అదృశ్యం – ప్రత్యక్షం 1

మంగళ, 10/19/2021 - 17:20

హజ్రత్ మహ్‌దీ(అ.స) యొక్క పుట్టుక, వారి జీవితం, వారి అదృశ్యం, వారు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు అన్న అంశాల గురించి సంక్షిప్త వివరణ...

అదృశ్యం – ప్రత్యక్షం 1

హజ్రత్ మహ్‌దీ(అ.స) యొక్క పుట్టుక, వారి జీవితం, వారి అదృశ్యం, వారు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు అన్న అంశాల గురించి సంక్షిప్త వివరణ... ఇందులో కూడా అహ్లెసున్నతుల పెద్ద పెద్దలు రద్దు చేయలేనటువంటి ఉలమాలు దీనిని నిరాకరించలేదు.

హజ్రత్ “మహ్‌దీ(అ.స)” అనగా ముహమ్మద్ ఇబ్నె హసన్ అస్కరీ ఆయిమ్మయే అహ్లెబైత్(అ.స)లకు సంబంధించిన 12వ ఇమామ్ జన్మించేశారు. ఇప్పుడు కూడా వారు జీవించి ఉన్నారు. చివరి కాలంలో ప్రత్యక్షం అయ్యి అంతకు ముందు అన్యాయం మరియు దుర్మార్గంతో నిండి ఉన్న ప్రపంచాన్ని న్యాయధర్మాలతో నింపేస్తారు అని నమ్మే అహ్లెసున్నతుల ఉలమాలు మరియు అలా వాళ్ళు షియా ముస్లిములతో ఏకీభవిస్తారు మరి వాళ్ళ సంఖ్యా చాల ఎక్కువగా ఉంది. వాళ్ళ నుండి కొందరి ప్రస్తావన క్రింద చూడవచ్చు:
1. ముహియుద్దీన్ ఇబ్నె అల్ అరబీ – తన పుస్తకం ఫుతూహాతె మక్కీయ్యాహ్‌లో
2. ఇబ్తె ఇబ్నె అల జౌజీ - తన పుస్తకం తజ్కిరతుల్ ఖవ్వాస్‌లో
3. అబ్దుల్ వహ్హాబ్ షఅరానీ - తన పుస్తకం అఖాయిదుల్ అకాబిర్‌లో
4. ఇబ్నె అల్ ఖుష్షాబ్ - తన పుస్తకం తవారీఖుల్ మవాలీదిల్ అయిమ్మాహ్ వ వఫాతిహింలో
5. ముహమ్మద్ అల్ బుఖారీ అల్ హనఫీ - తన పుస్తకం ఫస్లుల్ ఖితాబ్‌లో
6. అహ్మద్ ఇబ్నె అల్ బిలా జరీ - తన పుస్తకం అల్ హదీసుల్ ముతసల్సల్‌లో
7. ఇబ్నె సబ్బాగె మాలికీ - తన పుస్తకం అల్ ఫుసూలుల్ ముహిమ్మహ్‌లో
8. అల్ ఆరిఫ్ అబ్దుల్ రహ్మాన్ - తన పుస్తకం మిరాతుల్ అస్రార్‌లో
9. కమాలుద్దీన్ ఇబ్నె తలహా – తన పుస్తకం మతాలిబుస్సువాల్ ఫి మనాఖిర్రసూల్‌లో
10. అల్ ఖందూజీ అల్ హనఫీ - తన పుస్తకం యనాబీవుల్ మవద్దహ్‌లో

ఇంతే కాకుండా చాలా మంది దీనిని అంగీకరించారు. ఒకవేళ ఎవరైనా పరిశోధన చేసినట్లైతే అహ్లె సున్నత్‌ల ఉలమాల సంఖ్య మేము చెప్పిన వాళ్ళ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్ళు మహ్‌దీ జన్మించారు మరియు ఇప్పటికీ ప్రాణాలతోనే జీవించి ఉన్నారు అని నమ్ముతారు.

ఇక ఇప్పుడు కేవలం మహ్‌దీ పుట్టుక మరియు అతను ఇప్పటి వరకు జీవించే ఉన్నారు అన్న అంశాలను నిరాకరిస్తున్న సున్నీ ఉలమాలతో మా అభిప్రాయభేదం మిగిలి ఉంది. నిజానికి ఈ నిరాకరించు వాళ్ళు కూడా మహ్‌దీకు సంబంధించిన హదీసులు సరైనవి, అని నమ్ముతారు. మరియు ఈ నిరాకరించు వారు మహ్‌దీ యొక్క అస్తిత్వాన్ని నమ్మే వాళ్ళతో కేవలం స్వమతపక్షపాతం మరియు శత్రుత్వం వల్ల అభిప్రాయభేదం ఉంది లేకపోతే వాళ్ళ వద్ద ఈ నిరాకరణ పై ఎటువంటి సాక్ష్యం లేదు.   

ఖుర్ఆన్ కూడా ఈ విశ్వాసాన్ని నిరాకరించదు. అల్లాహ్ లెక్కలేనివన్ని ఉదాహారణాలను అవివేకులు, మందబుద్ధి  గల వారి కోసం ప్రవచించాడు. వాళ్ళ ఆ దృఢత్వం విరగాలని మరియు వాళ్ళు తమ అలోచన సంకెళ నుండి బయటకు రావాలనీ దానితో వాళ్ళకు అల్లాహ్ తన ప్రవక్తల ద్వార ఎన్నో అద్భుతాలను చేయించాడు, అని తెలుస్తుంది. శత్రువులు కేవలం తమ బుద్ధిని ఆధారంగా చేసి కేవలం సాధ్యమైన విషయాల వరకు పరిమితం కాకూడదని దానికి వ్యతిరేక విషయాలను కూడా అంగీకరించాలని ఈ అద్భుతాలను చేయించాడు.

ఏ ముస్లిము హృదయం ఈమాన్‌తో నిండి ఉందో అతడు ఎన్నడూ “అల్లాహ్ హజ్రత్ “ఉజైర్”ను వంద సంవత్సరాలు మృతంగా ఉంచిన తరువాత ఎలా ప్రాణం పోశాడు”[1] అన్న దానిని వింత అని భావించడు. మరి అది కూడా అతడి ఆహారం పాడవ్వకుండా, నీరు చెడకుండా మరియు అతడి గాడిదకి అతని ముందే ప్రాణం పోశాడు. వీటన్నీంటిని చూసి జనాబె ఉజైర్ ఇలా అన్నారు: నాకు తెలుసు అల్లాహ్ ప్రతీ విషయంలో సర్వ శక్తిమంతుడు అని.

సుబ్హానల్లాహ్! ఎంత తొందరగా మార్పు కలిగించాడో, ఎందుకంటే ఈ ఉజైరే ఒక గ్రామం వైపు నుండి వెళ్తుండగా అతనికి అల్లాహ్ ఈ మరణించిన వారిని మరలా ఎలా లేపుతాడు? అని ఆశ్చర్యం కలిగింది.

అలాగే ఏ ముస్లిముకు ఖుర్ఆన్ పై విశ్వాసం ఉందో అతడికి జనాబె ఇబ్రాహీమ్(అ.స) పక్షులను జపా చేసి వాటి ముక్కలను పర్వతాల పై ఉంచి ఆ తరువాత ఒక్కొక్క పక్షి ముక్కును తన చేతిలో పట్టుకొని పిలిస్తే వాటి ముక్కలన్నీ వచ్చి కలిసి పక్షిగా మారాయి,[2] అన్న విషయం పై ఆశ్చర్యం కలగదు.

మరియు అలాగే నిజమైన ముస్లిముకు హజ్రత్ ఇబ్రాహీమ్(అ.స) కోసం అగ్ని, పూలపాన్పుగా మారింది, అది కేవలం يا نارُ كُونِى بَرْداً وَ سَلاماً عَلى إِبْراهِيمَ అను ఆదేశంపై ఇబ్రాహీమ్‌(అ.స)ను కాల్చలేదు, మరియు ఎటువంటి హాని కలిగించలేదు[3] అన్న విషయం పై కూడా ఆశ్చర్యం కలగదు.  

నిజమైన ముస్లిముకు హజ్రత్ ఈసా(అ.స) తండ్రి లేకుండా జన్మించారు. అతడు ఇంకా బ్రతికే ఉన్నారు మరియు మరలా ఈ ప్రపంచానికి వస్తారు, అన్న విషయాల పై ఆశ్చర్యం కలగదు. మరియు అలాగే హజ్రత్ ఈసా(అ.స) మరణించిన వాళ్ళను బ్రతికించేవారు, అంధులను, కుష్టురోగులను బాగు చేసే వారు[4] అన్న విషయం పై కూడా ఆశ్చర్య కలగదు.

మరియు అలాగే అల్లాహ్ హజ్రత్ మూసా(అ.స) మరియు బనీ ఇస్రాయీల్ కోసం సముద్రాన్ని చీల్చాడు. బనీ ఇస్రాయీల్ సముద్రమును దాటారు కాని వాళ్ళ కాళ్ళు నీటితో తడవలేదు,[5] అన్న విషయాల పై ఆశ్చర్యం కలగదు. అలాగే మూసా(అ.స) యొక్క కర్ర పెద్ద పాముగా మారింది[6] అని మరియు నైలు సముద్రం యొక్క నీళ్ళు రక్తంగా మారాయి,[7] అన్న విషయాల పై కూడా ఆశ్చర్యం కలగదు.

అలాగే అల్లాహ్ హజ్రత్ సులైమాన్(అ.స) పక్షులతో, జిన్నులతో, చీమలతో మాట్లాడేవారు. అతని సింహాసనం గాలిలో ఎగిరేది మరియు “బిల్ఖీస్” సింహాసనాన్ని సెకండులలో రప్పించారు, అన్న విషయాల పై ఆశ్చర్యం కలగదు.

అల్లాహ్ పై ఈమాన్ ఉన్న వాడు అస్హాబె కహఫ్ మూడు వందల తొమ్మిది సంవత్సరాలు మృతులుగా ఉన్న తరువాత బ్రతకడం మరియు అప్పటికి మనవడి మనవడు వయసులో తన తాత కన్న ముసలి వాడు అవ్వడం పై ఆశ్చర్య పడడు.

అతడికి హజ్రత్ ఖిజ్ర్ ఇప్పటికి బ్రతికే ఉన్నారు. అతనికి మరణం సంభవించలేదు, ఖిజ్ర్ జనాబె మూసా(అ.స)తో కూడా కలిశారు, అన్న విషయాల పై ఆశ్చర్యం కలగదు. అంతేకాదు అతడికి ఇబ్లీస్ మల్ఉన్ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు యదార్ధంగా చూసినట్లైతే అతడు హజ్రత్ ఆదమ్ కన్న ముందు జన్మించాడు మరియు అతడు మనిషి సృష్టించబడినప్పటి నుండి ఇప్పటి వరకు అతడి వెంటబడే ఉన్నాడు. ఇప్పటి వరకు కనబడకుండానే ఉన్నాడు అతడికి ఇప్పటి వరకు ఎవ్వరు చూడలేదు మరియు తరువాత చూసే అవకాశం కూడా లేదు. అతడు చేసే పనులన్నీ చాలా నీఛమైనవి, అతడు అందరిని చూడగలడు. అంతేకాదు అతడి వంశంలో అందరు కూడా చూడగలరు. కాని ప్రజలు అతడిని గాని అతడి వంశాన్ని గాని చూడలేరు, అన్న విషయాల పై ఆశ్చర్యం కలగదు.

అంటే ఈ విషయాలన్నీటిని నమ్మే ముస్లిము వీటిని వింతగా భావించడు. ఎందుకంటే అల్లాహ్ ప్రతీ దాని పై సామర్ద్యం గలవాడు. అయితే అల్లాహ్ మహ్‌దీ యొక్క అస్తిత్వాన్ని మరియు అతనిని కనబడకుండా –కేవలం కొంత కాలం వరకు– ఉంచడాన్ని వింత అని ఎలా అనుకో గలడు? అదీ కాకుండా ఈ అదృశ్యంలో అల్లాహ్ యొక్క ఔచిత్యం కూడా ఉంది.

ఇవన్నీ ప్రకృతికి విరుద్ధంగా చేయబడిన అద్భుతాలు. వీటిని ప్రజలు చేయలేరు వాళ్ళకు ఆ శక్తి లేదు. ఒకవేళ అందరు కలిసికట్టుగా చేయాలనుకున్నా చేయలేరు. ఇవన్నీ అల్లాహ్ యొక్క శక్తికి నిదర్శనం. భూమీ మరియు ఆకాశంలో ఉన్న ఏదీ అల్లాహ్‌ను నిస్సహాయుడు చేయలేదు. ముస్లిములు వీటంన్నీటిని అంగీకరిస్తారు ఎందుకంటే వాళ్ళు ఖుర్ఆన్‌లో ఉన్న ప్రతీ దానిని నమ్ముతారు. అందులో ఎటువంటి సందేహం లేదు అని విశ్వాసం కలిగి ఉన్నారు.[8]

రిఫరెన్స్
1. సూరయె తౌబహ్, ఆయత్30 మరియు హదీసులు.
2. సూరయె బఖరహ్, ఆయత్ 260 మరియు హదీసులు.
3. సూరయె అంబియా, ఆయత్ 69 మరియు హదీసులు.
4. సూరయె ఆలిఇమ్రాన్, సూరయె మర్యమ్ మరియు ఎన్నో హదీసులు దీనికి నిదర్శనం.
5. సూరయె యూనుస్, ఆయత్ 83,84 మరియు హదీసులు.
6. సూరయె తాహా, ఆయత్19,20, మరియు హదీసులు.
7. సూరయె ఆరాఫ్, ఆయత్133, మరియు హదీసులు.
8. హంరాహ్ బా రాస్తగోయాన్, తీజానీ సమావీ, పేజీ410.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13