను అని దైవప్రవక్త(స.అ) ముందే చెప్పి ఉన్నారు. అనగా దైవప్రవక్త(స.అ) రెండింటిని విడిచారు మరియు ఉమర్ కేవలం ఒకటి పైనే పట్టు పట్టారు– మరియు దైవప్రవక్త(స.అ) మాటను రద్దు చేసేవాడు అవిశ్వాసి అవుతాడు. నేను దీనిని అహ్లెసున్నతులు అంగీకరించరు అనే అనుకుంటున్నాను. మరియు విశేషము ఏమిటంటే స్వయంగా ఉమరే సహాబీయులను హదీస్ ఉల్లేఖన నుండి ఆపారు.
అందుకని కలికాలపువారిలో అహ్లెబైత్(అ.స)ల శత్రువులైన కొందరు ఈ హదీసును తయారు చేశారు, అని నా నమ్మకం. ముఖ్యంగా ఎప్పుడైతే అహ్లెబైత్(అ.స)లను ఖిలాఫత్ నుండి దూరంచేశారో అప్పుడు శత్రువులకు ఇంకా అవకాశం దొరికింది. పైకి ఎవరైతే ఈ (నకిలీ) హదీస్‌ను తయారు చేశాడో అతడు “కేవలం ఖుర్ఆన్‌పై అమలు చేయడం మరియు ఇత్రత్‌ను వదిలేయడం”‎ అహ్లెసున్నతుల కొరకు ఎత్తిపొడుపు అవ్వగలదు అని ఆలోచించి అహ్లెసున్నతులు చేసే పని సరైనది కావాలని మరియు ఎవ్వరు వాళ్ళ పై అపవాదం చేయకూడదని మరియు దైవప్రవక్త(స.అ) వసీయత్‌పై అమలు చేయని ఆ సహాబీయులను కూడా ఆదరించేలా చేయాలని ఒక తప్పుడు హదీసును తయారు చేశాడు.

మూడవ సాక్ష్యం:
అబూబక్ర్ ఖిలాఫత్ మొదటి రోజులలో అన్నిటి కన్న ముందు సంభవించిన సంఘటన “జకాత్ ఇచ్చేందుకు నిరాకరించిన వాళ్ళతో యుధ్దం చేసేందుకు ఇచ్చిన తీర్పు సంఘటన” అని ప్రపంచానికి తెలుసు. నిజానికి ఉమర్ దీనిని వ్యతిరేకించారు మరియు (ఆ వ్యతిరేకత పై) అతని సాక్ష్యం దైవప్రవక్త(స.అ) గారి ఈ హదీస్ “ఎవరైతే  لا اله الا الله محمد رسول الله అని అంటారో నా తరపు నుండి అతడి ప్రాణం మరియు అతడి ధనం సురక్షితం మరియు అతడి పట్ల తీర్మానం అల్లాహ్ బాధ్యత”. ఒకవేళ దైవప్రవక్త(స.అ) యొక్క సున్నత్ తెలిస్తే అబూబక్ర్‌కి తెలియాలి ఎందుకంటే అతను ఖలీఫా కాబట్టి. అంటే దీనితో రుజువయ్యేది ఏమిటంటే ఈ హదీసే లేకుంటే తెలిసేది ఎలా? అంటే వాళ్ళు దీనిని తరువాత కాలంలో తయారు చేశారు.
కాని ఉమర్ గురించి(చరిత్రలో) ఇలా ఉంది, అతను తరువాత అబూబక్ర్ యొక్క సాకులకు లొంగిపోయారు మరియు అబూబక్ర్ అయితే అతనే రావీ అయినటువంటి ఒక హదీసును ప్రదర్శించారు, మరి రెండవది అతనే ఇలా అన్నారు “జకాత్, ధనం యొక్క హక్కు(అందుకని దాని కోసం యుధ్ధం చేయవచ్చు). వాస్తవానికి వీళ్ళకు దైవప్రవక్త(స.అ) “సున్నతె ఫెఅలీ” తెలియదు లేదా తెలిసినా కూడా తెలియనట్లు చేస్తున్నారు. మరియు దైవప్రవక్త(స.అ) యొక్క “సున్నతె ఫెఅలీ” నెపం అసాధ్యం. సున్నతె ఫెఅలీ అనగా “సఅలబహ్ సంఘటన”; ఇతడు దైవప్రవక్త(స.అ)కు జకాత్ ఇచ్చేందుకు నిరాకరించాడు మరియు అతడి గురించి ఆయత్ కూడా అవతరించబడింది కాని అతడు జకాత్ ఇవ్వకపోయినా దైవప్రవక్త(స.అ) అతనితో యుద్ధమూ చేయలేదు మరియు అలాగే అతనిని జకాత్ ఇవ్వడంపై బలవంతం పెట్టనూ లేదు.
ఇది కాకుండా మరో సంఘటన కూడా ఉంది; దైవప్రవక్త(స.అ) ఉసామాను ఒక సర్యహ్(దైవప్రవక్త(స.అ) పాలుగోనటువంటి యుధ్ధం) కు పంపారు. ఉసామా వాళ్ళ పై విజయం సాధించారు మరియు వాళ్ళు ఓడిపోయారు అయితే ఒక వ్యక్తి ఉసామా వద్దకు వచ్చి “لا اله الا الله” అని అన్నాడు. అయినా సరే ఉసామా అతడిని చంపేశారు. దైవప్రవక్త(స.అ)కు ఈ వార్త అందినప్పుడు అతను ఉసామాతో ఇలా ప్రశ్నించారు: “నీవు لا اله الا الله అని అన్న తరువాత కూడా అతడిని చంపావా?” ఉసామా అతడు కేవలం తన ప్రాణాలు కాపాడుకోవడం కోసమని ఇలా చెప్పాడు అని అన్నారు. మరియు దైవప్రవక్త(స.అ) ఎన్నోసార్లు నిరసన వ్యక్తం చేస్తూ నేను ఈరోజు కన్న ముందు ముస్లిం కాకుండా ఉంటే ఎంత బాగుండేదో అని అన్నారు![6]
అందుకే నేను చెబుతూ ఉంటాను ఈ హదీస్ “ کتاب الله و سنتی” సరైనది అని నమ్మడం అసాధ్యం. ఎందుకంటే దాని అంగీకరించినట్లైతే మేము అన్నీంటి కన్న ముందు సహాబీయులకే దైవప్రవక్త(స.అ) యొక్క సున్నత్‌లు తెలియవు అని అంగీకరించవలసి వస్తుంది, అలాగే సహాబీయుల తరువాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మరియు మదీనా నుండి దూరంగా ఉన్న వాళ్ళు ఎలా జ్ఞానులు అయ్యి ఉంటారు?

రిఫరెన్స్
1. ఇస్లామ్‌ మతస్థులందరిలోగానీ, మత పెద్దలందరిలోగానీ ఏకాభిప్రాయం ఏర్పడటం.
2. కంఠస్తుల.
3. తఖ్రీర్ అంటే దైవప్రవక్త(స.అ) యొక్క ముందు ఎదైన ఒక పని జరిగితే దానిని దైవప్రవక్త(స.అ) ఆపకుంటే దానిని తఖ్రీర్ అంటారు.
4. సన్నిపాతము, రోగములో ఒడలు తెలియక మాట్లాడుట.
5. సహీ బుఖారీ, బాబు మరజున్నబీ వ వఫాతిహ్, భాగం5, పేజీ138. ముస్లిం, కితాబుల్ వసీయ్యహ్, భాగం2, పేజీ16.
6. సహీ బుఖారీ, భాగం8, పేజీ36. ముస్లిం, భాగం1, పేజీ67, కితాబుద్దియాత్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17