అహ్లెబైత్(అ.స) పవిత్రులు ఖుర్ఆన్ దృష్టిలో

శని, 10/09/2021 - 16:48

దైవప్రవక్త(స.అ) అహ్లె బైత్(అ.స)లు పవిత్రలు మరియు వారి నుంచి ఎటువంటి తప్పు జరగదు అని నిదర్శిస్తున్న ఖుర్ఆన్ ఆయతుల నుంచి కొన్నీంటి వివరణ...

అహ్లెబైత్(అ.స) పవిత్రులు

షియా విశ్వాసాలనుసారం “ఇమామ్‌ను కూడా ప్రవక్త వలే అన్ని బాహ్య మరియు అంతర దుర్మార్గాల నుండీ, అపవిత్రతల నుండీ జన్మించినప్పటి నుండి చనిపోయే వరకు పవిత్రంగా ఉండడం అవసరం. ఇమామ్ నుండి తెలిసో లేక తెలియకో ఎటువంటి తప్పు జరగదు. మరి అలాగే అతనికి మర్చిపోవడం, తెలియకపోవడం అన్న విషయాలు అసాధ్యమైనవి. ఎందుకంటే ఇమాములు ప్రవక్త వలే షరీఅత్ రక్షకులు. ఏ సాక్ష్యాలు ప్రవక్తల ఇస్మత్‌ను నిరూపిస్తాయో అవే సాక్ష్యాలు ఇమాముల పివత్రత మరియు ఇస్మత్‌ను కూడా నిరూపిస్తాయి, వారిలో ఎటువంటి తేడా లేదు”.[1]

అయితే ఇక్కడ మేము షియా ముస్లిముల ఈ విశ్వాసం ఖుర్ఆన్ మరియు సున్నత్‌కు వ్యతిరేకమైనదా? దాని అంగీకారం బుద్ధికి సాధ్యంకానిదా? దానితో ఇస్లాం పై ఏదైన మచ్చ పడుతుందా? దైవప్రవక్త(స.అ) లేదా(పవిత్ర మాసూమీన్) లలో లోపాన్ని వెల్లడిస్తుందా?
ఎంత మాత్రం కాదు! ఈ విశ్వాసం ఖుర్ఆన్ మరియు సున్నత్‌కు అనుసారమైనది. సరళబుద్ధి దానిని సమ్మతిస్తుంది. దానితో దైవప్రవక్త(స.అ) ఉన్నత్వం పెరుగుతుంది అంతకు మించి దానికి వ్యతిరేకమైన విశ్వాసం –ప్రవక్త తప్పుచేయువాడు, పాపము చేయుగలవాడు– తప్పుడు విశ్వాసం, ఎందుకంటే దీనితో బుధ్దిహీనత్వం తెలుస్తుంది. ప్రవక్త తప్పు చేయడం మరియు ప్రజలు అతనిని సరిదిద్దడం; ఇది సాధ్యమా?  నిజానికి ఇలాంటి విశ్వాసం అవివేకానికి నిదర్శనం.  

రండి... ఇప్పుడు ఖుర్ఆన్‌, ఇస్మత్‌ని సమ్మతిస్తుందా లేదా? అనే విషయాన్ని తెలుసుకుందాం.
మొదటి ఆయత్:
 إِنَّمَا يُرِيدُ ٱللَّهُ لِيُذۡهِبَ عَنكُمُ ٱلرِّجۡسَ أَهۡلَ ٱلۡبَيۡتِ وَيُطَهِّرَكُمۡ تَطۡهِيرٗا
అనువాదం: దైవప్రవక్త అహ్లెబైతులైన మీ నుండి (అన్ని విధాల) అపవిత్రతలను దూరంగా ఉంచి మిమ్మల్ని పూర్తిగా పవిత్రులుగా ఉంచాలని అల్లాహ్ ఉద్దేశం[అల్ అహ్జాబ్ సూరా:33, ఆయత్:33.]
ఇక రిజ్స్(అన్ని రకాల అపవిత్రత అని అర్ధం.) ను దూరం చేయడం మరియు అన్ని పాపముల నుండి పవిత్రం చేయడం. అనగా దాని అర్ధం ఇస్మత్ కాకుంటే మరేమిటి? ఒకవేళ వేరే అర్ధం ఉంటే అది ఏమిటి? అహ్లెబైత్ ఎవరు అన్న విషయంపై ఇంతకు ముందు చాలా వ్యాసాలలో వివరించడం జరిగింది.[2]  

రెండవ ఆయత్:
 إِنَّ ٱلَّذِينَ ٱتَّقَوۡاْ إِذَا مَسَّهُمۡ طَٰٓئِفٞ مِّنَ ٱلشَّيۡطَٰنِ تَذَكَّرُواْ فَإِذَا هُم مُّبۡصِرُونَ
అనువాదం: వాస్తవానికి భయభక్తులు కలవారి స్థితి ఇలా ఉంటుంది. ఎప్పుడైనా షైతాను ప్రభావంవల్ల వారికి ఏదైనా చెడు ఆలోచన తట్టినప్పటికీ, వారు తక్షణం అప్రమత్తులు అవుతారు. తరువాత వారు అవలంబించవలసిన సరియైన మార్గమేమిటో వారికి స్పష్టంగా కనిపిస్తుంది[ఆరాఫ్ సూరా:7, ఆయత్:201]
అంటే షైతాన్ ఒక మొమిన్‌ను తప్పుదారి పట్టించాలని అనుకున్నప్పుడు ఆ మొమిన్ ఉలిక్కిపడతాడు. మరియు సత్యాన్ని చూసి దానిని అనుచరించడం మొదలు పెడతాడు. ఒక ధర్మనిష్ఠగల వ్యక్తి పరిస్థితే ఇలా ఉంటే ఇక ఎవరినైతే అల్లాహ్ ఎన్నుకున్నాడో మరియు వాళ్ళ నుండి “రిజ్స్”ను దూరంగా ఉంచాడో వాళ్ళ గురించి మీరు ఏమి ఆలోచిస్తున్నారు?.

మూడవ ఆయత్:
 ثُمَّ أَوۡرَثۡنَا ٱلۡكِتَٰبَ ٱلَّذِينَ ٱصۡطَفَيۡنَا مِنۡ عِبَادِنَا
అనువాదం: ఆ తరువాత మేము ఈ గ్రంథానికి వారసులుగా మా దాసులలో నుండి మేము ఎన్నుకున్న వారినే నిర్ధారించాము[ఫాతిర్ సూరా:35, ఆయత్:32]
ఎవరినైతే అల్లాహ్ ఎన్నుకొన్నాడో అతను తప్పకుండా పాపముల నుండి పవిత్రులై ఉంటాడు అన్న విషయం తెలిసిందే. మరియు ఈ ఆయత్ అదే ఆయతు ఎప్పుడైతే ఉలమాలందరిని మామూన్ ఆహ్వానించి హజ్రత్ ఇమామ్ అలీ రిజా(అ.స)తో చర్చ జరిపించాడో, అప్పుడు ఇమామ్ ఈ ఆయత్ ద్వారానే తమ మాటను నిరూపిస్తూ ఇలా అన్నారు: ఈ ఆయత్ ఆయిమ్మాను ఉద్దేశిస్తుంది వాళ్ళనే అల్లాహ్ ఎన్నుకుని ఖుర్ఆన్ యొక్క వారసులుగా నిశ్చయించాడు. వాళ్ళు దీనిని కూడా అంగీకరించారు.[3]
ఉదాహారణగా కొన్ని ఆయతులను మాత్రమే ప్రదర్శించడం జరిగింది. అవి కాకుండా వేరే చాలా ఆయత్‌లు ఆయిమ్మాల ఇస్మత్‌ను నిరూపిస్తాయి.
ఉదా: “ائمه يهدون بامرنا” ఆయత్[4]. కాని సంక్షిప్తాన్ని దృష్టిలో పెట్టి ఇంతటితో ఆపివేస్తున్నాను.

రిఫరెన్స్
1. అఖాయిదుల్ ఇమామియ్యాహ్, పేజీ 67, అఖీదా నంబర్ 24.
2. https://te.btid.org/node/1577
3. అల్ అఖ్దుల్ ఫరీద్, భాగం3, పేజీ42.
4. సూరయె సజ్దా యొక్క 24వ ఆయత్ లో మరియు సూరయె అంబియా యొక్క 73వ ఆయత్ లో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12