ఇతరుల పట్ల మనిషి బాధ్యతలు

గురు, 10/28/2021 - 18:10

సంబధువుల పట్ల బాధ్యతలు, పొరుగువారి పట్ల బాధ్యతలు, ఒక సమాజం పట్ల మనిషికి ఉండవలసిన బాధ్యతల గురించి ఇస్లాం ఏమని చేబుతుంది అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

ఇతరుల పట్ల మనిషియ బాధ్యతలు

సంబధువుల పట్ల మనిషి బాధ్యత:
తల్లిదండ్రుల ద్వార మనిషికి ఏర్పడే సంబంధ బంధువుల సంబంధం, వారి ద్వార ఒక కుటుంబం మరియు కుటుంబాల సమూహమే సమాజంగా మారుతుంది. ఇస్లాం ఈ సంబంధం గురించి కూడా చాలా తాకీదు చేస్తూ వారి పట్ల బాధ్యతలను ఉపదేశించింది. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను:  "ఓ మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరి పేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్ కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై నిఘావేసి ఉన్నాడు”[సూరయె నిసా, ఆయత్1].
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “నేను నా ఉమ్మత్ ను బంధువులతో కలిగి వుండమని ఆదేశిస్తున్నాను. ఒకవేళ బంధువుల మధ్య ఒక సంవత్సరం పొగుడు మార్గం ఉన్నా, బంధాన్ని తెంచుకోకండి”(అనగా ఎంత దూరమైన సరే కలుస్తూ ఉండండి)[1]

పొరుగువారి పట్ల బాధ్యత:
పొరుగువారు, మనిషి నివసించే చుట్టుప్రక్కలే ఉంటారు కాబట్టి వారితో సంబంధం ఏర్పడుతుంది. ఒక విధంగా వారు కూడా ఒక పెద్ద కుటుంబం పరిధిలో వస్తారు, వారి పరస్పర మంచి ప్రవర్తన మరియు చెడు ప్రవర్తనలు ప్రభావితమౌతాయి.
రాత్రి ఇంట్లో గోలగోలగా గడిపితే నగరానికి అటువైపు ఉన్న వారు వేధింపుకు గురి అవ్వరు కాని పొరుగులో ఉన్న వారి మనశాంతి పోతుంది.
పొరుగువారి గురించి ఇస్లాం చాలా తాకీదు చేసింది. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “జిబ్రయీల్ పొరుగువారి గురించి ఎంత సిఫార్సు చేసేవారంటే; అల్లాహ్ పొరుగువారిని నా వారుసులలో ఒకరిగా నిర్ధారిస్తాడేమో అని అనుకునేవాడిని”[2]
అలాగే మరో చోట ఇలా ఉల్లేఖించారు: “అల్లాహ్ మరియు అంతిమదినం పట్ల విశ్వాసం ఉన్నవాడు నిస్సందేహంగా తమ పొరుగువారికి అన్యాయం చేయడు, అప్పడిగితే వారికి అప్పిస్తాడు, వాళ్ల కష్టసుఖాలలో పాల్గొంటాడు. పొరుగువారు అవిశ్వాసులైనా సరే వారిని కష్టపెట్టకూడదు”[3]
మరో చోట ఇలా ఉల్లేఖించబడి ఉంది: “పొరుగువారిని కష్టపెట్టేవాడు, స్వర్గ సుగంధం వాసన కూడా వాడికి చేరదు మరియు పొరుగువారి పట్ల ఉన్న బాధ్యతలను అమలు పరచని వాడు మావాడు కాదు. కడుపు నిండుగా ఉండి తన పొరుగువారు ఆకలితో ఉన్నారు అని తెలిసి కూడా వారికి ఏది ఇవ్వని వాడు ముస్లిం కాదు”[4]
తన క్రిందపని చేసేవారి మరియు పేదవారి పట్ల మనిషి బాధ్యత:
మనిషి సమాజాన్ని ఏర్పర్చడానికి ముఖ్యకారణం అవసరం గల వ్యక్తి అవసరాలను పూర్తి చేయడం కోసం అని అందరూ నమ్ముతారు. ఈ సమాజంలో నివసించే ప్రతీ ఒక్కడి అతి ముఖ్య బాధ్యత నిస్సహాయులకు మరియు బలహీనులకు సహాయపడడం మరియు వారి జీవనవసరాలను పూర్తి చేసుకోలేని వారి అవసరాలను తీర్చడం.
ఈనాడు అందరి కోసం స్పష్టమైన విషయమేమిటంటే., నిస్సహాయుల పట్ల అశ్రద్ధత సమాజాన్ని నాశనం చేయగలనటువంటి పెద్ద ఆపద, ఈ ఆపదకు ముందుగా సిరిమంతులే గురి అవుతారు.
14 శతాబ్ధాల ముందే ఇస్లాం ఈ ఆపదలను గ్రహించి సిరివంతులకు ప్రతీ సంవత్సరం తన సొమ్ము నుంచి కొంత భాగాన్ని పేదవారి మరియు నిస్సహాయుల కోసం నిర్ధారించమని ఆదేశించింది. అలాగే నిత్యం అల్లాహ్ మార్గంలో పేదవారికి సహాయం చేయడం కోసం ఆదేశించబడింది.
ఖుర్ఆన్ ఉపదేశం: “మీకు ప్రియాతిప్రయమైన వస్తువుల నుండి మీరు (దైవమార్గంలో) ఖర్చు పెట్టనంతవరకూ మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చు పెట్టేదంతా అల్లాహ్ కు తెలుసు”[సూరయె ఆలి ఇమ్రాన్, ఆయత్92].
ప్రజలకు సహాయపడండి అని సూచిస్తున్న రివాయతులు కూడా ఉన్నాయి. దైవప్రవక్త(స.అ) ఇలా ఉపదేశించెను: “ప్రజలలో ఉత్తములు; అందరి కంటే ఎక్కువగా ప్రజలకు లాభం చేకూర్చేవాడు”[5]
అలాగే మరో చోట ఇలా ఉపదేశించారు: “అంతిమదినం అల్లాహ్ దృష్టిలో ఉత్తమ స్థానం గలవారు., అల్లాహ్ దాసులకు మంచి చేయు మార్గంలో ముందుగా ఉండేవారు”

సమాజం పట్ల మనిషి బాధ్యత:
మనిషులు ఒకరి సహాయంతో మరొకరు తమ అవసరాలను తీర్చుకుంటాడు. ఇలాంటి మనుషుల ద్వార ఏర్పడే సమాజం యొక్క ఉపమానం ఒక పెద్ద మనిషి మాధిరి. ప్రతీ వ్యక్తి ఈ సమాజం అనబడే మనిషి యొక్క భాగాలలో ఒక భాగం.
మనిషి యొక్క శరీర భాగాలు తన నిర్ణిత పనులు చేసుకుంటాయి మరియు ఇతర భాగాలను సహాయపడుతూనే వాటి సహాయంతో తమను బలపరుచుకుంటాయి. ఒకవేళ శరీర భాగాలు స్వార్థపరులై శరీర ఇతర భాగాలకు సహాయం అందించకపోతే; ఉదాహారణకు చేతులు లేదా కాళ్లు తమ పని చేస్తున్నాయి కాని కళ్లు వాటిని మార్గం చూపేందుకు సహాయం అందించటం లేదు, అలాగే నోరు ఆహారాన్ని తిని కేవలం రుచిని ఆశ్వాదిస్తూ ఉండిపోయి దానిని కడుపులోకి పంపించకపోతే మనిషి ఈలోకాన్ని వదిలివెళ్లాల్సి వస్తుంది, చివరికి ఆ స్వార్థపరులైన భాగాలకు కూడా మరణించాల్సి వస్తుంది!
సమాజం పట్ల మనిషి యొక్క బాధ్యత కూడా మనిషి శరీర భాగాల బాధ్యత మాధిరి; అనగా మనిషి తన స్వయ లాభం తో పాటు సమాజ లాభాన్ని కూడా దృష్టిలో ఉంచాలి. మంచి సమాజం కోసం ప్రయత్నించాలి. దాంతో అతడే లాభం పొందుతాడు. తన హక్కులు పొందాలంటే ఇతరుల హక్కుల కోసం పోరాడాలి.
ఇది స్వభావం నిదర్శించే యదార్థం. ఇస్లాం కూడా ఈ స్వభావం ప్రకారం మనల్ని ఉపదేశిస్తుంది. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “ఇతర ముస్లిములు తన చేతులు మరియు నోరు నుంచి సురక్షితంగా ఉన్నవారే (నిజమైన) ముస్లిం”[6]
మరో చోట ఇలా ఉపదేశించారు: “ముస్లిములు పరస్పరం సోదరులు. అపరిచితుల ప్రతిపక్షంలో ఒక సమూహం, ఒకే మాట మరయు ఒకటై ఉంటారు”[7].

రిఫరెన్స్
1,2. తబాతబాయి, ముహమ్మద్ హుసైన్, తఆలీమె ఇస్లాం, పేజీ220.
3,4. తబాతబాయి, ముహమ్మద్ హుసైన్, తఆలీమె ఇస్లాం, పేజీ221.
5.  తస్నీఫు గురరుల్ హికమ్ వ దురరుల్ కలిమ్, పేజీ450, హదీస్10352.
6. ముత్తఖీయె హిందీ, కన్జుల్ ఉమ్మార్, హదీస్738.
7. కులైనీ, కాఫీ, భాగం2, పేజీ163, తెహ్రాన్, దారుల్ కుతుబ్ అల్ ఇస్లామియ, 1407ఖ

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17