మహ్‌దీ ముంతజర్(అ.స)

ఆది, 10/17/2021 - 15:11

ఇస్లామీయ విశ్వాసాలలో ఇమామ్ మహ్‌దీ(అ.స) యొక్క యదార్ధం ఏమిటి? అన్న విషయం పై ఇరువర్గాల హదీస్ గ్రంథాల నుంచి హదీసుల ద్వార నిదర్శనం...

మహ్‌దీ ముంతజర్(అ.స)

మహ్‌దీ ఉన్నారా? అన్న విషయానికి వస్తే సున్నీ మరియు షియా ముస్లిములందరు దైవప్రవక్త(స.అ), మహ్‌దీ వస్తారు అన్న శుభవార్తను ఇచ్చారు. మరియు తమ సహాబీయులతో అల్లాహ్ చివరి కాలంలో మహ్‌దీని ప్రత్యేక్షం చేస్తాడు, అని చెప్పారు. అన్న విషయం పై ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. మహ్‌దీకు సంబంధించిన రివాయతులు షియా మరియు సున్నీయులు తమ తమ సహ్హాహ్ మరియు మసానీద్ గ్రంథాలలో వ్రాశారు. ఆ హదీసుల నుంచి కొన్ని:  

1. దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించెను: ఒకవేళ ప్రపంచం అంతమవడానికి ఒక్క రోజు మిగిలి ఉన్నా సరే అల్లాహ్ ఆ రోజును ఎంత దీర్ఘమైనదిగా చేస్తాడంటే అందులో నా అహ్లెబైత్(అ.స) నుండి ఒక వ్యక్తి ప్రత్యేక్షమవ్వగలడు, అతడి పేరు నా పేరు మరియు అతడి తండ్రి పేరు నా తండ్రి పేరు అయ్యి ఉంటాయి. అతను అంతకు ముందు అన్యాయం మరియు దుర్మార్గంతో నిండి ఉన్న ప్రపంచాన్ని న్యాయధర్మాలతో నింపేస్తాడు.[1]

2. సుననె ఇబ్నె మాజా[2] లో ఇలా ఉంది: దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించెను: నా అహ్లెబైత్(అ.స)ల కోసం అల్లాహ్ ఇహలోకం కాకుండా పరలోకాన్ని వరించాడు. నా తరువాత నా అహ్లెబైత్(అ.స)లు కఠినమైన కష్టాలలో పడతారు. వాళ్ళను స్వస్థలం నుండి బహిష్కరిస్తారు. చివరికి తూర్పుదిక్కు నుండి ఒక సమూహం వెలుస్తుంది వాళ్ళ ధ్వజాలు నల్లవై ఉంటాయి. వాళ్ళు మంచినే కోరుతారు కాని వాళ్ళకు మంచిని ఇవ్వరు. అప్పుడు వాళ్ళు యుధ్ధం చేస్తారు మరియు వాళ్ళు అందులో విజయం పొందుతారు. అప్పుడు వాళ్ళ కోరికను పూర్తి చేయబడుతుంది. కాని వాళ్ళు అంగీకరించరు చివరికి వాళ్ళు అధికారాన్ని ఒక వ్యక్తికి అప్పగిస్తారు. అతడు నా అహ్లెబైత్(అ.స) నుండి అయ్యి ఉంటాడు. అతడు అంతకు ముందు అన్యాయం మరియు దుర్మార్గంతో నిండి ఉన్న ప్రపంచాన్ని న్యాయధర్మాలతో నింపేస్తాడు.

3. సుననె ఇబ్నె మాజా[3] లో ఇలా ఉంది: దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: మహ్‌దీ మా అహ్లెబైత్(అ.స)ల నుండి అయి ఉంటారు, మహ్‌దీ(అ.స) ఫాతెమా(స.అ) సంతానం నుండి అయి ఉంటారు. ఇలా కూడా అన్నారు: నా ఉమ్మత్‌లో ఒక మహ్‌దీ ఉంటాడు. ఒకవేళ అతడి అధికారం తక్కువగా అయ్యి ఉన్న ఏడు లేదా తొమ్మిది సంవత్సరములు కన్న తక్కువ ఉండదు. అతడి కారణంగా నా ఉమ్మత్‌కు ఇంతకు ముందు లభించనటువంటి ప్రతిఫలాలు లభిస్తాయి, అది కలకాలం ఉంటుంది, అందులో నుండి కొంచెం కూడా దాచుకోము, ధనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా నిలబడి ఓ మహ్‌దీ! నాకూ ఇవ్వండి!, అని అడిగితే వెంటనే అతను తీసుకో అంటారు.

4. తిర్మిజీ[4] లో ఇలా ఉంది: దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: నా అహ్లెబైత్(అ.స)ల నుండి ఒక వ్యక్తి అతని పేరు నా పేరు అయ్యి ఉంటుంది, అతను ఈ ప్రపంచం పై అధికారం చేస్తాడు. ఒకవేళ ప్రపంచం అంతం అవ్వడానికి ఒకరోజు మిగిలి ఉన్నా సరే అల్లాహ్ ఆ రోజు అతను అధికారం చేసేంత పొడుగు చేస్తాడు.

5. దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించెను: అరేబీయుల పై నా అహ్లెబైత్(అ.స) నుండి మరియు నా పేరు గల ఒక వ్యక్తి అధికారం చేయనంత వరకు ప్రపంచం అంతం కాలేదు.[5]

6. బుఖారీ[6]లో ఇలా ఉంది: (రావీయుల క్రమాన్ని మినహాయించి) అబూ హురైరహ్ ఇలా అన్నారు: దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: ఇబ్నె మర్యం మీ వద్దకు వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో మరియు మీ ఇమామ్ మీ నుండి అయ్యి ఉంటాడు.

7. “ఫత్హుల్ బారీ”లో “హాఫిజ్” ఎన్నో రివాయతులు ఉన్నాయి “మహ్‌దీ ఈ ఉమ్మత్‌కు చెందిన వారు అయ్యి ఉంటారు. మరియు హజ్రత్ ఈసా(అ.స) (నాలుగోవ ఆకాశం నుండి) దిగి వస్తారు. మరియు మహ్‌దీ వెనకాల నమాజ్ చదువుతారు” అని ఉల్లేఖించారు.[7]

8. “ఇబ్నె హజరె హైసమీ”, “సవాయిఖుల్ ముహ్రిఖహ్”లో ఇలా ఉల్లేఖించారు: మహ్‌దీ ప్రత్యేక్షమగు ప్రస్తావన ఉన్న రివాయతులు చాలా ఉన్నాయి మరియు అవన్నీ మతవాతిర్[8] హదీసులే.[9]

9. “గాయతుల్ మామూల్” యొక్క రచయిత ఇలా ప్రవచించెను: పూర్వ మరియు ఇప్పటి ఉలమాల మధ్య “చివరి కాలంలో అహ్లెబైత్(అ.స)ల నుండి ఒక మహ్‌దీ పేరు గల మనిషి ప్రత్యేక్షమవుతాడు” అని ప్రసిధ్ధి చెంది ఉంది. సహాబీయులలో చాలా మంచి సహాబీయుల ఒక సమూహం మహ్‌దీ గురించి రివాయత్‌ను చేశారు. మరియు ప్రముఖ ముహద్దిసీన్‌లు ఉదాహారణకు “అబూ దావూద్”, “తిర్మిజీ”, “ఇబ్నె మాజా”, “తబరాని”, “అబూ యొఅలా”, “బజ్జాజ్”, “అహ్మద్ ఇబ్నె హంబల్”, “హాకిం” మొ॥ వారు తమ పుస్తకాలలో ఉల్లేఖించారు అందువల్ల ఎవరైన మహ్‌దీకు సంబంధించిన హదీసులను జయీఫ్ అని చెబితే అతడు తప్పు చెబుతున్నాడు.

10. ఇప్పటి వాళ్ళలో “ఇఖ్వానుల్ ముస్లిమీన్” యొక్క పూర్వపు ముఫ్తీ తన పుస్తకం “అల్ అఖాయిదుల్ ఇమామియా”లో మహ్‌దీ యొక్క హదీసులను ఉల్లేఖించి “మహ్‌దీ పై విశ్వాసం కలిగి ఉండడం ఇస్లామీయ విశ్వాసాల నుండి మరియు దానిని నమ్మడం వాజిబ్” అని అన్నారు.

షియా ముస్లింలలో మహ్‌దీ గురించి ఎన్ని హదీసులు ఉన్నాయంటే ఇలా చెప్పడం జరిగింది “దైవప్రవక్త(స.అ) ద్వార ఎన్ని హదీసులు మహ్‌దీ అంశం పై ఉల్లేఖించబడ్డాయో వేరే ఏ అంశం పై ఉల్లేఖించబడలేదు”. పరిశోధకులైన “లుత్ఫుల్లాహ్ అల్ సాఫీ” తన పుస్తకం “ముంతఖబుల్ అసర్”లో అహ్లెసున్నత్ యొక్క 60 కన్న ఎక్కువ పుస్తకాల నుండి మహ్‌దీ యొక్క హదీసులను ప్రస్తావించారు. ఆ పుస్తకాలలో “సహ్హాహ్ సిత్తా” మరియు 90 కన్న ఎక్కువ షియా పుస్తకాల ఆధారంగా ఉల్లేఖించారు. షియా పుస్తకాలలో “కుతుబె అర్‌బఅ” కూడా ఉన్నాయి.

రిఫరెన్స్
1. సుననె అబూ దావూద్, భాగం2, పేజీ422.
2. సుననె ఇబ్నె మాజా, భాగం2, హదీస్ నెం4802 మరియు 4807.
3. సుననె ఇబ్నె మాజా, భాగం2, హదీస్ నెం4806.
4. తిర్మిజీ, భాగం9, పేజీ74 మరియు 75.
5. తిర్మిజీ, భాగం9, పేజీ74 మరియు 75.
6. సహీ బుఖారీ, భాగం4, పేజీ143 (باب نزول عیسیؑ).
7. చూడండి ఫత్హూల్ బారీ, భాగం5, పేజీ362.
8. హదీసు యొక్క రావీయుల క్రమంలో, వాళ్ళ సంఖ్య, వాళ్ళు చెప్పంది తప్పు అని నిరూపించే అవకాశం లేనంతగా ఆ రావీయులు ఆ హదీసును ఉల్లేఖించడం.
9. సవాయిఖుల్ ముహ్రిఖహ్, భాగం2, పేజీ211.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11