మహిళ ఇస్లాం దృష్టిలో

శని, 10/30/2021 - 14:32

మహిళల గురించి ఖుర్ఆన్ మరియు ఇస్లాం ఏమని సూచిస్తున్నాయి. మనిషిని సంపూర్ణ స్థాయికి చేర్చడానికి ఎంత వరకు సహాయం పడతుంది అన్న విషయాల పై సంక్షిప్త వివరణ...

మహిళ ఇస్లాం దృష్టిలో

ఇస్లాం దృష్టిలో, పురుషుడు మరియు స్ర్తీ; ఇద్దరి లక్ష్యం – అనగా మనిషిని సంపూర్ణ స్థాయికి చేర్చడంలో – ఒకటే. ఈ లక్ష్యాన్ని చేర్చడంలో ఇద్దరూ సమానులే. ఒకరు గొప్ప మరొకరు అల్ప అన్న మాటే తప్పు. ఇక జీన్సు పరంగా సృష్టి అవసరాన్ని బట్టి వారు వేర్వేరుగా ఉంటారు. అలా అని పురుషుడు ఏ విధంగా స్ర్తీని తక్కువగా భావించకూడదు అలాగే స్ర్తీ పురుషుడ్ని తక్కువ చేసి చూడకూడదు.

ఇస్లాం దృష్టిలో మహిళ:
1. మహిళ, సౌందర్యం, గాంభిర్యం మరియు శాంతికి చిహ్నం.
2. స్ర్తీ, మగాడికి మనశాంతికి కారణం. మగాడు స్ర్తీ యొక్క భరోసా, సంరక్షకుడు.
3. స్ర్తీ పురుషలకు సంబంధించి సూచించబడ్డ వేర్వేరు అహ్కాములు అన్యాయం లేదా మగవాడి పెత్తనాన్ని సూచించవు, ఈ బేధం కేవలం సమాజం మరియు కుటుంబ బాధ్యతల నుంచి పుడుతుంది అంతే.
అల్లాహ్ తరపు నుంచి అవతరించబడ్డ ప్రవక్తలందరూ మానవజాతిని ఉద్దేశించి ఆహ్వానించేవారు. “నన్ను అనుసరించినవాడే నా వాడు”(సూరయె ఇబ్రాహీమ్, ఆయత్39).
అల్లాహ్ దృష్టిలో ఎవరూ ఎక్కువ కాదు. ఆయన దృష్టిలో కేవలం భయభక్తులు గలవారే అల్లాహ్ సమక్షంలో ఎక్కువ ఆదరణీయుడు. ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించబడి ఉంది: “ఓ మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుడు, ఒకే స్ర్తీ ద్వారా సృష్టించాము. మరి మీ (పరస్పర) పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యదార్థానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువ ఆదరణీయుడు. నిశ్యయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అప్రమత్తుడు”[సూరయె హుజురాత్, ఆయత్13]
దాసోహం కలిగివున్న వారే అల్లాహ్ కు అతి సమీపంలో ఉన్నవారు, వారు మగవారు కానివ్వండి లేదా ఆడవారు కానివ్వండి. ఖుర్ఆన్: “(ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు) [సూరయె బఖరహ్, ఆయత్186].
ఖుర్ఆన్ లో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నయి. కేవలం ఉదాహారణకై కొన్ని ఆయతులు మాత్రమే వివరించడం జరిగింది.  
"మహిళలు" అనే ఖుర్ఆన్ యొక్క పూర్తి అధ్యాయం ఒక మహిళ యొక్క ఆధ్యాత్మికతను, ఆమె దేశీయ మరియు సామాజిక హక్కులను చర్చిస్తుంది. అధ్యాయం ఇలా ప్రారంభమవుతుంది- "ఓ మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి (సూరయె నిసా, ఆయత్01).
ఓ ప్రవక్త! విశ్వసించిన స్త్రీలు మీకు రాజకీయ మరియు మత విశ్వాసాల పట్ల విధేయతగా ఉంటామని ప్రమాణం చేయడానికి వచ్చినప్పుడు... వారి విధేయతను అంగీకరించు(సూరయె మమ్తహెనహ్, ఆయత్12)

సమాజంలో మహిళల హక్కులను వివరించే ఖుర్ఆన్ ఆయతులు:
తల్లిదండ్రులు, సమీప బంధువులు వదిలివెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అలాగే తల్లిదండ్రులు, సమీప బంధువులు వదిలివెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది. ఆ ఆస్తి తక్కువైనాసరే, ఎక్కువైనాసరే (అందులో) వాటా మాత్రం నిర్ధారితమై ఉంది.[సూరయె నిసా, ఆయత్7].
విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు బలవంతంగా స్త్రీలకు వారసులై కూర్చోవటం మీకు ధర్మసమ్మతం కానేరదు. మీరు వారకి ఇచ్చిన దానిలో (మహ్ర్) నుంచి కొంత సొమ్ము కాజేసే ఉద్దేశ్యంతో వారిని ఆపి ఉంచుకోకండి. ఒకవేళ వారు గనక బాహాటంగా ఏదైనా నీతిమాలిన పనికి పాల్పడితే అది వైరే విషయం. వారితో ఉత్తమరీతిలో కాపురం చేయండి. ఒకవేళ వారు మీకు నచ్చకపోతే బహుశా ఏదో ఒక్క విషయం మూలంగా మీకు నచ్చకపోవచ్చు. కాని మీకు నచ్చని ఆ విషయంలోనే అల్లాహ్ అపారమైన శుభాన్ని పొందుపరచాడేమో! (మీకేం తెలుసు?)[సూరయె నిసా, ఆయత్19]
పురుషులు సంపాదించిన దానిని బట్టి వారి భాగం వారికుంటుంది. అలాగే స్త్రీలు సంపాదించిన దానినిబట్టి వారి భాగం వారికుంటుంది.[సూరయె నిసా, ఆయత్32]
సత్కార్యాలు చేసేవారు పురుషులైనా, స్త్రీలయినా – విశ్వాసులై ఉంటే మేము వారికి అత్యంత పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తాము. వారి సత్కార్మలకు బదులుగా సత్ఫలితాన్ని కూడా మేము వారికి తప్పకుండా ఇస్తాము.[సూరయె నహ్ల్, ఆయత్97]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20