సున్నత్ కాదు ఇత్రత్

మంగళ, 10/05/2021 - 15:43

హదీసె సఖ్లైన్ లో సున్నతీ పదం లేదు అనడానికి అహ్లె సున్నత్ మూల గ్రంథాలలో ఉన్న ఇతర హదీసుల నిదర్శనం మరియు వాటి పై విచారణ...

సున్నత్ కాదు ఇత్రత్

మొదటి సాక్ష్యం: అహ్లెసున్నత్ తమ సహ్హాహ్ పుస్తకాలలో ఈ రివాయత్‌ను ఇలా ఉల్లేఖించారు: దైవప్రవక్త(స.అ) సఖ్లైనే లేదా ఖలీఫతైన్ లేదా షైఐన్‌లను విడిచి వెళ్ళారు, ఎందుకంటే ఒకసారి “ کتاب الله و سنه رسوله” అనీ, మరోసారి “عليکم بسنتی و سنه الخلفاء الراشدين من بعدی” అనీ రివాయత్లు ఉన్నాయి. అనువాదం: “నా సున్నత్ పై మరియు నా తరువాత ఖులఫాయే రాషిదీన్ల సున్నత్‌పై అమలు చేయడం మీ కర్తవ్యం(వాజిబ్)!” ఈ హదీస్ అల్లాహ్ గ్రంథంతో మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్‌తో పాటు ఖులఫాల సున్నత్‌ను కూడా అవశ్యకమైనదిగా సూచిస్తుంది. దీని అర్ధం ఏమైయ్యిందంటే షరీఅత్ యొక్క మూలాలు రెండుకు బదులు మూడయ్యాయి ఖుర్ఆన్, సున్నత్, ఖులాఫాల యొక్క సీరత్ మరి ఇవన్నీ హదీసె సఖ్లైన్‌కు వ్యతిరేకమైనవి. హదీసె సఖ్లైన్ సరైనది మరియు సున్నీ మరియు షియా ఇద్దరూ దాని పై ఏకాభిప్రాయం కలిగి కూడా ఉన్నారు అనగా “కితాబుల్లాహ్ వ ఇత్రతీ” హదీసు దీనినే సఖ్లైన్ అంటారు. ఇంతకు ముందే ఇరవై కన్న ఎక్కువ మూల పుస్తకాలను సూచించాము అవన్నీ అహ్లెసున్నతుల పుస్తకాలే మరియు నమ్మదగినవే అందుకని వాటికి వ్యతిరేకంగా వచ్చే హదీస్, నకిలీ హదీస్ అవుతుంది. అందుకని  “కితాబల్లాహ్ వ సున్నతీ” అన్న హదీసును తప్పుడు హదీస్ అని నమ్మకుండాా ఉండలేము.

రెండవ సాక్ష్యం: దైవప్రవక్త(స.అ)కు, నా తరువాత సహాబీయులకు వాళ్ళ భాషలోనే ఖుర్ఆన్ అవతరించింది (ప్రజల చెబుతున్న విధంగా) వాళ్ళకే ఖుర్ఆన్ వ్యాఖ్య మరియు యదార్థం తెలియదు మరి వాళ్ళ తరువాత వచ్చే వాళ్ళకు ఏమని తెలుస్తుంది అని నిశ్చయంగా తెలుసు. అయితే ఈ విషయం తెలిసిన తరువాత కూడా “కితాబల్లాహి వ ఇత్రతీ‎”‎ అని ఎందుకు ప్రవచిస్తారు? మరియు తరువాత రోము, ఫార్స్, హబ్ష్ వాళ్ళు అంతే కాదు పూర్తి అరేబీయులు ఇస్లాం స్వీకరిస్తారు వాళ్ళు ఎలా వ్యాఖ్యానం మరియు యదార్ధాన్ని తెలుసుకో గలరు? వాళ్ళకు అరబీ (భాష) తెలియదు మరియు మాట్లాడలేరు.

రివాయతులతో రుజువయ్యే విషయం ఏమిటంటే అబూబక్ర్‌తో “ و فاکهه وّ ابّا”  గురించి ప్రశ్నించినప్పుడు అతను ఇలా అన్నారు: “ఒకవేళ నేను అల్లాహ్ గ్రంథంలో నాకు తెలియని ఇలాంటి(ఆయత్ కూడా ఉంది) అని చెబితే ఇక ఏ నింగి నాకు నీడనిస్తుంది మరి ఏ నేల నన్ను ఎత్తగలదు(చెప్పండి)”.[1] మరియు అలాగే స్వయంగా ఉమర్ గారికి కూడా దీని అర్ధం తెలియదు అందుకు అనస్ ఇబ్నె మాలిక్ ద్వార రివాయత్ ఉంది: ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ పీఠం నుండి: فَأَنۢبَتۡنَا فِيهَا حَبّٗا وَعِنَبٗا وَقَضۡبٗا وَزَيۡتُونٗا وَنَخۡلٗا وَحَدَآئِقَ غُلۡبٗا وَفَٰكِهَةٗ وَأَبّٗا; అనువాదం: ఆ తరువాత అందులో ధాన్యం, ద్రాక్ష, కూరగాయలు, ఆలివ్(జైతూన్) వృక్షాలు, దట్టమైన తోటలు, ఇంకా రకరకాల పండ్లను, మేతను మీకొరకు, మీ పశువుల కొరకు జీవన సామాగ్రిగా పండించాము[అబస సూరా:80, ఆయత్:27-31] ఈ పవిత్ర ఆయత్‌ను పఠించిన తరువాత ఇలా అన్నారు: దీనిలో ఉన్నవన్నీ నాకు తెలుసు కేవలం ఈ “ ابّا” (అబ్బా) ఏమిటి అనేది? నాకు తెలియదు! ఆ తరువాత ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షిగా ఇదే సంకటము. ఒకవేళ మీకు ‎“‎అబ్బా” యొక్క అర్ధం తెలియకుంటే పరవాలేదు అందులో తప్పేమిలేదు. ఖుర్ఆన్ మీ హిదాయత్ కోసం ప్రవచించబడినది దానిని అనుచరించండి మరియు మీకు తెలియని వాటిని అల్లాహ్‌పై వదిలేయండి[2] ఏదైతే ఇక్కడ ఖుర్ఆన్ వ్యాఖ్యానం గురించి చెప్పబడుతున్నాయో అవే అక్కడ దైవప్రవక్త(స.అ) సున్నతుల వ్యాఖ్యానం మరియు వివరణలో కూడా చెప్పబడుతుంది. దైవప్రవక్త(స.అ) ఎన్నో హదీసులు మరి వాటి పట్ల సహాబీయుల మరియు వర్గాల మధ్య అభిప్రాయబేధాలు ఉన్నాయి, సున్నీ మరియు షియాలలో వ్యతిరేకతను చోటు చేసుకున్నాయి ఇక ఆ వ్యతిరేకత మరియు అభిప్రాయభేదం‎‎ హదీస్ సరైనదా కాదా అని అయ్యి ఉండొచ్చు లేదా దాని వ్యాఖ్యను అర్ధం చేసుకోవడంలో అయ్యి ఉండొచ్చు.

రిఫరెన్స్
1. ఖస్తలాని, ఇర్షాదుస్సారిలో, భాగం10, పేజీ298పై. ఇబ్నె హజర్ ఫత్హూల్ బారీలో భాగం13, పేజీ230 పై ఉల్లేఖించారు.
2. ముస్తద్రికె హాకిం, భాగం2, పేజీ14. తల్ఖీసుజ్జహబీ. తారీఖె ఖతీబ్, భాగం11, పేజీ468, తఫ్సీరె కష్షాఫ్, భాగం3, పేజీ253. తఫ్సీరె ఖాజిన్, భాగం4, పేజీ374. ముఖద్దమయే ఉసూలె తఫ్సీరె ఇబ్నె తైమియా, పేజీ30. తఫ్సీరె ఇబ్నె కసీర్, భాగం4, పేజీ473.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8