అంతిమ దైవప్రవక్త ముహమ్మద్[స.అ] యొక్క ప్రియమైన కుమార్తె హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ], ఈమె గురించి సంక్షిప్తంగా కొన్ని అంశాలు.
పేరు: ఫాతెమా జహ్రా[స.అ]
జన్మదినం: జుమాదస్సానియా 20వ తారీకు, బేసత్ యొక్క 5వ ఏట.
జన్మస్థలం: మక్కా
భర్త పేరు: హజ్రత్ అలీ[స.అ]
తండ్రి పేరు: హజ్రత్ ముహమ్మద్[స.అ]
తల్లి పేరు: జనాబె ఖదీజా బింతె ఖువైలద్[స.అ]
మరణం: 13 జుమాదల్ ఊలా లేదా 3 జుమాదస్సానియా
మరణస్థలం: మదీనహ్
సమాధి: జన్నతుల్ బఖీ(మదీనహ్)
దైవప్రవక్త ముహమ్మద్[స.అ] ఇంట జుమాదస్సానియా 20వ తారీకు, బేసత్ యొక్క 5వ ఏట, శుక్రవారం ఉదయం ఫాతెమా జహ్రా[స.అ] జన్మించారు.
జనాబె ఫాతెమా జహ్రా[స.అ], 5 సంవత్సరాల వయసులోనే తమ తల్లిని పోగొట్టుకున్నారు. ప్రవక్త వారిని చాలా గౌరవించేవారు.
జనాబె ఫాతెమా జహ్రా[స.అ] వివాహం హిజ్రీ యొక్క 2వ ఏట హజ్రత్ అలీ[స.అ]తో జరిగింది. వారికి ముగ్గురు కుమారులు ఇమామ్ హసన్[స.అ], ఇమామ్ హుసైన్[స.అ] మరియు జనాబె మొహ్సిన్[స.అ]. మరియు ఇద్దరు కుమార్తెలు జనాబె జైనబ్[స.అ] మరియు జనాబె ఉమ్మెకుల్సూమ్[స.అ]. 13 జుమాదల్ ఊలా లేదా 3 జుమాదస్సానియాలో మరణించారు.[ముంతహల్ ఆమాల్, భాగం1, పేజీ178-189]
రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, ముంతహల్ ఆమాల్, పబ్లీషర్స్ నసీమె హయాత్, 1383.
వ్యాఖ్యానించండి