ఇమాముల జ్ఞానం

సోమ, 10/11/2021 - 15:48

ఎవ్వరికి ప్రసాదించని జ్ఞానాన్ని అల్లాహ్, ఇమాములకు ప్రసాదించాడు. ఇమామ్ తన కాలంలో అందరి కన్న ఎక్కువ తెలిసినవారు అయ్యి ఉంటాడు. ఇమామ్‌ను ప్రశ్నించడం మరియు అతను దానికి జవాబు ఇవ్వక పోవడం అన్నది అసాధ్యమైన విషయం!” అన్న షియా ముస్లిముల నమ్మకం పై ఖుర్ఆన్ యొక్క నిదర్శనాలు...

ఇమాముల జ్ఞానం

షియా ముస్లిముల నమ్మకం: “ఎవ్వరికి ప్రసాదించని జ్ఞానాన్ని అల్లాహ్, ఇమాములకు ప్రసాదించాడు. ఇమామ్ తన కాలంలో అందరి కన్న ఎక్కువ తెలిసినవారు అయ్యి ఉంటాడు. ఇమామ్‌ను ప్రశ్నించడం మరియు అతను దానికి జవాబు ఇవ్వక పోవడం అన్నది అసాధ్యమైన విషయం!”
షియా ముస్లిముల ఈ వ్యాజ్యం పై వాళ్ళ వద్ద ఏదైన సాక్ష్యం ఉందా అన్న విషయాన్ని పరిశోదిద్దాం.
ఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తుంది: ثُمَّ أَوۡرَثۡنَا ٱلۡكِتَٰبَ ٱلَّذِينَ ٱصۡطَفَيۡنَا مِنۡ عِبَادِنَا
అనువాదం: ఆ తరువాత మేము ఈ గ్రంథానికి వారసులుగా మా దాసులలో నుండి మేము ఎన్నుకున్న వారినే నిర్ధారించాము[ఫాతిర్ సూరా:35, ఆయత్:32.]
ఈ ఆయత్ “అల్లాహ్ తన దాసులలో ముఖ్యమైన కొందరిని ఎన్నుకొని ఖుర్ఆన్ జ్ఞానానికి వారసులు చేశాడు” అని చెబుతుంది. అయితే మా వద్ద అల్లాహ్ చేత ఎన్నుకొబడ్డ ఆ వ్యక్తులను గుర్తించడం కోసం ఏదైనా మార్గం ఉందా? “అవును ఖుర్ఆన్ మరియు హదీస్‌లు ఉన్నాయి”
ఒకవేళ ఖుర్ఆన్ యొక్క వ్యాఖ్యానం ఖుర్ఆన్‌తోనే చేసినట్లైతే అల్లాహ్ ఆయిమ్మయే అహ్లెబైత్(అ.స)ను చీకటిలో దీపం మరియు హిదాయత్ చేసే ఇమామ్ అవ్వాలని దైవజ్ఞానం[1] ప్రసాదించాడు, అన్న విషయాన్ని సూచిస్తున్న చాలా ఆయత్‌లు ఉన్నాయి. అల్లాహ్ ఇలా ప్రవచిస్తున్నాడు.. يُؤۡتِي ٱلۡحِكۡمَةَ مَن يَشَآءُۚ وَمَن يُؤۡتَ ٱلۡحِكۡمَةَ فَقَدۡ أُوتِيَ خَيۡرٗا كَثِيرٗاۗ وَمَا يَذَّكَّرُ إِلَّآ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ
అనువాదం: తాను కోరిన వారికి దివ్యజ్ఞానం ప్రసాదిస్తాడు. ఎవరికి దివ్యజ్ఞానం లభించిందో, వాస్తవంగా వారికి మహాభాగ్యం లభించినట్లే. విజ్ఞత ఉన్న వారే ఈ విషయాలనుండి పాఠం నేర్చుకుంటారు[అల్ బఖరా సూరా:2, ఆయత్:269]
వేరే చోట అల్లాహ్ ఇలా ప్రవచించెను: فَلَآ أُقۡسِمُ بِمَوَٰقِعِ ٱلنُّجُومِ وَإِنَّهُۥ لَقَسَمٞ لَّوۡ تَعۡلَمُونَ عَظِيمٌ إِنَّهُۥ لَقُرۡءَانٞ كَرِيمٞ  فِي كِتَٰبٖ مَّكۡنُونٖ لَّا يَمَسُّهُۥٓ إِلَّا ٱلۡمُطَهَّرُونَ
అనువాదం: నేను నక్షత్రాల స్థానాల సాక్షిగా చెబుతున్నాను, మరియు నీకు ఈ ప్రమాణం ఎంత పెద్ద ప్రమాణమో తెలుసా, ఈ ఖుర్ఆన్ చాలా హోన్నతమైనది, ఒక సురక్షితమైన గ్రంథంలో ఉంచబడి ఉంది, దానిని పరిశుధ్ధులు తప్ప మరెవరూ తాకలేరు[వాఖిఅహ్ సూరా:56 ఆయత్:75-79.]
ఈ ఆయత్‌లో అల్లాహ్ చాలా ప్రముఖ ప్రమాణాన్ని గుర్తు చేస్తూ ఇలా ప్రవచించాడు: ఖుర్ఆన్‌లో ఎన్నో గోప్య అంశాలు మరియు అంతరర్ధాలు ఉన్నాయి. వాటి యదార్ధాలు పవిత్రులకు తప్ప వేరే ఎవరికి తెలియవు. మరి పవిత్రులు అనగా “తత్హీర్ ఆయత్‌”కు నిదర్శనమైన అహ్లెబైత్(అ.స)‌లే.
ఈ ఆయత్, ఖుర్ఆన్ యొక్క అంతరర్ధాల జ్ఞానం కేవలం ఆయిమ్మయే అహ్లెబైత్(అ.స)కు మాత్రమే ఉంది వేరే వ్యక్తి వాళ్ళను ఆశ్రయించ కుండా వాటిని తెలుసుకోలేడు అని చెబుతోంది.
అలాగే ఖుర్ఆన్‌లో ఇలా ప్రవచించబడి ఉంది: هُوَ ٱلَّذِيٓ أَنزَلَ عَلَيۡكَ ٱلۡكِتَٰبَ مِنۡهُ ءَايَٰتٞ مُّحۡكَمَٰتٌ هُنَّ أُمُّ ٱلۡكِتَٰبِ وَأُخَرُ مُتَشَٰبِهَٰتٞۖ فَأَمَّا ٱلَّذِينَ فِي قُلُوبِهِمۡ زَيۡغٞ فَيَتَّبِعُونَ مَا تَشَٰبَهَ مِنۡهُ ٱبۡتِغَآءَ ٱلۡفِتۡنَةِ وَٱبۡتِغَآءَ تَأۡوِيلِهِۦۖ وَمَا يَعۡلَمُ تَأۡوِيلَهُۥٓ إِلَّا ٱللَّهُۗ وَٱلرَّٰسِخُونَ فِي ٱلۡعِلۡمِ...
అనువాదం: ఆయన మీపై అవతరింపజేసిన గ్రంథం, అందులో కొన్ని ఆయత్‌లు ముహ్కమాత్‌లు(స్పష్టమైనవి) ఇవే గ్రంథానికి అసలైనవి మరియు కొన్ని ముతషాబిహాత్‌లు(అస్పష్టమైనవి) వక్ర మనస్కులు కలతలను రేపేందుంకు ఎల్లప్పుడూ ముతషాబిహాత్ వెంట వాటికి అర్ధాలు తొడిగే ప్రయత్నం చేస్తారు కాని వాటి అసలు అర్ధాన్ని అల్లాహ్ మరియు పరిపక్వ జ్ఞానం కలవారు తప్పు మరెవ్వరికీ తెలియదు...,[సూరా ఆలె ఇమ్రాన్:3, ఆయత్:7].

ఇంతకు ముందు ఆయతులతో “రాసిఖూన ఫిల్ ఇల్మ్” “అహ్లె బైత్”లే అని నిరూపించబడినట్లు ఈ ఆయత్‌తో “అల్లాహ్ ఖుర్ఆన్‌లో కొన్ని రహస్యాలను ఉంచాడు మరి వాటిని అల్లాహ్ మరియు “రాసిఖూన ఫిల్ ఇల్మ్”(పరిపక్వ జ్ఞానము) గల వారికి తప్ప వేరే ఎవ్వరికి తెలియదు” అని తెలుస్తుంది. దైవప్రవక్త(స.అ) ఈ యదార్ధం వైపు సూచిస్తూ ఇలా ప్రవచించారు: “వాళ్ళ కన్న ముందుకు పోవద్దు లేకపోతే నష్టపోతావు మరియు వాళ్ళ పట్ల ఏ విధమైన కొరతను చేయవద్దు(వాళ్ళ నుండి దూరం అవ్వడం వాళ్ళ పట్ల అవిధేయత చూపడం) లేకపోతే నాశనం అయిపోతావు వాళ్ళకు బోధించాలని ప్రయత్నించవద్దు ఎందుకంటే వాళ్ళు నీ కన్న జ్ఞానులు!”[2]

మరియు హజ్రత్ అలీ(అ.స) ఇలా ప్రవచించారు: “మాపై శత్రుత్వంతో వారు “రాసిఖూన ఫిల్ ఇల్మ్” అని చెప్పుకునే వారు ఎక్కడున్నారు?(ఈ తప్పుడు వ్యాజ్యం కారణంగానే) అల్లాహ్ మమ్మల్ని గౌరవనీయులు చేశాడు మరియు వాళ్ళను అగౌరవులు చేశాడు, మమ్మల్ని కానుకలు ప్రసాదించాడు వాళ్ళను భ్రష్టులు చేశాడు, మమ్మల్ని హిదాయత్(ద్వారం)లో ప్రవేశింపజేశాడు వాళ్ళను బయటికి తీశాడు, మా ద్వారానే హిదాయత్‌ కోరబడుతుంది మరియు మా పై (వ్యతిరేకత) కారణంగా మనిషి దారి తప్పుతాడు... ఇమాములు ఖురైషీయుల నుండే అవుతారు, వీరు హాషిం నుండి పుట్టిన వారు అయ్యి ఉంటారు. హిదాయత్ చేసే హక్కు మాకు తప్ప వేరే వాళ్ళకు లేదు. మాకు తప్ప అధికారం ఎవ్వరి కోసం కూడా సరైనది కాదు...,”[3]

ప్రశ్నేమిటంటే ఒకవేళ ఆయిమ్మయే అహ్లెబైత్(అ.స)లు రాసిఖూన ఫిల్ ఇల్మ్ కాకుంటే మరి(రాసిఖూన ఫిల్ ఇల్మ్) ఎవరు? పూర్వం మరియు ఈ కాలంలో “మేము అహ్లెబైత్(అ.స) కన్న ఎక్కువ జ్ఞానం గల వారము” అని వ్యాజ్యం చేసిన వారు లేరు, అన్న విషయం తెలుసు.

ఇంకో ఆయత్‌[4]ను తిలకించండి:.....فَسۡ‍َٔلُوٓاْ أَهۡلَ ٱلذِّكۡرِ إِن كُنتُمۡ لَا تَعۡلَمُونَ
అనువాదం: (ఓ ప్రవక్తా) వాళ్ళతో ఒకవేళ మీకు తెలియకపోతే తెలిసినవారిని అడిగి తెలుసుకోమని చెప్పండి(
ఈ ఆయత్ అహ్లెబైత్(అ.స)లకు ప్రతిష్టతకు సంబంధించింది.[5]
ఈ ఆయత్ పూర్తి స్పష్టతతో దైవప్రవక్త(స.అ) మరణాంతరం ఉమ్మత్ కోసం యదార్థాలు తెలుసుకోవడం కోసం అహ్లెబైత్(అ.స)లను ఆశ్రయించడం చాలా అవసరం, అని చెబుతుంది. మరియు సహాబీయులకు ఎప్పుడు ఏ కష్టమైన సమస్యలు ఎదురొచ్చినా హజ్రత్ అలీ(అ.స)నే ఆశ్రయించే వారు ఎలాగైతే ప్రతీ కాలంలో హరామ్ మరియు హలాల్‌ను తెలుసుకోవడం కోసం అహ్లెబైత్(అ.స) లను ఆశ్రయించే వారో మరియు వాళ్ళ జ్ఞానం నుండి పొందడానికి ఎల్లప్పుడూ వాళ్ళ సన్నిదిలో హాజరై ఉండే వారో. స్వయంగా అబూహనీఫాయే ఇలా ప్రవచించారు: “لولاالسّنتان لهلک النعمان; ఒకవేళ రెండు సంవత్సరములు పొందకుండా ఉంటే అబూ హనీఫా చచ్చిఉండే వాడు” ఆ రెండు సంవత్సరములు అనగా ఇమామ్ జాఫర్ సాదిఖ్(అ.స) నుండి అబూహనీఫా విద్యాభ్యాసం చేసిన రెండు సంవత్సరములు. మరియు ఇమామ్ మాలిక్ ఇబ్నె అనస్ ఇలా అన్నారు: “జ్ఞానం మరియు ప్రతిష్టతలో, ధర్మనిష్ట మరియు దైవారాధనలో ఇమామ్ జాఫర్ సాదిఖ్(అ.స) ను మించిన వారిని ఏ కళ్ళు చూడలేదు మరియు ఏ చెవులు వినలేదు మరియు ఎవరి మనసులో ఇలాంటి ఆలోచన రాలేదు.[6]

రిఫరెన్స్
1. ఇల్మె లదున్ని.
2. సవాయిఖుల్ ముహ్రిఖహ్, పేజీ148. దర్రు మన్సూర్, భాగం2, పేజీ60. కన్జూల్ ఉమ్మాల్, భాగం1, పేజీ 164. ఉస్దుల్ గాబహ్, భాగం3, పేజీ137.
3. నెహ్జుల్ బలాగహ్, భాగం2, పేజీ 143. షర్హె ముహమ్మద్ అబ్దుహ్, ఖుత్బా(ఉపన్యాసం) నంబరు 143.
4. నహ్ల్ సూరా:16, ఆయత్:43. మరియు అంబియా సూరా:21, ఆయత్:7.
5. తఫ్సీరె తబరీ, భాగం14, పేజీ 134. తఫ్సీరె ఇబ్నె కసీర్, భాగం2, పేజీ570. తఫ్సీరె ఖుర్తుబీ, భాగం11, పేజీ232. షవాహిదత్తన్జీల్, భాగం1, పేజీ334. యనాబీవుల్ మవద్దహ్ మొ॥.
6. మనాఖిబె ఆలె అబీతాలిబ్ ఫీ అహ్వాలిల్ ఇమామ్ అల్ సాదిఖ్(అ.స).

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17