ముస్లిముల ఐక్యమత్యం

గురు, 10/21/2021 - 05:06

అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తలు మరియు అహ్లెబైత్ లు ముస్లిములందరినీ ఐక్యత వైపుకు ఆహ్వానిస్తున్నారు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

ముస్లిముల ఐక్యమత్యం

మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు. అల్లాహ్ ప్రవక్తలను శుభవార్తనిచ్చే వారుగా, భయపెట్టే వారుగా చేసి పంపాడు. ప్రజల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై తీర్పు చేయటానికిగాను వారి వెంట (అనగా ప్రవక్తల వెంట) సత్యబద్ధమైన గ్రంథాలను పంపాడు. మరి వాళ్ళే (అనగా ప్రజలే) – స్పష్టమైన ఆదేశాలు వొసగబడిన తరువాత కూడా – పరస్పర వైరభావం, అసూయ మూలంగా అందులో విభేదించుకున్నారు. అందుచేత అల్లాహ్ విశ్వాసులకు ఈ భేదాభిప్రాయం నుండి కూడా తన ఆజ్ఞానుసారం సత్యం వైపుకు దర్శకత్వం వహించాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు.[సూరయె బఖరహ్, ఆయత్213]

అల్లాహ్ మనిషి విముక్తి మరియు సంపూర్ణత కోసం ఉత్తమ మరియు సమగ్రమైన ప్రణాళికను ప్రసాదించాడు. ఆ దైవప్రణాళిక పేరే ఇస్లాం. అందుకోసమని అల్లాహ్ ప్రవక్తలను మరియు ఆకాశగ్రంథాలను అవతరింపజేశాడు. మానవ జీవనం కోసం పద్దతులను మరియు చట్టాలను నిర్ధారించాడు, కష్టాలకు గురి కారణాలను సూచించి వాటిని ఎదురుకునేందుకు కొన్ని మార్గాలు బోధించాడు.

మనిషి ఉత్తమత్వం మరియు సంపూర్ణత్వాన్ని చేర్చే వాటిలో అతి ముఖ్యమైనది “ఐక్యమత్యం” అని వ్యతిరేకత మరియు చీలిపోవడం నాశనానికి కారణమని అల్లాహ్ ఖుర్ఆన్ లో సూచించెను.

“అల్లాహ్ త్రాడును అందరు కలిసి గట్టిగా పట్టుకొండి, చీలిపోకండి అల్లాహ్ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి-అప్పుడు మీరు ఒండొకరికి శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను సృజించాడు. దాంతో ఆయన అనుగ్రహం వల్ల మీరు ఒకరికొకరు అన్నదమ్ములుగా మారారు. మీరు అగ్నిగుండం ఆఖరి అంచులకు చేరుకోగా, ఆయన మిమ్మల్ని దాన్నుంచి కాపాడాడు. మీరు సన్మార్గం పొందాలని ఈ విధంగా అల్లాహ్ మీకు తన సూచనలను విశదపరుస్తున్నాడు”.[ఆలె ఇమ్రాన్, ఆయత్103].

అదే విధంగా ముస్లిములకు ఐక్యమత్యం వైపుకు ఆహ్వానిస్తూ ఒక ఉమ్మత్ అవ్వడానికి ఆదేశిస్తుంది.
“మేలు వైపుకు పిలిచే, మంచిని చెయ్యమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యాన్ని పొందుతారు”.[ఆలి ఇమ్రాన్, ఆయత్104]

దైవప్రవక్త(స.అ) ముస్లిముల మధ్య ఐక్యమత్యం అవసరం మరియు విధిగా నిర్థారించారు. ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది:
“విశ్వాసులు(ముస్లింలు) అన్నదమ్ములు (అన్న సంగతిని మరవకండి). కనుక మీ అన్నదమ్ముల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి – తద్వారా మీకు కరుణించబడవచ్చు.[సూరయె హుజురాత్, ఆయత్10]
దైవప్రవక్త(స.అ) విశ్వాసుల మధ్య ఈ సంబంధాన్ని ఏర్పర్చారు.

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “విశ్వాసులు పరస్పరం ప్రేమ మరియు ఆప్యాయత విషయంలో ఒకే శరీరం మాధిరి; శరీరం యొక్క ఒక భాగం గాయమైతే పూర్తి శరీరం ఆందోళన చెందినట్లు”[1]

హజ్రత్ అలీ(అ.స) ముస్లిముల మధ్య ఐక్యత కోసం మరువలేని త్యాగాలు చేశారు. వాటిలో ముఖ్యమైనవి ముస్లిముల ఐక్యత కోసం సహనంగా ఉండడం మరియు వారి పట్ల జరిగిన అన్యాయం పట్ల మౌనంగా ఉండడం.

ఖేదించదగ్గ విషయమేమిటంటే ఈనాడు ముస్లిం ఉమ్మత్ అల్లాహ్, ఖుర్ఆన్, దైవప్రవక్త(స.అ), ఇమామ్ మరియు ఔలియాల బోధనలను వెనక పడవేశారు. ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది: “..... ఒక వర్గంవారు, దైవగ్రంథాన్ని, అసలు దాని గురించి ఏమీ తెలియనివారుగా వెనక పడవేశారు”.[సూరయె బఖరహ్, ఆయత్101]

ఈనాడు ముస్లింలు వ్యతిరేకత మరియు వైరుధ్య నిప్పులో మండుతున్నాడు. ప్రేమా, కరుణకు మరియు దీన్ పట్ల విధేయతకు బదులు ఒకరు మరొకరి రక్తాన్ని కళ్ల చూడాలనుకుంటున్నారు. ఎవరినైతే ఖుర్ఆన్ పరస్పరం సోదరుడు అని ఉపదేశించిందో వారు వారు శత్రువులు అయి కూర్చున్నారు. ఖుర్ఆన్ ఇలా ఉపదేశించెను: “మీరందరూ అల్లాహ్ కూ, ఆయన ప్రవక్తకూ విధేయులై ఉండండి. పరస్పరం గొడవ పడకండి. అలా చేస్తే (గొడవపడ్డారంటే) మీరు పిరికివారే పోతారు. మీ శక్తి సన్నగిల్లిపోతుంది. అందుకే సహన స్థయిర్యాలను పాటించండి. స్థయిర్యం కనబరచేవారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు.”[సూరయె అన్‌ఫాల్, ఆయత్46]

ఈనాడు ముస్లిం దేశాలలో అది పాలస్తీనా కానివ్వండి లేదా అఫ్గానిస్తాన్ కానివ్వండి, లేదా ప్రపంచంలో ఎక్కడైనా కానివ్వండి వారిపై పడే కష్టాలు మరియు జరిగే అన్యాయం ముస్లింల మధ్య ఉన్న వ్యతిరేకత మరియు చీలిక యొక్క ఫలితం.
ఇస్లాం శత్రువులు నిత్యం ముస్లిముల ఈ బలహీనతను తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు.
ఇప్పటికైనా కళ్లు తెరుద్దాం. ఐక్యమత్యంగా ఉండి అల్లాహ్ సహాయాన్ని ఆహ్వానిద్దాం. ప్రపంచాన్ని సంపూర్ణత్వానికి మార్గాన్ని చూపిద్దాం.

రిఫరెన్స్
1. మీజానుల్ హిక్మహ్, రయ్ షహ్రీ, భాగం9, పేజీ45.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17