కుటుంబం

శని, 10/30/2021 - 14:12

ఇస్లామీయ సాంఘిక జీవితంలో ఒక అంశం వివాహం మరియు కుటుంబం స్థాపన. ఖుర్ఆన్ మరియు రివాయతులలో వివాహం మరియు కుటుంబ జీవితం యొక్క ప్రాముఖ్యత...

వివాహం మరియు కుటుంబ జీవితం

ఇస్లామీయ సాంఘిక జీవితంలో మరొక అంశం వివాహం మరియు కుటుంబం స్థాపన. వివాహం చేసుకోవడానికి మరియు బ్రహ్మచారితనాన్ని నివారించడానికి ఇస్లాం తన అనుచరులను ప్రోత్సహిస్తుంది. దైవప్రవక్త ముహమ్మద్(స.అ) ఇలా అన్నారు: “వివాహం చేసుకున్నవాడు తన అర్థ దీన్ ను కాపాడుకున్నట్లే, మిగతా అర్థ(దీన్) కోసం ధర్మనిష్టను పాటించాలి”[1]  

ఖుర్ఆన్ పురుషుడు మరియు స్త్రీ మధ్య ఐక్యతను ఇలా వివరిస్తుంది:
1. అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “మేము మిమ్మల్ని జంటలుగా సృష్టించాము”[సూరయె నబా, ఆయత్8]
2. అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “మరి ఆయన సూచనలలోనే ఒకటేమంటే; ఆయన మీ కోసం స్వయంగా మీలో నుంచే భార్యలను సృజించాడు – మీరు వారి వద్ద ప్రశాంతత పొందటానికి! ఆయన మీ మధ్య ప్రేమనూ, దయాభావాన్నీ పొందుపరచాడు. నిశ్చయంగా ఆలోచించే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి”[సూరయె రూమ్, ఆయత్21].
3. అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “అల్లాహ్ మిమ్మల్ని మట్టితో, ఆ తరువాత వీర్య బిందువుతో సృష్టించాడు. ఆ పైన మిమ్మల్ని జతలు (స్త్రీలు, పురుషులు)గా చేశాడు”[సూరయె ఫాతిర్, ఆయత్11]
4. అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “భూమ్యాకాశాలను పుట్టించినవాడు ఆయనే. ఆయన మీకోసం మీ నుండే మీ జతలను చేశాడు. పశువుల జతలను కూడా చేశాడు. ఈ విధంగా (ఇలలో) మిమ్మల్ని వ్యాపింపజేస్తున్నాడు. ఆయన్ని పోలిన వస్తువేదీ లేదు”[సూరయె షూరా, ఆయత్11]
ఖుర్ఆన్ ఈ విధంగా, యదార్థానికి కుటుంబ స్థాపన యొక్క ఫిలాసఫీని సూచించెను.

వివాహం జరగడం ఆలస్యం అయ్యేవారిని ఉద్దేశించి ఖుర్ఆన్ ఇలా ఉపదేశించెను: “వివాహం చేసుకునే ఆర్థిక స్థోమత లేనివారు, అల్లాహ్ తన అనుగ్రహంతో తమకు స్థోమతను ప్రసాదించే వరకూ శీల శుద్ధతను పాటించాలి:[సూరయె నూర్, ఆయత్33]
ఒకవేళ మన సమాజం శీలశుద్ధతనంగా ఉండాలనుకుంటే యువకులకు వివాహం చేసే విషయంలో మన స్థోమతను బట్టి సహాయం చేయాలి. ఈ విషయంలో ఖుర్ఆన్ ఇలా ఉపదేశించెను: “మీలో వివాహం కాకుండా ఉన్న స్త్రీ పురుషుల వివాహం చేయండి. అలాగే మంచి నడవడికగల మీ బానిసల, బానిస స్త్రీల వివాహం కూడా జరిపించండి. ఒకవేళ వారు పేదవారై ఉంటే అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేస్తాడు. అల్లాహ్ విశాల సంపన్నుడు, సమస్తమూ తెలిసినవాడు.”[సూరయె నూర్, ఆయత్32]

వివాహం విషయంలో సహాయం చేసినవారి కోసం రివాయతులలో ఇలా ఉంది:
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “బ్రహ్మచారికి వివాహం జరిపించినవాడ్ని, ప్రళయదినాన అల్లాహ్ కరుణతో చూసేవారిలో నిర్థారిస్తాడు”[2]
విడాకులు; ఇస్లాం విడాకులను సమ్మతించదు అత్యవసర సందర్భములలో తప్ప. దానికి కూడా చాలా షరత్తులు ఉన్నాయి.
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “అల్లాహ్ దృష్టిలో వివాహం ద్వార ఏర్పడే ఇంటిని మించిన ఇష్టమైన ఇల్లు లేదు అలాగే ఇస్లాంలో విడాకుల ద్వార నాశనమయ్యే అసహ్యకరమైన ఇల్లు లేదు”[3]
ఇస్లామిక్ సాంఘిక జీవితంలో భాగము బంధుత్వము కొరకు ఉన్నతమైనది. తల్లిదండ్రుల పట్ల దయ మరియు గౌరవం ఇస్లాం మతం లో చాలా ముఖ్యమైన లక్షణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు: మీరు ఆయనను తప్ప మరొకరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్యవహరించాలి. నీ సమీక్షంలో వారిలో ఒకరుగాని, ఇద్దరుగానీ వృద్ధాప్యానికి చేరుకుని ఉంటే వారి ముందు (విసుగ్గా) “ఊహ్” అని కూడా అనకు. వారిని కసురుకుంటూ మాట్లాడకు. పైగా వారితో మర్యాదగా మాట్లాడు. అణుకువ, దయాభావం ఉట్టిపడే విధంగా నీ భుజాలను వారి ముందు అణచిపెట్టు. “ఓ ప్రభూ! బాల్యంలో మీరు నన్ను (ప్రేమానురాగాలతో) పోషించినట్లుగానే నీవు వీరిపై దయజూపు” అని వారి కోసం ప్రార్థింస్తూ ఉండు.[సూరయె ఇస్రా, ఆయత్23-24].

రిఫరెన్స్
1. అల్ కాఫీ, మర్హూమ్ కులైనీ, భాగం5, పేజీ328.
2. రౌజతుల్ ముత్తఖీన్, భాగం8, పేజీ111.
3. వసాయిల్ అల్ షియా, హుర్రె ఆములీ, భాగం16, పేజీ266, 267

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 26