కితాబల్లాహి వ సున్నతీ పరిశోధన - 2

మంగళ, 10/05/2021 - 15:31

సఖ్లైన్ హదీస్ లో అల్లాహ్ గ్రంథంతో పాటు సున్నతీ(దైవప్రవక్త సున్నత్) అని ఉన్న హదీసులు మిథ్యమైనవి మరియు సున్నతీ అని ఉన్న హదీసును సరైన హదీసు అని నమ్మడం అవివేకం...

కితాబల్లాహి వ ఇత్రతీ పరిశోధన

మొదటి సాక్ష్యం: “సహాబీయులు చేసే కార్యములు ఎక్కువ శాతం దైవప్రవక్త(స.అ) సున్నత్‌లకు వ్యతిరేకంగా ఉండేవి”‎ అనే ఈ మాట చాలా ప్రఖ్యాతి చెందిందే. ఇక దీనికి రెండు కారణాలు; సహాబీయులు దైవప్రవక్త(స.అ) సున్నత్‌లు తెలిసి కూడా దానిని వ్యతిరేకించే వారు మరియు ఈ వ్యతిరేకత దైవప్రవక్త(స.అ) నుసూస్‌కు వ్యతిరేకంగా తన స్వయపరియాలోచన పై అమలు చేసే వారు. అయితే ఈ స్థితిలో ఉన్న వాళ్ళు అల్లాహ్ యొక్క ఈ ప్రవచనకు తగిన వారు. ఆయత్: وَمَا كَانَ لِمُؤۡمِنٖ وَلَا مُؤۡمِنَةٍ إِذَا قَضَى ٱللَّهُ وَرَسُولُهُۥٓ أَمۡرًا أَن يَكُونَ لَهُمُ ٱلۡخِيَرَةُ مِنۡ أَمۡرِهِمۡۗ وَمَن يَعۡصِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ ضَلَّ ضَلَٰلٗا مُّبِينٗا

అనువాదం: అల్లాహ్, ఆయన ప్రవక్తా, ఏ విషయంలోనైనా ఒక తీర్పు చేసినప్పుడు విశ్వాసి అయిన ఏ పురుషునికైనా, విశ్వాసురాలైన ఏ స్ర్తీకైనా, తరువాత తమ యొక్క ఆ విషయంలో స్వయంగా మళ్ళీ ఒక నిర్ణయం తీసుకునే హక్కు లేదు. ఇంకా ఎవరైనా అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే, అతను స్పష్టంగా మార్గభ్రష్టతకు గురి అయినట్లే[అహ్జాబ్ సూరా:33, ఆయత్:36]
లేదా వీళ్ళకు(సహాబీయులు) దైవప్రవక్త(స.అ) సున్నత్‌లు తెలియనే తెలియవు. అయితే ఇలాంటి పరిస్థితిలో దైవప్రవక్త(స.అ) “ ترکت فيکم سنتی” అని అనే అనకూడదు. ఎందుకంటే “నాకు దగ్గర అయిన వాళ్ళకే సున్నత్ యొక్క జ్ఞానం లేకపోతే మరి నా తరువాత వచ్చే వాళ్ళు మరియు నన్ను చూడనటువంటి వాళ్ళు ఏమి అర్ధం చేసుకుంటారు” అని దైవప్రవక్త(స.అ)‌కు తెలుసు. ఒకవేళ దైవప్రవక్త(స.అ) (ఖుర్ఆన్ వలే) సున్నత్‌ను ఉల్లేఖించే ఆదేశం ఇచ్చి దానిని కూడా ఖుర్ఆన్ తరువాత ముస్లిముల రెండవ మూల ఆధారం అవ్వాలని అనుకోని ఉంటే అప్పడు దైవప్రవక్త(స.అ)పై వాజిబ్ అయ్యే అవకాశం ఉండేది.
ప్రజల వచనం: “ఒకవేళ సున్నత్ లిఖించబడి ఉంటే సున్నత్ మరియు ఖుర్ఆన్ రెండు కలిసిపోతాయి, ఆ రెండిటి భేదము తెలిసేది కాదు”. ఇది చాలా తప్పుడు మాట ఎందుకంటే దైవప్రవక్త(స.అ)కు ఎలాగైతే ఖుర్ఆన్ యొక్క లేఖులను నియమించారో అలాగే సున్నత్ లేఖులను కూడా నియమించడం అసాధ్యం కాదు. మరియు ప్రతీ కొన్ని అధ్యాయములను ఈనాడు మన వద్ద ఉన్నట్లుగా వేరు వేరు పుస్తకాల రూపం ఇచ్చేస్తే సరిపోయేది. ఒకవేళ ఇలా చేసి ఉంటే ترکت فيکم سنتی అని అనడం సరైనది అయ్యి ఉండేది.

రెండవ సాక్ష్యం:
“ఫిత్నయే కుబ్రా”, “హర్రాహ్ సంఘటన”, “మదీనా వినాశం మరియు గౌరవనీయులైన సహాబీయుల ఘాతకముల” తరువాత అబ్బాసీయుల అధికారంలో సున్నత్‌ల ఉల్లేఖన మొదలయ్యింది, అని ప్రపంచానికి తెలుసు. మరియు హదీస్‌ పుస్తకాలలో అన్నీంటి కన్న ముందు “మొఅత్తయే ఇమామ్ మాలిక్”‎ ఉల్లేఖించబడింది. దాని కన్న ముందు హదీస్‌కు సంబంధించిన ఎటువంటి పుస్తకం కూడా వ్రాయబడలేదు. మరియు ప్రాపంచిక అత్యాశతో అప్పటి చక్రవర్తులకు దగ్గరయినటువంటి ఆ రావీయుల ప్రవచనములను ఎలా నమ్మగలము. ఇందు మూలంగానే హదీసులలో అస్వస్థత మరియు వ్యతిరేకత కనబడుతుంది. మరియు ఉమ్మత్ వివిధ వర్గాలలో విడిపోయింది. ఒక విషయం ఒక వర్గంలో రుజువయితే అదే ఇంకో వర్గం దృష్టిలో రుజువు కాలేదు, దేనినైతే ఒకరు సరైనది అని అంటారో దానినే మరోకరు సరైనది కాదు అని అంటారు.
అయితే మేము దైవప్రవక్త(స.అ) “ فيکم کتاب الله و عترتی” అని ప్రవచించారు అని ఎలా నమ్మాలి. అతనికి తెలుసు కపటవర్తనులు మరియు విరోధులు తప్పుడు మాటలను అతనికి అంటగడతారు, అని అందుకే ఇలా ప్రవచించారు: “ کثرت علی الکذابه فمن کذب علیّ فليتبوا مقعده من النار”  అనువాదం: “నాకు అసత్యాలను అంటగట్టే వారు చాలా ఉన్నారు(దాని ఫలితం) ఎవడైతె నా పై అసత్య మాటను అంటగట్టుతాడో అతడు నరకానికి అర్హుడవుతాడు”[1]. దైవప్రవక్త(స.అ) జీవితంలోనే అబద్దం చెప్పే వారు ఎక్కువగా ఉన్నారు అంటే సహాబీయులలో కొందరు తప్పుడు హదీసులను ప్రవచించి దైవప్రవక్త(స.అ)కు అంటగట్టే వారన్నమాట. ఇలాంటప్పుడు అతను తన ఉమ్మత్‌ను సున్నత్‌ను ఆచరించండి!, అని ఎందుకని ఆదేశిస్తారు?, అప్పటికే వాళ్ళకు తప్పుఒప్పులలో, మంచిచెడ్డలలో తేడా తెలుసుకునే యోగ్యత లేదు.

రిఫరెన్స్
1. బుఖారీ, సహీ బుఖారీ, కితాబుల్ ఇల్మ్, భాగం1, పేజీ35.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 22