జబ్ర్ వ ఇఖ్తియార్-2

శని, 11/06/2021 - 17:50

మనం మన కార్యములలో స్వేచ్చ కలిగిఉన్నామా లేదా అనే అంశం పై ఇంతకు ముందు చెప్పబడిన అంశాల మిగిలిన భాగం... 

జబ్ర్ వ ఇఖ్తియార్-2

...ఆధ్యాత్మిక మార్గనిర్దేశక ఆరంభం ఎల్లప్పుడూ దేవుని నుండే అయి ఉంటుంది కానీ మానవుని విధ్వంసం మొదలుకు కారణాలలో ఒకటి; మనిషి యొక్క తప్పుడు ఎంపిక. దీనిని ఖుర్ఆన్ ఇలా సూచిస్తుంది: “నీకు ఏ మంచి జరిగినా అది అల్లాహ్ తరపు నుంచే జరుగుతుంది. నీకు ఏదైనా చెడు జరిగితే అది నీ స్వయంకృతమే”[ సూరయె నిసా, ఆయత్79]

ఈ విశ్వాసమే సరైన విశ్వాసం అని అర్ధం అయ్యింది. దానికి వ్యతిరేకంగా “జబ్ర్ మరియు ఇఖ్తియార్” రెండు వచనాలు కూడా అతివృష్టి మరియు అనావృష్టికి గురి అయ్యి ఉన్నాయి. ఈ విషయంలో సరైన్ నమ్మకం[1]:
“لا جبر و لا تفويض بل الامر بين الامرين”[2]
ఒక వ్యక్తి హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స)తో “మీరు చెప్పే لا جبر و لا تفويض بل الامر بين الامرين  కి అర్ధం ఏమిటి?”‎ అని ప్రశ్నించగా ఇమామ్(అ.స) ఇలా సమాధానమిచ్చారు: “నీవు భూమి పై నడవడం మరియు భూమి పై పడిపోవడం రెండూ ఒకటి కాదు, ఆ రెండింటిలో తేడా ఉంది”
ఇమామ్ ఉద్దేశం ఏమిటంటే భూమి పై నడవడం మేము అనుకుని చేస్తున్న పని, కాని భూమి పై పడిపోవడం అనుకోకుండా జరిగే పని. ఇక మీరే చెప్పండి మాలో ఎవరికి భూమి పై పడి, చేతులూ కాళ్ళూ విరగ్గొట్టుకోవడం ఇష్టం?. ‎అంటే “ఖజా ఒ ఖద్ర్” (దైవనియోగం) అనగా “బైనల్ అమ్రైన్”‎ అని, ఒక భాగం మన చేతుల్లో ఉంది దానిని మేము మన ఇష్టానుసారం వాడుకుంటాము. రెండవ భాగం మన చేతుల్లో లేదు. మొదటి భాగంలో మన నుండి లెక్క తీసుకోబడుతుంది. రెండవ భాగం నుండి మన నుండి లెక్క తీసుకోబడదు.
అయితే మనిషి కొన్ని సందర్భములలో తన ఇష్టం ప్రకారం అమలు చేస్తాడు మరి కొన్నింటిలో నిస్సహాయుడు. ఈ రెండు రకాలు ఖుర్ఆన్ లో వివరించబడి ఉన్నాయి:
మొదటి రకం: మనిషి స్వేచ్ఛ కలిగివున్నాడు, తాను ఒక పని చేయాలా వద్దా అని ఆలోచించి ఆ తరువాత దానిని చేసే స్వేచ్ఛ కలిగివున్నాడు అని వివరిస్తున్న ఆయత్: “మానవాత్మ సాక్షిగా, ఆ ఆత్మను తీర్చిదిద్ది ఆ పై దానికి సంబంధించిన మంచి, చెడులను దానికి తెలియజేసినవాడు సాక్షిగా, నిశ్చయంగా తన ఆత్మను పరిశుధ్ధ పరచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు, దానిని అణచివేసినవాడు విఫలుడయ్యాడు”[షమ్స్ సూరా:91, ఆయత్:7-10]
రెండవ రకం: ఏ పనులైతే మనిషి స్వేచ్చతో తన ఉద్దేశం ప్రకారంగా చేయడో అవి నిజానికి దైవనియోగానికి సంబంధించినవి అయ్యి ఉంటాయి. మరియు సృష్టిధర్మ అనుచరణలో ఉంటుది, ఎలాగైతే మనిషి తనను తాను మగ లేదా స్త్రీగా తయారు చేసుకోలేడో, తెలుపు లేదా నలుపు రంగు గల వాడిలా చేసుకో లేడో, పొడవు మరియు పొట్టిగా చేసుకోలేడో. వీటిలో మనిషి నిరుపాయమైనవాడు. ఈ విషయాలలో మనిషి ఎన్నో కారణాలతో ముడిపడి ఉంటాడు (ఉదా: వంశపారంపర్యముగా వస్తున్న రోగం) లేదా (మనిషి) ప్రకృతి నియమానికి సంబంధమైన తన లాభం కోసం చేసే పని ఉదా: అలసిపోయిన తరువాత నిద్రపోవడం, విశ్రాంతి తరువాత లేవడం, ఆకలేస్తే తినడం, దాహం వేస్తే త్రాగడం, ఆనందం కలిగినప్పుడు నవ్వడం, దుఖ్ఖం వచ్చినప్పుడు ఏడవడం, స్వయంగా మనిషి శరీరంలోనే ఎన్నో ఫ్యాక్టరీలు, కర్మాగారాలు మరియు మిషిన్లు ఉన్నాయి. అవి జీవం ఉన్న కణాలను మరియు హార్మున్లను ఉత్పత్తి చేస్తాయి మరియు బీజమును ఒక స్థితి నుండి మరో స్థితికి మారే యోగ్యాన్ని ఇస్తుంది మరియు అదే స్థితిలో శరీర బ్యాలెన్సుని అద్భుతంగా యథాస్థితిలో ఉంచుతుంది. మరియు అల్లాహ్ అనుగ్రహం జీవితంలో ప్రతీ నిమిషంలో దానిని నలుప్రక్కల నుండి ఆవరించి ఉంది, అన్న విషయం నుండి మానవ శరీరం అశ్రధ్ధ స్థితికి గురి అయ్యి ఉంటుంది. అంతే కాదు చనిపోయిన తరువాత కూడా అల్లాహ్ అనుగ్రహం మనిషి పై ఉంటుంది అందుకే ఖుర్ఆన్ ఇలా ప్రవచిస్తుంది: “మానవుడు తననను విచ్చలవిడిగా వదిలిపెట్టడం జరుగుతుందని భావిస్తున్నాడా? అతడు(తల్లి గర్భంలో) జార్చబడ్డ నీచమైన ఒక నీటిబిందువు కాడా? తరువాత అతడు ఒకనెత్తుటి ముద్దగా మారాడు;  ఆ తరువాత అల్లాహ్ అతని శరీరాన్ని తయారు చేశాడు; ఆపై అతని అవయవాలను రూపొందించాడు. అటు పై దాని నుండి స్త్రీ పురుషుల రెండు రకాల(జాతుల)ను సృష్టించాడు. అలాంటప్పుడు ఆయన మరణించిన వారిని మళ్ళీ బ్రతికించలేడా?”[అల్ ఖియామహ్, ఆయత్:36-40.]

రిఫరెన్స్
1. అఖాయిదే షియా, బహసె ఖజా ఒ ఖదర్.
2. లా జబ్ర వలా తఫ్వీజ బల్ అమ్రున్ బైనల్ అమ్రైన్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13