ఇస్లాం ఉమ్మత్ కు ఐక్యమత్య ఆహ్వానం

శని, 10/23/2021 - 14:36

ఇస్లాం ఉమ్మత్ కు ఐక్యమత్యంగా ఉండమని కేవలం ఖుర్ఆన్ మరియు ప్రవక్తలే కాకుండా పలు ప్రముఖ ఉలమాలు కూడా ఆహ్వానించారు. ఐక్యత యొక్క లాభాలు మరియు వైరుధ్యం యొక్క నష్టాలను వివరించారు.

ఇస్లాం ఉమ్మత్ కు ఐక్యమత్య ఆహ్వానం

చరిత్రలో దైవప్రవక్తల విధేయులు మరియు ఉత్తములు గతించారు. వీళ్లు ఇస్లాం యొక్క బోధనలను సరిగా అర్థం చేసుకున్నారు. తన కాలం యొక్క అవసరాలను బట్టి ఇస్లాం ఉమ్మత్ ను జాగ్రుతి మరియు ఐక్యమత్యంగా ఉంచడానికి చాలా ప్రయత్నించారు. ముఖ్యంగా సయ్యద్ జమాలుద్దీన్ అఫ్గానీ, షేఖ్ మొహమ్మద్ అబ్దుహ్, షేఖ్ మహ్మూద్ షల్తూత్, అల్లామా షరఫుద్దీన్ ఆములీ, ఇమామ్ మూసా సద్ర్, అల్లామా ఇఖ్బాల్, షహీద్ ఆరిఫ్ హుసైన్ అల్ హుసైనీ మొదలగు వారు, అందరి కంటే ముఖ్యమైనవారు ఆయతుల్లాహ్ ఖుమైనీ(ర.అ), అల్లాహ్ వీరికి అంతర్ దృష్టిని ప్రసాదించాడు, వారు ఇస్లాం యొక్క నిజమైన ముఖాన్ని ప్రదర్శించారు. ముస్లిములకు ముందు ముందు వచ్చే నష్టాలు మరియు ఆపదల గురించి తెలియ పరిచారు. ముస్లిముల మధ్య చీలికను మరియు వ్యతిరేకత యొక్క నష్టాలను చూసి "ముస్లిములందరూ ఐక్యమత్యంగా ఉండాలి" అని ముస్లిములందరిని ఆహ్వానించారు.

ఆయతుల్లాహ్ ఖుమైనీ(ర.అ) ఇలా అన్నారు: "ముస్లిములు మిగిలివుండాలంటే కేవలం ముస్లిముల ఐక్యత వలనే సాధ్యం" షియా మరియు సున్నీయుల మధ్య వ్యతిరేకతను ప్రేరేపించేవారి గురించి ఇలా అన్నారు: "వీళ్లు షియా వర్గానికి గాని లేదా సున్నీ వర్గానికి గాని చెందినవారు కాదు వీళ్లు అయితే అమాయకులైనా అయి ఉండాలి లేదా శత్రువుల మనుషులై ఉండాలి"
ఈనాడు షియా సుప్రీమ్ లీడర్ అయిన ఆయతుల్లాహ్ ఖామెనయీ(హ) ఐక్యమత్య జండాని ఎగరవేసి ముస్లిములందరినీ ఐక్యత పిలుపునిచ్చారు. దీన్ మరియు వివేకాలను బట్టి చూస్తే ముస్లిములందరూ ఐక్యమత్యంగా ఉండడమే సరైన నిర్ణయం. కొంతమంది మతపక్షపాత ఉన్మాదులు తమను మత మరియు వర్గ నాయకుల దుస్తుల ధరించి శత్రువుల కోసం పని చేసి ముస్లిముల నాశనానికి కారణమౌతున్నారు.

ఓ విశ్వాసి!
ఖుర్ఆన్ నిన్ను ఐక్యత వైపుకు ఆహ్వానిస్తుంది.
దైవప్రవక్త(స.అ) నిన్ను ఐక్యత వైపుకు పిలుస్తున్నారు.
ఆలె రసూల్(స.అ) నిన్ను ఐక్యత వైపుకు దావత్ ఇస్తున్నారు.
అస్హాబె రసూల్(స.అ) నిన్ను ఐక్యత వైపుకు రమ్మంటున్నారు.
జ్ఞానవివేకాలు నిన్ను ఐక్యత వైపుకు రమ్మని ఆహ్మానిస్తుంది.

ఐక్యత లేకపోతే సంభవించే నష్టాలు:
1. ముస్లిములలో బలహీనత మరియు అల్పతనం పెరుగుతుంది
2. అవమానం మరియు సిగ్గుచేటు
3. అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రాధాన్యత లేకపోవడం
4. వెనకబడి పోవడం
5. పాశ్చాత్య బానిసత్వం
6. సంపద మూలాలు ఉన్నప్పటికీ ఇతరుల పై ఆధారపడడం
7. పేదరికం మరియు దరిద్రం
8. విజ్ఞానం మరియు టెక్నాలజీ నుంచి దూరం
9. రాజకీయ పరంగా అధికారం లేకపోవడం
10. ఆదాయం మరియు సామాజిక సంక్షోభం
11. సాంస్కృతి ఓటమి
12. నూన్యత మరియు అవమాన భావానికి గురి కావడం
13. ఇస్లాం కాని ఇతర వ్యవస్థ
14. తోలుబొమ్మల ప్రభుత్వం
15. ఇస్లాంకు చెడ్డపేరు
16. ప్రపంచ స్థాయిలో ముస్లిముల పట్ల ద్వేషం
17. ఇతరుకు ముస్లిముల పట్ల విసుగు
18. కొత్త తరానికి ఇస్లాం పట్ల ఆందోళన
19. ఇస్లామీయ ప్రదేశాలలో శత్రువుల కబ్జా
20. ఇస్లామీయ ఆస్తుల దోపిడి
21. ఇస్లామీయ దేశాలలో అశాంతి మరియు సంక్షోభం
22. ఇస్లామీయ పుణ్యక్షేత్రాల మరియు ఉపదేశాల పట్ల అగౌరవ చర్యలు
23. ముస్లిముల చేతుల్లో ముస్లిముల చావు
24. లౌకికవాదం మరియు నాస్తికత్వం పెరగడం
25. అవినీతి మరియు వ్యభిచార ప్రోత్సాహం

ఐక్యత అనగా;
ఐక్యత అనగా ఇస్లామీయ వివిధ వర్గం వారి వార్వారి వర్గ నమ్మకాలను విడిచి వేరే వర్గాన్ని అనుసరించడం కాదు.
ఐక్యత అనగా ముస్లిముల మధ్య ఉన్న ఒకేరకమైన విశ్వాసాలను కలిపి ఒక కొత్త వర్గాన్ని సృష్టించి దాన్ని అనుచరించడం కాదు.
ఐక్యత అనగా ఇస్లామీయ వర్గాలన్నీంటి ఖండించి వర్గాలు లేని ఇస్లాంను ప్రోత్సహించడం అని కాదు.
ఐక్యత అనగా ఇప్పుడు ఉన్న వర్గాలలో ఒక వర్గం పై అందరూ ఏకమవ్వాలని కూడా కాదు.
ఐక్యత అనగా తమ తమ వర్గపు మూల అంశాలను వదిలి ఇతర వర్గాలకు దగ్గర అవ్వడం అని ఏమాత్రం కాదు.
ఐక్యత అనగా ఒక వ్యక్తి, ఒక పార్టీ లేదా ఒక దళం ఛత్రచాయలలో సంగ్రహించాలి అని కూడా కాదు.
ఐక్యత అనగా మన విశ్వాసాలను వేరే వారి పై బలవంతంగా రుద్ది వారిని బలవంతంగా మన వర్గం అనుచరులుగా మార్చడం కూడా కాదు.

ఐక్యతకు నిజమైన అర్ధం;
ఐక్యత అనగా ముస్లిములందరూ వారు ఏ వర్గాన్ని అనుచరించేవారు అయినా సరే వారు తమ అభిప్రాయభేదాలు లేని మరియు పరస్పర ఆసక్తి గల అంశాలలో ఐక్యమత్యంగా ఉండి; అభిప్రాయభేదాలు ఉన్న అంశాలను తమ ప్రత్యేక సర్కిల్ వరకు చర్చించుకోవడం అని అర్థం.
ఐక్యత అనగా ఒక వర్గం మరోవర్గం యొక్క ప్రత్యేక మరియు ముఖ్య అంశాలను గౌరవించాలి. తమ ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా ఏకమై తమ ఉమ్మడి విశ్వాల మరియు నమ్మకాల తరపు నుంచి ఏదురుకోవాలి, ఒకరినొకరు బాధపెట్టకూడదు, ప్రేమగా కలిసిమెలసి ఉండాలి, ప్రేమ లేకపోతే ప్రేమని పెంచాలి, ఒకరినొకరు గౌరవించాలి. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18