అమర్ బిల్ మఅరూఫ్ వ నహ్య్ అనిల్ మున్కర్

బుధ, 11/03/2021 - 18:45

సత్కార్యముల ఆదేశం మరియు చెడును నిషేధించడం (అమర్ బిల్ మఅరూఫ్ వ నహ్య్ అనిల్ మున్కర్) ఖుర్ఆన్ మరియు హదీసుల దృష్టిలో..

అమర్ బిల్ మఅరూఫ్ వ నహ్య్ అనిల్ మున్కర్

ఇస్లాం ముఖ్యమైన ఆదేశాలలో ఒకటి “అమర్ బిల్ మఅరూఫ్ వ నహ్య్ అనిల్ మున్కర్”. ఒక సమాజం యొక్క గౌరవం, అస్తిత్వం, శ్రేష్ఠత మరియు అభివృద్ధీ, అలాగే ఆదేశాలపై అమలు, చెడు జరగకుండా ఆపడం మరియు సామజిక రక్షణ కూడా వీటితో ముడి పడి ఉన్నాయి. దీని ప్రాముఖ్యతను వివరిస్తూ ఖుర్ఆన్ లో ఎన్నో చోట్ల దీని గురించి వివరించబడి ఉంది. అలాగే దీనికి సంబంధించి దైవప్రవక్త(స.అ) మరియు వారి అహ్లెబైత్(అ.స)ల ఎన్నో హదీసులు ఉన్నాయి. అంతేకాకుండా వాటి ఆచరణ విషయంలో విద్వాంసులు కూడా తమ అభిప్రాయాలను పిఖా మరియు కలామీ(మత విశ్వసాల పరంగా లిఖించబడే) పుస్తకాల రూపంలో వివరించారు.

దీని గురించి ఖుర్ఆన్ ఇలా ఉపదేశించెను:
అల్లాహ్ “మేలు వైపుకు పిలిచే, మంచిని చెయ్యమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యాన్ని పొందుతారు”[సూరయె ఆలి ఇమ్రాన్, ఆయత్104]
మరో చోట ఇలా ఉంది: “ఓ (ప్రియమైన) కుమారా! నువ్వు నమాజును నెలకొల్పుతూ ఉండు. సత్కార్యాల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు. చెడు పనుల నుంచి వారిస్తూ ఉండు. ఏ ఆపద వచ్చిపడినా సహనం పాటించు. నిశ్చయంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన పనులు”[సూరయె లుఖ్మాన్, ఆయత్17]
మరో చోట ఇలా ఉంది: “విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్ర్తీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా (సహాయకులుగా, చేదోడువాదోడుగా) ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు”[సూరయె తౌబహ్, ఆయత్71]
మరో చోట ఇలా ఉంది: “మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరు. మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి ఆపుతారు, ఇంకా మీరు అల్లాహ్ ను విశ్వసిస్తారు”[సూరయె ఆలి ఇమ్రాన్, ఆయత్110]

అమర్ బిల్ మఅరూఫ్ వ నహ్య్ అనిల్ మున్కర్ ప్రాముఖ్యత హదీసులలో:
దైవప్రవక్త(స.అ) ఇలా ఉపదేశించెను: అల్లాహ్ అజ్జవజల్ దీన్ లేని బలహీనమైన విశ్వాసి పట్ల అసహ్యం కలిగి ఉంటాడు. దీన్ లేని ఆ విశ్వాసి ఎవరు అని ప్రశ్నించగా “నహ్య్ అనిల్ మున్కర్ చేయనివాడు(చెడును నిషేదించనివాడు)” అని దైవప్రవక్త(స.అ) సమాధానమిచ్చారు.[1]
ఇమామ్ మొహమ్మద్ బాఖిర్(అ.స) ఇలా ఉల్లేఖించారు: నిస్సందేహముగా అమర్ బిల్ మఅరూఫ్ వ నహ్య్ అనిల్ మున్కర్ దైవప్రవక్తల మార్గం మరియు సజ్జనుల రీతి. అది అవసరమైన ఉత్తమ చర్య దీంతో మిగతా చర్యలు స్థాపించబడతాయి, పద్ధతులూ మార్గాలు సురక్షితమౌతాయి, ఆదాయం హలాల్ గా మారుతుంది, అన్యాయంగా దోచుకోబడిన ఇతరుల హక్కులూ మరియు ధనం వారికి చేరుతుంది, భూమి కల్మషం లేనిదిగా మారుతుంది మరియు శత్రువుల పై చర్య తీసుకోబడుతుంది మరియు అన్ని చర్యలు సవ్యంగా జరుతాయి”[2]

అమర్ బిల్ మఅరూఫ్ వ నహ్య్ అనిల్ మున్కర్ షరత్తులు
ఇస్లాం ఆదేశాలనుసారం ఇస్లామీయ విధ్వాంసులు ఈ అమర్ బిల్ మఅరూఫ్ వ నహ్య్ అనిల్ మున్కర్ అమలు పరచడానికి కొన్ని షరత్తులను నియమించారు. ఇవి ఉంటేనే అమర్ బిల్ మఅరూఫ్ వ నహ్య్ అనిల్ మున్కర్ అమలు పరచబడుతొంది అని భావిస్తారు. అవి:
1. మఅరూఫ్ మరియు మున్కర్ తెలిసి ఉండడం: అమర్ బిల్ మఅరూఫ్ వ నహ్య్ అనిల్ మున్కర్ చేసేవారికి ముందు అదేమిటో తెలిసి ఉండాలి; ఎందుకంటే దాని గురించి సరిగా తెలియని వ్యక్తి చేసే పనికి దానికి భిన్నంగా అమలు జరిగే అవకాశం ఉంటుంది; అంటే మంచి చేయ్యాల్సింది పోయి చెడు సంభవిస్తుంది. అలాగే చెడు నిషేధం విషయంలో కూడాను.
2. ఎదుటివాడి పై ప్రభావం: అమర్ బిల్ మఅరూఫ్ వ నహ్య్ అనిల్ మున్కర్ యొక్క ప్రభావం ఎదుటివాడి పై పడుతుంది, ఫలితం దక్కుతుంది అని భావన ఉండాలి.
3. పాపం పట్ల విచారం లేకపోవడం: పాపం చేసిన వ్యక్తికి తాను అల్లాహ్ విధిగా నిర్ధారించిన దాన్ని అమలు పరచలేదు అని లేదా హరామ్ పనిని చేశాను అని చింతించి సిగ్గు పడని వ్యక్తి. అంటే ఒకవేళ తాను చేసిన పని పై విచారించి తిరిగి ఆ పని చేయడు అని భావించినట్లైతే అమర్ బిల్ మఅరూఫ్ వ నహ్య్ అనిల్ మున్కర్ చేయాల్సిన అవసరం లేదు.
4. హాని మరియు అవినీతి: అమర్ బిల్ మఅరూఫ్ వ నహ్య్ అనిల్ మున్కర్ చేసేవాడికి నా ఈ పని ప్రాణాపాయం, ధనాపాయం లేదా ఎదుటివాడి గౌరవం పోతుంది అన్న విషయాన్ని గ్రహించినట్లైతే చేయకూడదు.
గుర్తుపెట్టుకోవల్సిన విషయమేమిటంటే, అమర్ బిల్ మఅరూఫ్ వ నహ్య్ అనిల్ మున్కర్ విషయంలో మనిషి అమర్ బిల్ మఅరూఫ్ వ నహ్య్ అనిల్ మున్కర్ మరియు దాని వల్ల జరిగే హాని లేదా మంచిని దృష్టిలో ఉంచి అమలు పరచాలి. ఒకవేళ అమర్ బిల్ మఅరూఫ్ వ నహ్య్ అనిల్ మున్కర్ చర్య ప్రాముఖ్యత దాని వల్ల జరిగే హాని లేదా మంచి కన్న తక్కువ విలువ అని గ్రహించినట్లైతే; ఇక్కడ అమర్ బిల్ మఅరూఫ్ వ నహ్య్ అనిల్ మున్కర్ వాజిబ్ కాదు దానిని అమలు పరచడం సమ్మతమైనది కూడా కాదు. కాని అదే ఇస్లాం అతి ముఖ్యమైనవిగా మరియు దాని పై అమలు హాని లేదా మంచికి మించినవిగా నిర్ధారించబడిన ఆదేశాల పట్ల అమర్ బిల్ మఅరూఫ్ వ నహ్య్ అనిల్ మున్కర్ వాజిబ్ అవుతుంది. దాని ద్వార ఎంత హాని జరిగినా పరవాలేదు చివరికి అది ధన మరియు ప్రాణ త్యాగాలపై నిలచి ఉన్నాసరే; అనగా ముస్లిముల నమ్మకాలు మరియు ఇస్లామీయ ప్రముఖ అహ్కాములు.[3]

రిఫరెన్స్
1. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, కాఫీ, భాగం5, పేజీ59, తెహ్రాన్, దారుల్ కుతుబ్ అల్ ఇస్లామియహ్, చాప్ చహారుమ్, 1407ఖ.
2. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, కాఫీ, భాగం5, పేజీ56, హదీస్1, తెహ్రాన్, దారుల్ కుతుబ్ అల్ ఇస్లామియహ్, చాప్ చహారుమ్, 1407ఖ.
3. తౌజీహుల్ మసాయిల్(మహష్షా), సయ్యద్ రూహుల్లాహ్ ఖుమైనీ, బాగం2, పేజీ756-757, ఖుమ్, దఫ్తరె ఇంతెషారాతె ఇస్లామీ, చాప్8, 1424ఖ., http://www.islamquest.net/fa/archive/fa76467.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15