నాలుకను సమ్రక్షించుకోవటానికి గల ప్రాముఖ్యత

సోమ, 01/15/2018 - 19:02

మానవుడు తన నాలుకను తన అధీనంలో పెట్టుకోని యెడల ఇహపరలోకాలలో భారి నష్టాలను చవిచూడటం తప్పదు.

నాలుకను సమ్రక్షించుకోవటానికి గల ప్రాముఖ్యత

ఈ నాలుక చూడటానికి ఒక చిన్న అవయవమే కానీ దాని ఉపయోగించే విధానంపైనే మనిషి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, దానిని మంచి దారిలో ఉపయోగించి ప్రయోజనాలను పొందాలా లేదా దానిని తప్పుదోవ పట్టించి తనను తానే ఆటంకాల బారిన వేసుకోవాలా అనేది ఆ మానవుని ఇష్టం.
ఇమాం జైనుల్ ఆబిదీన్[అ.స]ల వారు దీని గురించే ప్రస్థావిస్తూ ఈ విధంగా ఉల్లేఖించారు:
"إنّ لِسانَ ابنِ آدمَ يُشرِفُ كُلَّ يَومٍ على جَوارِحِهِ فيقولُ: كيفَ أصبَحتُم ؟ فيقولونَ: بخَيرٍ إن تَرَكتَنا! و يقولونَ: اللّه َ اللّه َ فينا! و يُناشِدونَهُ و يَقولونَ: إنّما نُثابُ بكَ و نُعاقَبُ بكَ۔"
నిస్సందేహంగా ఆదం[అ.స] తనయుడి నాలుక ప్రతీ రోజూ ఇతర అవయవాలతో సంభాషిస్తూ ఈ విధంగా ప్రశ్నిస్తుంది: మీ పరిస్థితి ఎలాగుంది? దానికి వారు ఈ విధంగా జవాబిస్తారు: నువ్వు మమ్మల్ని మాపైనే వదిలేస్తే మంచిది మరియు నువ్వు మా గురించి ఆ అల్లహ్ కు భయపడు! ఆ తరువాత అవి అల్లాహ్ పై ప్రమాణం చేసి ఈ విధంగా ఆ నాలుకను కోరుకుంటాయి: మేము కేవలం నీవలనే ఆ దేవుని సన్నిధిలో ప్రతిఫలాన్ని పొందుతాము మరియు కేవలం నీవలనే శిక్షించబడతాము.
ఒక మాటలో చెప్పాలంటే (ఇమాం[అ.స]ల వారి ప్రవచనానుసారం) ఇతర అవయవాలు "మా మంచి కోరే దానివైతే మౌనంగా ఉండు" అని ఆ నాలుకతో విన్నవించుకుంటున్నాయి.
ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: "విస్వాసుల యొక్క సాఫల్యం వారి నాలుకను(నోటిని) రక్షించడంలోనే ఉన్నది".
మహప్రవక్త[స.అ.వ]ల వారు ఈ విధంగా ప్రవచించారు: "మానవుని యొక్క పాపాలు అధికంగా నాలుకతో జరిగేవే".
నాలుకను తన ఆధీనంలో ఉంచుకోవటం అత్యంత కష్టమైన పని ఏమీ కాదు మనిషి తలుచుకుంటే అధి సాధ్యమే
, ఒకవేళ దానిని సంరక్షించుకోకుండా ఉన్నట్లైతే మనిషి తనకు తానే నష్టాన్ని సమకూర్చుకున్నవాడవుతాడు.

రెఫరెన్స్: ఇర్షాదుల్ ఖులూబ్, 1వ భాగం, పేజీ నం:204, మీజానుల్ హిక్మత్, 10వ భాగం, పేజీ నం:267. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Sajid Ali on

Beshak bar insaan apne zubaan par lagaam dalna chahiye

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12