అదృశ్యం – ప్రత్యక్షం 2

బుధ, 10/20/2021 - 14:34

ఇమామ్ హజ్రత్ మహ్‌దీ హిజ్రీ 3వ శతాబ్ధంలో జన్మించారు మరియు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు అన్న విషయం పై నిదర్శనంతో పాటు ఇరువర్గాల వారు కేవలం వారి జన్మం విషయంలో అభిప్రాయబేధం కలిగివున్నారు అంతే గాని ఇమామ్ మహ్దీ(అ.స) వస్తారు అన్న విషయం లో వారి మధ్య అభిప్రాయబేధం లేదు అన్న విషయం పై సంక్షిప్త వివరణ... 

అదృశ్యం – ప్రత్యక్షం 2

ఇంతకు ముందు చెప్పబడిన[1] విషయాలే కాకుండా మరో విషయం ఉంది అదేమిటంటే షియా ముస్లిములకు ఇమామ్ మహ్‌దీ(అ.స) గురించి చాలా తెలుసు. అందుకు కారణం అతను వాళ్ళ ఇమామ్ కాబట్టి. షియా ముస్లిములు వారితో మరియు వారి పూర్వీకులతో కలిసి జీవించారు. అందుకని వాళ్ళకు ఎక్కువగా తెలుసు.

షియా ముస్లిములు తమ ఇమాములను చాలా గౌరవిస్తారు. అందుకనే మీరు చూసే ఉంటారు వాళ్ళు తమ ఆయిమ్మాల సమాధులను ఎంత గొప్పగా అలంకరిస్తారో మరియు వాళ్ళ సమాధుల దర్శనాన్ని తప్పకుండా చేయాలనీ, మరి అది వాళ్ళ కోసం శుభం అనీ, భావిస్తారు. ఒకవేళ వాళ్ళ 12వ ఇమామ్ హజ్రత్ ఇమామ్ మహ్‌దీ చనిపోయి ఉంటే వారి సమాధి కూడా ఉండేది, మరి అది కూడా ప్రసిధ్ది చెంది ఉండేది. షియాలు అల్లాహ్ అతనిని చనిపోయిన తరువాత మరలా అవతరింపజేస్తాడు, అని అనేవారు. ఎందుకంటే ఖుర్ఆన్‌లో ప్రస్తావించబడ్డ సంఘటనలు సాధ్యం అయినప్పుడు ఇది ఎందుకు సాధ్యం కాదు. ముఖ్యంగా వీళ్ళు “రజ్అత్”ను కూడా నమ్ముతారు, అలాంటప్పుడు దీనిని కూడా నమ్మే వారేమో.

కాని షియా ముస్లిములలో ఇమామ్ మహ్‌దీ(అ.స) పట్ల విరోధుల వలే ఎటువంటి అభిప్రాయభేదం గాని లేదా ఈ విశ్వాసంలో బలహీన పడడంగాని లేదా అనవసరమైన అనుమానాలు గాని లేవు. అంతే కాదు వాళ్ళకు గట్టి నమ్మకం ఉంది. అందుకే ఇమామ్ బ్రతికే ఉన్నారు కాని అల్లాహ్ ఔచిత్యము వల్ల ప్రజల కళ్ళకు కనబడడం లేదు. మరియు ఆ ఔచిత్యం పరిపక్వ జ్ఞానంగల వారికి మరియు ఔలియాలకు కూడా తెలుసు అని గట్టిగా చెబుతారు. వీళ్ళు తమ నమాజులలో క్రమంగా ఇమామ్ మహ్‌దీ(అ.స) త్వరగా ప్రత్యక్షమవ్వాలి, అని దుఆ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అతని ప్రత్యక్షంతో ముస్లిములకు గౌరవం మరియు సౌభాగ్యం లభిస్తుంది. ఇలా అల్లాహ్, అవిశ్వాసులకు ఎంతఅయిష్టం ఐనా సరే తన కాంతిని సంపూర్ణం చేస్తాడు.

షియా మరియు సున్నీయుల మధ్య ఇమామ్ మహ్‌దీ(అ.స) గురించి ఉన్న అభిప్రాయభేదం అంత ముఖ్యమైనదేమి కాదు, వాళ్ళు కూడా చివరి కాలంలో ప్రత్యేక్షమవుతారనీ, అతని వెనక హజ్రత్ ఈసా(అ.స) నమాజ్ చదువుతారనీ, అంతకు ముందు అన్యాయం మరియు దుర్మార్గంతో నిండి ఉన్న ప్రపంచాన్ని న్యాయధర్మాలతో నింపేస్తారనీ, అతని కాలంలో ముస్లిములు పూర్తి ప్రపంచానికి అధికారులై ఉంటారనీ, మరియు ఐశ్వర్యాలతో నిండి ఉంటారు భూమి పై పేద అనే వాడే ఉండడు, అని నమ్ముతారు.

కేవలం వాళ్ళలో ఉన్న అభిప్రాయభేదం ఏమిటంటే షియా ముస్లిములు అతను జన్మించేశారు అని నమ్ముతారు, మరియు సున్నీయులు జన్మిస్తారు అని నమ్ముతారు. చివరి కాలంలో ప్రత్యక్షమవుతారు, అన్న విషయాన్ని ఎవరు కూడా నిరాకరించరు, అందరు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. అయితే ముస్లిములందరు (కలెమయే హఖ్ పై) ఏకమవ్వాలి మరియు చెదిరి ఉన్న ఉమ్మత్‌ను ఒక్కటిగా చేయాలి, గాయాల పై లేపనము పూయాలి, ఒకరునొకరు చంపుకోకూడదు, మరియు అందరు కలిసి మనస్ఫూర్తిగా మహ్‌దీ త్వరగా ప్రత్యక్షం కావాలి అని దుఆ చేయాలి మరియు ప్రతీ నమాజు తరువాత దుఆ చేయాలి, ఎందుకంటే అతని ప్రత్యక్షం తరువాత ఇస్లాం మరియు ముస్లిములకు గౌరవం మరియు ఘనత లభిస్తుంది. ముహమ్మద్(స.అ) యొక్క ఉమ్మత్‌కు మాత్రమే కాదు పూర్తి మానవత్వానికి సౌభాగ్యం లభిస్తుంది. ఈ ధరిత్రి న్యాయధర్మాలతో నిండిపోతుంది.

మరి ముస్లిములందరు మహ్‌దీ రాకను నమ్ముతున్నప్పుడు అది, “జన్మించి ఆ తరువాత ప్రత్యక్షమవుతారు అన్న  విశ్వాసం కానివ్వండి లేదా జన్మించేశారు మరియు అదృశ్యం తరువాత ప్రత్యక్షమవుతారు అన్న విశ్వాసం కానివ్వండి” అంటే మహ్‌దీ ప్రత్యక్షమయ్యే విశ్వాసం ఒక వ్యర్ధ విశ్వాసం గాని లేదా కట్టుకథనం లాంటిది గాని కాదు. కాని కొందరు అవివేకులు దీనినే నమ్మించాలని అనుకుంటున్నారు.

వాస్తవానికి మహ్‌దీ ఒక వ్యక్తిత్వానికి గల పేరు, అతని ప్రత్యక్షమయ్యే శుభవార్తను స్వయంగా దైవప్రవక్తే(స.అ) ఇచ్చారు. మరియు పూర్తి ఇస్లామీయ ప్రపంచమే కాకుండా యూదులు మరియు క్రైస్తవులు కూడా ఒక “విముక్తినిచ్చేవాడు” పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు. అతడు లోకాన్ని సరిదిద్దుతాడు మరియు పూర్తి ప్రపంచం చాలా ఓర్పు, సహనం మరియు శాంతితో అతని ప్రత్యక్షం కొరకు వేచి ఉన్నారు. అందుకనే మన దైవప్రవక్త(స.అ) అతని పేరు “అల్ మహ్‌దీ అల్ ముంతజర్” అని పెట్టారు.[2]

ఓ అల్లాహ్ ముస్లిములను మంచి మరియు ధర్మనిష్ఠ పై ఏకం చేయి, వాళ్ళలో ఐక్యతను ప్రసాదించు, వాళ్ళ మనసులను ప్రేమతో నింపేయి, వాళ్ళ నుండి విద్రోహాన్ని దూరం చేయి, వాళ్ళను వాళ్ళ శత్రువుల పై ఆధిక్యం ప్రసాదించు.

రిఫరెన్స్
1. https://te.btid.org/node/2007
2. హంరాహ్ బా రాస్తగోయాన్, తీజానీ సమావీ, పేజీ410.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 36