జబ్ర్ వ ఇఖ్తియార్ -1

శుక్ర, 11/05/2021 - 11:05

జబ్ర్ వ ఇఖ్తియార్ అనగా మనం మన కార్యములలో స్వేచ్చ కలిగిఉన్నామా లేదా అనే అంశం పై ఖుర్ఆన్ మరియు హదీసుల వివరణ... 

జబ్ర్ వ ఇఖ్తియార్ -1

“జబ్ర్” అనగా మనిషి తాను చేసే చర్యలలో స్వేచ్ఛ కలిగిలేనివాడు చర్యలు చేయడంలో నిరుపాయమైనవాడు అని అర్థం. ఇస్లామీయ వర్గాలలో కొందరు[1] మనిషి తన చర్యలలో స్వేచ్ఛ లేనివాడు, అతడు చేసేపనిలో నిరుపాయమైనవాడు అని నమ్ముతారు[2]. వారు మనిషి చేసే ప్రతీ పనిని అల్లాహ్ చేయిస్తున్నాడు అని భావిస్తారు. ఈ నమ్మకం ప్రకారం చూసుకున్నట్లైతే మనిషి కూడా రాళ్లూ, రప్పలు మాదిరి అన్నమాట; పైనుంచి క్రిందికి విసరబడతాయి తన అభిప్రాయం లేకుండా నిరుపాయంగా ముందుకు సాగిపోతాడు.
ఈ నమ్మకం ఎక్కడ్నుంచి వచ్చిందంటే కొందరు కొన్ని సమస్యలను పరిష్కరించే శక్తి లేక “జబ్ర్”ను ఆశ్రయించారు.

కాని ఈ నమ్మకం ముమ్మాటికి అసత్యమైనది ఎందుకంటే;
1. ఇది అల్లాహ్ యొక్క న్యాయం(అదాలతె ఇలాహి)తో అనుకూలంగా లేదు
అల్లాహ్ ఖుర్ఆన్‌లో ఇలా ఉపదేశించెను: “ఆయన సమత్వం, సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు”[సూరయె నిసా, ఆయత్18]
మరో ఆయత్‌లో ఇలా ఉపదేశించెను: “మేము ప్రళయ దినాన న్యాయంగా తూచే త్రాసులను నెలకొల్పుతాము. మరి ఏ ప్రాణికీ రవంత అన్యాయం కూడా జరగదు. ఒకవేళ ఆవగింజంత ఆచరణ ఉన్నా మేము దానిని హాజరు పరుస్తాము. లెక్క తీసుకోవటానికి మేము చాలు”[సూరయె అంబియా, ఆయత్18]
అల్లాహ్ ఖుర్ఆన్‌లో ఇంతిలా స్పష్టంగా ఉపదేశించిన తరువాత మనిషికి తన చర్యలలో నిరుపాయమైనవాడిగా చేయడం, ఆ తరువాత తప్పు చేస్తే నిన్ను శిక్షిస్తాను అని చెప్పడం ఎంత వరకు సమ్మతమైనది?

2. ఇది దైవప్రవక్త(అ.స)ల లక్ష్యాలతో అనుకూలంగా లేదు
దైవప్రవక్త(స.అ)ల అవతరించబడడానికి అసలైన లక్ష్యాల నుంచి మానవుల శిక్షణ[సూరయె జుమా, ఆయత్02] ఒకవేళ మానవులు తాను చేసే పనులలో స్వేచ్ఛ కలిగి లేనివారు, నిరుపాయమైనవారు అయివుంటే దైవప్రవక్త(అ.స)ల అవతరణ వ్యర్థం అవుతుంది, ఎందుకంటే వారి సువార్తలు మరియు హెచ్చరికలు మానవుల పై ఎటువంటి ప్రభావమూ చూపించవు.
ఒకవేళ మనిషి తన చర్యలలో స్వేచ్ఛ కలిగిలేడు అని నమ్మినట్లైతే, మనిషి యొక్క ఆలోచనకు ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వనట్లు. అలాగే మనిషి మరియు ఇతర జీవుల మధ్య తేడా ఉండదు అని నమ్మినట్లే. 

3. ఖుర్ఆన్ యొక్క కొన్ని స్పష్టమైన ఆయతులను వ్యతిరేకిస్తుంది
ఈ విశ్వసాన్ని నమ్మినట్లైతే పైన చెప్పబడిన రెండు కారణాలలో సూచించబడిన ఆయతులకు వ్యతిరేకించినవారిగా నిర్ధారించబడతారు. 

4. దీని ప్రమాదకరమైన ప్రభావాలు సమాజం పై పడతాయి
ఈ విశ్వాసం వల్ల ప్రమాదకరమైన ప్రభావాలు సమాజం పై పడతాయి. ఈ విశ్వాసం కారణంగా దుర్మార్గుల చేతులు తమ దుర్మార్గం విషయంలో ఎక్కువగా తెరవబడి ఉంటాయి అలాగే అమాయకుల చేతులు కట్టిబడేసి ఉంటాయి. చరిత్రలో ఇలా జరిగింది అని చరిత్రే చెబుతుంది; ఈ విశ్వాసమే బనీ ఉమయ్యహ్ కాలంలో అప్పటి అమవీ రాజకీయ నాయకులకు గట్టి సాక్ష్యంగా నిలిచింది, వారు ఈ విశ్వాసాన్ని సమ్మతించి వారి పక్షంలో చేరి మనిషికి స్వేచ్ఛ ఉంది అన్న విశ్వాసాన్ని వ్యతిరేకించి ఇలాంటి విశ్వాసం కలిగివున్నవారిని చంపేవారు లేదా కారాగారంలో బంధించేవారు.[3]

“ఇఖ్తియార్” ఈ పదం “జబ్ర్” పదానికి ప్రతిపదం. ఇఖ్తియార్ అనగా మానవులు చేసే పనులు వారు పూర్తి స్వేచ్ఛతో చేస్తారు.
ఇది విశ్వాసం కూడా అసత్యమైనదే ఎందుకంటే ఈ విశ్వాసం “తౌహీదె అఫ్ఆలీ” కి అనుకూలంగా లేదు.
సత్యమైన విశ్వాసం: మనిషి తాను చేసే ప్రతీ పని స్వయంగా అతడే చేసినట్లు, ఎందుకంటే అతడు తన స్వేచ్చతో చేయాలనుకున్నది చేశాడు కాబట్టి, అదే విధంగా ఆ పని అల్లాహ్ కు సంబంధించినది కూడా ఎందుకంటే మనిషికి అస్తత్వాన్నీ ఉనికిని పనులు చేసే శక్తిని ప్రసాదించింది అల్లాహ్ యే కాబట్టి. వేరేవిధంగా చెప్పాలంటే అల్లాహ్ యొక్క మానవాళికి తమ చర్యలలో స్వతంత్రం ఉంది, వారు స్వేచ్ఛ కలిగువున్నారు, వారు తమ ఆలోచన ప్రకారం తమ పనులు చేయగలరు అనే విషయాన్ని ఖుర్ఆన్ సమ్మతిస్తుంది: “మరి ఈనాడు ఎవరికీ ఎటువంటి అన్యాయమూ జరగదు. మీరు చేసుకున్న కర్మల ప్రతిఫలం తప్ప మరొకటి ఏదీ మీకు ఇవ్వబడదు”[సూరయె యాసీన్, ఆయత్54]
అలాగే మరో ఆయత్ లో ఇలా ఉంది: “సత్యం మీ ప్రభువు తరపు నుంచి వచ్చింది. కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరిన వారు నిరాకరించవచ్చు”[సూరయె కహఫ్, ఆయత్29]

రిఫరెన్స్
1. అషాయెరహ్ వర్గం
2. అషాయెరహ్ వర్గం వారు వారి ఈ విశ్వాసం పై ప్రదర్శించే సాక్ష్యాలు రద్దు చేయదగినవి. ఉలమాలు వాటిని కొన్ని సాక్ష్యాల ద్వార రద్దు చేశారు. కలామ్ జ్ఞానానికి చెందిన పుస్తకాలలో వాటిని చూడవచ్చు. వాటిని ఇక్కడ వివరించడం ద్వార మనం మన రచన లక్ష్యానికి దూరం అవుతాము.
3. షహీద్ ముతహ్హరీ, ముర్తుజా, ముజ్ముఅయె ఆసార్, భాగం1, పేజీ375-376.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18