ఇస్లామీయ ఐక్యత యొక్క ప్రధాన అక్షం

ఆది, 10/24/2021 - 16:44

ఇస్లామీయ ఐక్యత యొక్క ప్రధాన అక్షం, ముస్లిముల ఐక్యత కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఈ ఐక్యత కు అడ్డంకులు ఉన్నాయా? ఉంటే ఆ అడ్ఢంకులు ఏమిటి అన్న అంశాల పై సంక్షిప్త వివరణ...

ఇస్లామీయ ఐక్యత యొక్క ప్రధాన అక్షం

ఇస్లామీయ వర్గాలు మరియు తెగలు మరియు వాటి అనుచరులను ఏకం చేసే ఉమ్మడి అంశాలు, వారిని విడగొట్టే లేదా అభిప్రాయభేదం ఉన్న అంశాల కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఉమ్మడి అంశాలే ముస్లిముల మధ్య ఐక్యతకు ప్రధాన అక్షం అవుతుంది. ఉదాహారణకు ఇక్కడ కొన్ని ఉమ్మడి అంశాలను ప్రదర్శించాలనుకుంటున్నాము. అన్ని ఉమ్మడి అంశాలను ఇక్కడ చెప్పడం సాధ్యం కాదు.
1. అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగివుండడం.
2. అల్లాహ్ ఒక్కడే అన్న విషయాన్ని విశ్వసించడం.
3. అంతిమదినం పట్ల విశ్వాసం.
4. దైవప్రవక్త(స.అ) యొక్క దౌత్యం మరియు వారి అంతిమ ప్రవక్త అని విశ్వసించడం.
5. ఖుర్ఆన్ ఒకటే.
6. మనం నమాజ్ చదివే ఖిబ్లా(దిక్కు) ఒకటే.
7. దైవప్రవక్త(స.అ) అహ్లెబైత్.
8. ఇతర విషయాల పై ఇస్లాం ను ప్రాముఖ్యత ఇవ్వడం.
9. ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్ ను తమ తమ మూల అంశాలకు నిదర్శనగా నిర్ధారించడం.
10. దీన్ లో వీటిని ముఖ్యమైనవిగా భావించడం., నమాజ్, రోజా, హజ్, జకాత్, జిహాద్ మొ..
11. ఇస్లాం యొక్క ప్రధాన మరియు ముఖ్యమైన వాటి తరపు నుంచి పోరాడడం.
12. ఇస్లాం ఉమ్మత్ తరపు నుంచి డిఫెన్స్ చేయడం.
13. ఇస్లామీయ దేశాల తరపు నుంచి పోరాడడం.
14. ప్రపంచ సంక్షోభాలలో ఒకే తీరు ఉండడం ఉదాహారకు పాలస్తీన, అఫ్గానిస్తాన్, లెబ్నాన్, ఇరాఖ్ మొ..

ముస్లిముల ఐక్యత కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు
1. అల్లాహ్ వాక్యం పై ముస్లిముల ఐక్యత ఆహ్వానం
2. ముస్లిముల మధ్య ఐక్యత కొరకు ఆలోచన పరంగా సిద్ధం చేయడం
3. ముస్లిములలో మేల్కొలుపు తీసుకొని రావడం
4. ఇస్లాం వర్గాలలో ఉన్న ఉమ్మడి అంశాలను ప్రోత్సహించడం
5. ఇస్లాం వర్గాలకు చెందిన ఉలమాలు పరస్పరం కలుసుకొని తమ తమ ఆలోచనలను పంచుకోవడం
6. దీన్ పరమైన ఫత్వా ఇవ్వడం పై ఒక ప్రమాణాన్ని నిర్మించడం
7. ఇస్లామీయ ఉలమాల తరపు నుంచి ఐక్యత అవసరం మరియు విరుద్ధం పట్ల హరామ్ యొక్క ఫత్వాను జారీ చేయడం
8. సంవత్సరం పొడుగు వివిధ సందర్భాలలో ముస్లిముల ఐక్యతకు సంబంధించిన కార్యక్రమాలు జరపడం
9. ముస్లిముల ఐక్యత గురించి జ్ఞాన మరియు హేతుబద్ధమైన సాహిత్యాలు ప్రచురించడం
10. జాతియా స్థాయిలో ఇస్లామీయ ఐక్యత పరంగా ప్రభావితమైన వ్యక్తుల ద్వార ఐక్యత కమీటిని స్థాపించడం
11. ప్రాంతీయ స్థాయిలో కూడా ఐక్యత కమీటిలను స్థాపించడం
12. ఇస్లామీయ మద్రసాలలో మరియు మస్జిదులలో ఐక్యత గురించి కార్యక్రమాలు నిర్వర్తించడం.
13. ఐక్యత కోసం వెబ్ సైట్ల్ తయారు చేయడం
14. ఐక్యత గురించి వివిధ భాషలలో అనువాధం చేయడం
15. ముస్లిములను చీల్చే విషయాలను నిషేధించడం
16. ముస్లిములను చీల్చే విషయాలను హేతుబద్ధంగా సమాధానం ఇవ్వడం
17. ముస్లిములను కించపరచడం, ధిక్కారించడం మరియు అవిధేయతలుగా నిందించడం నుంచి దూరంగా ఉండడం
18. ముస్లిములను చీల్చేందుకు ప్రయత్నించే సమూహాలను మరియు వ్యక్తులను ఎత్తి చూపించడం
19. ఇస్లామీయ ఉమ్మడి అంశాలలో సోదరాభావంతో మరియు విరుద్ధ అంశాలలో పరిశోధన విధానాన్ని ప్రోత్సాహించడం
20. కష్టాలలో ఒకరికొకరు సహాయపడడం
21. ముస్లిములను చీల్చాలనుకునే శత్రువుల ఆలోచనలను ఉమ్మత్ కోసం తెలియపరచడం
22. ప్రపంచ స్థాయిలో జరిగే సంఘటనలను విశ్లేషించడం
23. ఐక్యతకు సంబంధించిన ప్రశ్నలకు హేతబద్ధమైన సమాధానం ఇవ్వడం
24. ప్రచురణల ద్వార ఇస్లామీయ ఐక్యతను ప్రచారం చేయడం
25. విద్యాసంస్థలో ఇస్లామీయ ఐక్యతను చేర్చడం, మొ...

ఐక్యత అడ్డంకులు
ముస్లిముల మధ్య ఐక్యత మార్గంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి వాటిని తొలగించడం అవసరం. ముందుగా ఆ అడ్డంకులను తెలుసుకుందాం.
1. ఇస్లామీయ వర్గ అనుచరుల మధ్య పరస్పర అపార్థాలు
2. ఉలమాల మతపక్షపాతం మరియు సంకుచితం
3. దర్బారు మరియు అధికార ఉలమాలు
4. దీన్ యొక్క యదార్థం పట్ల అవగాహన మరియు జ్ఞానం లేని అజ్ఞానులు
5. ఇస్లాం శత్రువుల మనుషుల
6. మతపక్షపాతం మరియు సంకుచితాన్ని నేర్పే మద్రసాలు
7. ఇతర వర్గాల వారిని కించపరచి ప్రజల ఆదరాన్ని పొందే ఉపన్యాసకులు
8. వర్గ అనుచరుల మధ్య పరస్పర ప్రతికూల ప్రచారం
9. ప్రపంచాన్ని ఎలాలనే దుష్టుల కుట్రలు మరియు వాటి పట్ల అవగాహన లేకపోవడం
10. తోటి ముస్లిం వర్గాలను అవిశ్వాసులు అని నిందించే మతపక్షపాత సమూహాలు
11. ఎక్కువ శాతం ముస్లిములలో వివేకానికి బదులు భావోద్వేగాలు ఎక్కువగా ఉండడం
12. ముస్లిముల మధ్య వైరాన్ని పెంచి అధికారాన్ని తన సొంత చేసుకోవాలని ఆశపడే అధికారాలు
13. జాతీయవాదం
14. సహనం మరియు ఔదార్యం లేకపోవడం
15. ఇస్లాం సమాజంలో ప్రస్తుత సంక్షోభాలు తెలియకపోవడం
16. మూల మరియు సాధారణ వ్యతిరేకతలను ప్రోత్రహించడం మరియు వాటిని పెద్దవి చేసి చూపించడం
17. వ్యతిరేకత మరియు శత్రుత్వంలో ఉన్న తేడాను గమనించకపోవడం
18. ప్రతీ వర్గం తమ వర్గాన్ని ఎటువంటి కొరత లేని యదార్థ వర్గం మరియు ఎదుటివారిని మార్గభ్రష్టులుగా భావించడం
19. ఐక్యత యొక్క ప్రాక్టికల్ మ్యానిఫెస్టో లేకపోవడం
20. నిబద్ధత మరియు మంచి ఉలమాల కొరత లేదా లేకపోవడం
21. ముస్లిములలో సాధారణంగా విజ్ఞానం పట్ల అశ్రద్ధ
22. ఖుర్ఆన్ మరియు సున్నత్ నుంచి దూరం
23. గుడ్డి నమ్మకం
24. గర్వం, అహంకారం, అహంభావం
25. నిజమైన ఐక్యతకు బదులు ప్రజలకు చూపించడానికి ఐక్యత నాటకం

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16