ఇమాముల సంఖ్య

మంగళ, 10/12/2021 - 15:54

షియా ముస్లిముల విశ్వాసం ప్రకారం దైవప్రవక్త(స.అ) తరువాత ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా ఇమాముల సంఖ్య 12 మరియు కేవలం పన్నెండు మాత్రమే అన్న విషయం పై హదీస్ నిదర్శనం...

ఇమాముల సంఖ్య

షియా ముస్లిముల విశ్వాసం ప్రకారం దైవప్రవక్త(స.అ) తరువాత ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా ఇమాముల సంఖ్య 12 మరియు కేవలం పన్నెండు మాత్రమే. స్వయంగా దైవప్రవక్త(స.అ) వాళ్ళ పేర్లు మరియు వాళ్ళ సంఖ్యను (ఇలా) ప్రకటించారు;[1]
1. హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స)
2. హజ్రత్ ఇమామ్ హసన్(అ.స)
3. హజ్రత్ ఇమామ్ హుసైన్(అ.స)
4. హజ్రత్ ఇమామ్ అలీ ఇబ్నె హుసైన్(అ.స)
5. హజ్రత్ ఇమామ్ ముహమ్మద్ ఇబ్నె అలీ(అ.స)
6. హజ్రత్ ఇమామ్ జాఫర్ ఇబ్నె ముహమ్మద్(అ.స)
7. హజ్రత్ ఇమామ్ మూసా ఇబ్నె జాఫర్(అ.స)
8. హజ్రత్ ఇమామ్ అలీ ఇబ్నె మూసా(అ.స)
9. హజ్రత్ ఇమామ్ ముహమ్మద్ ఇబ్నె అలీ(అ.స)
10. హజ్రత్ ఇమామ్ అలీ ఇబ్నె ముహమ్మద్(అ.స)
11. హజ్రత్ ఇమామ్ హసన్ ఇబ్నె అలీ(అ.స)
12. హజ్రత్ ఇమామ్ ముహమ్మద్ ఇబ్నె హసన్(అ.స) (మహ్‌దీ ముంతజర్(అ.స))

షియా ముస్లింలు కేవలం ఈ పన్నెండు ఇమాముల పట్లే ఇస్మత్‌ను నమ్ముతారు. షియా ముస్లింలు అహ్లెబైత్(అ.స)‌ల పట్ల ఇస్మత్‌ను విశ్వాసిస్తారు అందుకని “ఉర్దున్” రాజు “షాహ్ హుసైన్” మరియు “మలిక్ హసన్ సాని” కూడా అహ్లెబైత్‌(అ.స)ల నుండే అని మరియు ఇప్పుడు షియాలు “ఇమామ్ ఖుమైనీ”ను కూడా జోడించారు, అయితే వీళ్ళందరు మాసూములే(పవిత్రులే) అని ఎవ్వరు ముస్లిములను మోసగించకండి. ఒకవేళ ఎవరైన ఇలా అన్నట్లైతే అది అపనింద మరియు అబధ్ధం అంతే అంతకు మించి ఏదీకాదు. ఇలాంటి మాటలు సాధారణమైన షియా కూడా చెప్పరు, అలాంటిది చదువుకున్న మరియు ఉలమాల సంగతి వదిలేయండి. నిజానికి ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు ఇలా చేసి యువకులను దారితప్పించాలని అనుకుంటారు కాని ఇది వాళ్ళ వట్టి తలంపులు. షియా ముస్లింలు మొదటి నుండి ఇప్పటి వరకు కేవలం ఆ పన్నెండు ఇమాముల ఇస్మత్‌నే నమ్ముతారు. దైవప్రవక్త(స.అ) ఆ పన్నెండు గురి పేర్లును వాళ్ళు జన్మించక ముందే ప్రకటించారు. స్వయంగా అహ్లెసున్నతుల ఉలమాలలో కూడా కొందరు ఈ పేర్లను ఉల్లేఖించారు. బుఖారీ మరియు ముస్లిం కూడా ఇమాముల సంఖ్య పన్నెండు అని వ్రాశారు మరియు వాళ్ళందరు ఖురైషీయులు అని కూడా ఉల్లేఖించారు.[2]

కొన్ని హదీసులు:
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ కథనం: దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: ఖలీఫాలు, నా వారసులు మరియు నా తరువాత అల్లాహ్ మార్గదర్శకులు 12 మంది; వారిలో మొదటివారు నా సోదరుడు మరియు చివరి వారు నా కుమారుడు. ఓ దైవప్రవక్తా(స.అ)! మీ సోదరుడు ఎవరు? అని ప్రశ్నించగా వారు అలీ ఇబ్నె అబీతాలిబ్ అన్నారు. మీ కుమారుడు ఎవరూ అని ప్రశ్నించగా వారు అన్యాయాలతో దుర్మార్గాలతో నిండిపోయివున్న ప్రపంచాన్ని న్యాయధర్మాలతో నింపే మహ్దీ అని సమాధానమిచ్చారు.[3]
అబూసయీదె ఖుద్రీ కథనం: దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: సహాబీయులారా! తెలుసుకోండి నా అహ్లెబైత్ ఉపమానం నూహ్ నౌక వంటిది, వారిని పట్టుకొని ఉండండి; వారు గొప్ప నాయకులు.., వారిని ఆశ్రయించినవారు ఎప్పటికీ మార్గభ్రష్టులు కాలేరు.[4]
అబూ మన్సూర్, అబూసయీదె ఖుద్రీ ద్వార ఇలా ఉల్లేఖించారు: ఓ దైవప్రవక్త(స.అ) మీ తరువాత అయిమ్మహ్(నాయకులు) ఎవరు అని ప్రశ్నించగా వారి ఇలా ఉల్లేఖించారు: నా అహ్లె బైత్ నుండి పన్నెండు మంది[5]

ఎప్పుడైతే షియా ముస్లిములు చెప్పినట్లు ఆ ఇమాములు, అహ్లెబైత్(అ.స)ల నుండి అవుతారో అప్పుడే ఈ హదీసులన్నీ సరైనవి అవుతాయి మరియు వాటి అర్ధం నిజమౌతుంది. లేకపోతే సున్నీయులు ఇప్పటి వరకు ఆ విడుపుకథను విప్పలేక పోయారు. ఎందుకంటే ఇమాముల సంఖ్యను వాళ్ళు కూడా 12 అని నమ్ముతారు కాని ఆ పన్నెండు గురు ఎవరు? ఈ ప్రశ్నకు జవాబు వాళ్ళ వద్ద లేదు. మరియు షియా ముస్లింల మాటను వాళ్ళు అంగీకరించరు. అందుకని ఈ చిక్కుప్రశ్న తన స్థానంలో అలాగే మిగిలి ఉంది. ఎవరైనా ఈ ప్రశ్నకు సమాధానం కోసం పరిశోధనకు నడుము బిగిస్తే తప్పకుండా అతడు పరిశోధన పూర్తి అయ్యే సరికి రుజుమార్గం పొందడం ఖాయం...

అల్లాహ్ మనందరికి మతపక్షపాతం లేకుండా మతపరమైన విశ్వాసాలను పరిశోధించి వాటిని తెలుసుకొని వాటిపై అమలు చేసే అవకాశం మనకు కలిగించాలి.

రిఫరెన్స్
1. యనాబీవుల్ మవద్దహ్, భాగం3, పేజీ99.
2. సహీ బుఖారీ, భాగం8, పేజీ127. సహీ ముస్లిం, భాగం6, పేజీ3.
3. యనాబీవుల్ మువద్దహ్, ఖందూజీ, పేజీ443.
4. యనాబీవుల్ మువద్దహ్, ఖందూజీ, పేజీ442.
5. యనాబీవుల్ మువద్దహ్, ఖందూజీ, పేజీ440-442.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7