సమాజం పై న్యాయధర్మాల ప్రభావం

సోమ, 11/01/2021 - 18:08

న్యాయధర్మాలు ఎన్ని రకాలు? వాటి పై అమలు పరచడం ద్వార ఏమి జరుగుతుంది? అన్న విషయాల పై ఆయతుల నిదర్సం మరియు సంక్షిప్త వివరణ...

సమాజం పై న్యాయధర్మాల ప్రభావం

వ్యక్తిపరమైన న్యాయధర్మం:
వ్యక్తిపరమైన న్యాయధర్మం అనగా మనిషి అబద్ధం, చాడీలు చెప్పడం మరియు పాపములు చేయడం మరియు ఇతర దౌష్టచర్యల నుంచి దూరంగా ఉండడం. ఇలాంటి గుణం ఉన్నవారిని న్యాయమైనవారు అని అంటారు. ఇస్లామీయ భాషలో “ఆదిల్” అంటారు. ఇస్లామీయ ఉపదేశాలనుసారం, ఒకవేళ ఇలాంటి వ్యక్తి జ్ఞానపరంగా కూడా అర్హత కలిగివుంటే, న్యాయాధికారి మరియు అధికారి మరియు ముజ్తహిద్ మరియు ఇతర సామాజిక వ్యవహారములను చేపట్టవచ్చు. అదే ఒకవేళ ఇలాంటి వ్యక్తిత్వం లేని మరియు ధార్మిక ఉనికి లేనివాడు, అతడు జ్ఞాని అయినప్పటికి ఇలాంటి వ్యవహారములకు అర్హుడు కాదు.

సామాజిక న్యాయధర్మం:
సామాజిక న్యాయధర్మం అనగా మనిషిపై ఇతరుల పట్ల ఉండే బాధ్యతలను ఎక్కువ తక్కువలు లేకుండా నిర్వర్తించడం. అందరిని చట్టం ప్రకారం సమానంగా చూడడం. అతికి గురికాకుండా, మనోభావాలకు లొంగకుండా, భావోద్వేగాలకు ప్రభావాలకు లోనవకుండా, రుజుమార్గం నుంచి ఫిరాయించకుండా మత పరమైన చట్టాన్ని అమలు పరచడం.
అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “అల్లాహ్ న్యాయం చేయమనీ, ఉపకారం(ఇహ్సాన్) చేయమనీ, బంధువుల హక్కులను నెరవేర్చమనీ ఆజ్ఞాపిస్తున్నాడు”[సూరయె నహ్ల్, ఆయత్90].
మరోచోట ఇలా ఉపదేశించెను: “ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి”[సూరయె నిసా, ఆయత్58]
చాలా ఆయత్ మరియు రివాయతులలో మాట మరియు నడవడికలో న్యాయంగా ఉండాలని ఆజ్ఞాపించబడింది. అల్లాహ్ కొన్ని సందర్భాలలో దుర్మార్గులను స్పష్టంగా, నేరుగా “లఅనత్” చేశాడు.

అన్యాయం మరియు దుర్మార్గ:
అల్లాహ్ తన గ్రంథంలో చాలా సార్లు అన్యాయం మరియు దుర్మార్గం గురించి సూచించెను. ఈ గుణం చాలా చెడ్డ గుణం. ఇది మాంసాహారుల స్వభావం.
అన్యాయం మరియు దుర్మార్గం మంచి చర్య కాదు అని ప్రతీ మనిషికి తెలుస్తుంది. అలాగే ఈ అన్యాయం మరియు దుర్మార్గం వల్ల మానవ సమాజంలో ఎంత రక్తం చిందించబడినదో, ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో తెలియనివాడు లేదా గ్రహించని వాడు ఉండడు.
అనుభవం ద్వార తెలిసే యదార్థమేమిటంటే; అన్యాయపు కోట ఎంత బలమైనదైనా సరే, అది నిత్యం స్థిరత్వం కలిగివుండదు, ఈరోజు కాకపోతే రేపు ఆ దుర్మార్గుల పై కూలిపోతుంది. అల్లాహ్ ఇలా సూచించెను: “అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు”[సూరయె అన్ఆమ్, ఆయత్144]
మాసూముల వచనానుసారం: “రాజ్యాధికారాలు అవిశ్వాసంతో మిగిలి ఉంటాయి కాని అన్యాయం మరియు దుర్మార్గం ద్వార మిగిలి ఉండవు.(నాశనం అవుతాయి).  

మానవ హక్కులు:
మానవ హక్కులను వారికి చెందేలా చేయడం మరియు వారి పట్ల బాధ్యతగ ఉండడమే ఒక మంచి సమాజానికి కారణమౌతుంది. అందుకోసమే అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో ఇలా ఉపదేశించెను: “వాస్తవానికి మేము ఆదం సంతతిని గౌరవం వొసగాము”[సూరయె ఇస్రా, ఆయత్70]. అనగా అందరిని గౌరవించాలి. మన ప్రవర్తనగాని లేదా మన మాటలు గాని ఎదుటివారిని అగౌరపరిచే లేదా నిరాశ పరిచే విధంగా ఉంకూడదు.
మరో చోట ఇలా ఉంది: “ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన వహీ ప్రకారం తీర్పు చెయ్యరో వారే (కరడుగట్టిన) అవిశ్వాసులు”[సూరయె మాయిదహ్, ఆయత్44]. అంటే ధర్మానికి కట్టుబడి ఉండాలి, దాని అనుసారం అమలు చేయాలి.
మరో చోట ఇలా ఉపదేశించెను: “ఎవరైనా ఒకరి హత్యకు ప్రతీకారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినైనా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు”[సూరయె మాయిదహ్, ఆయత్ 32].
విశ్వాసం యొక్క అవసరమైన లక్షణాలు; ఆకలితో ఉన్న వారిని తినిపించడం, నిరాశ్రయులకు ఆశ్రయం కలిపించం, అనాథలను స్వీకరించడం, అనారోగ్య మరియు గాయపడినవారిని చికిత్స చేయడం, జాతి లేదా రంగుతో సంబంధం లేకుండా ఉండటం, మొ... అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “తీర్పు(దినము)ను ధిక్కరించే వాడిని నీవు చూశావా?! వీడే అనాధను గెంటివేసేవాడు. నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం (ఇతరులకు) ప్రేరేపించనివాడు. ఆ నమాజీలకు వినాశం తప్పదు (వైల్ అనే నరక స్థానం వారికొరకు ఉన్నది). (ఎందుకంటే) వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. వారు (ఒకవేళ నమాజు చేసినా) పరులకు చూపటానికి చేస్తారు. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సయితం ఇవ్వటానికి వారు నిరాకరిస్తారు”[సూరయె మాఊన్, ఆయత్1-7].

రిఫరెన్స్
తబాతబాయి, ముహమ్మద్ హుసైన్, తఆలీమె ఇస్లాం, పేజీ225.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12