దైవప్రవక్త(స.అ) జీవిత చరిత్ర

సోమ, 11/08/2021 - 18:01

అల్లాహ్ తరపు నుంచి అవతరించబడ్డ ప్రవక్తలలో అంతిమ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్(స.అ) వారు. వారి దౌత్య నిదర్శనం ఖుర్ఆన్...

దైవప్రవక్త(స.అ) జీవిత చరిత్ర

పేరు: ముహమ్మద్(స.అ).
కున్నియత్: అబుల్ ఖాసిం.
తండ్రి పేరు: అబ్దుల్లాహ్(అ.స).
తల్లి పేరు: ఆమినహ్(అ.స).
జన్మదినం: 17, రబియుల్ అవ్వల్; ఆముల్ ఫీల్.
జన్మస్థలం: మక్కా.
ప్రవక్తగా: రజబ్ మాసం, 27‌వ తారీఖు; ఆముల్ ఫీల్ యొక్క 40వ ఏట.
పదవీ కాలం: 23 సంవత్సరాలు.
వయస్సు: 63 సంవత్సరాలు.
మరణం: సఫర్ నెల  28వ తారీఖు; హిజ్రత్ 11వ ఏట.
మరణస్థలం: మదీనహ్.
సమాధి: తమ సొంత ఇంట్లో (ఇప్పుడు ఆ ప్రదేశం మస్‌జిదున్నబీ యొక్క భాగంగా మారిపోయింది).

అల్లాహ్ ఈ ప్రపంచాన్ని సృష్టించిన తరువాత మనుషుల యొక్క హిదాయత్(రుజుమార్గం) కొరకు ఒక లక్ష ఇరవై నాలుగు వేల(1,24,000) ప్రవక్తలను ఈ భూమి మీద అవతరింపజేశాడు. అలాహ్ ప్రవేశపెట్టిన ఒక లక్ష ఇరవై నాలుగు వేల(1,24,000) ప్రవక్తలలో ఖుర్ఆన్‌లో వచ్చిన కొందరి పేర్లు హజ్రత్ ఆదమ్(అ.స), నూహ్(అ.స), ఇబ్రాహీమ్(అ.స), ఇస్మాయీల్(అ.స), ఇస్‌హాఖ్(అ.స), యాఖూబ్(అ.స), యూసుఫ్(అ.స), దావూద్(అ.స), సులైమాన్(అ.స), ఇద్రీస్(అ.స), యూనుస్(అ.స), ఇల్యాస్(అ.స), యహ్‌యా(అ.స), లూత్(అ.స), హూద్(అ.స), సాలెహ్(అ.స), అయ్యూబ్(అ.స), వుజైర్(అ.స), యసా(అ.స), జకరియ్యా(అ.స), మూసా(అ.స), ఈసా(అ.స) మరియు ఆఖరి ప్రవక్త ముహమ్మదె ముస్తఫా(స.అ).

అల్లాహ్ తరపు నుంచి అవతరించబడ్డ ప్రవక్తలలో అంతిమ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్(స.అ) వారు. వారు తమ నలభ్బైవ ఏట దైవప్రవక్తగా ఎన్నుకోబడ్డారు. వారు తన పూర్తి జీవితంలో ఒక్క క్షణం కూడా విగ్రాహారధన చేయలేదు మరియు షిర్క్ కు గురి కాలేదు.
బేసత్‌కు ముందు వారు నిత్యం “గారె హరా”లో అల్లాహ్‌ను ఆరాధించేవారు. వారు అల్లాహ్ తరపు నుంచి దైవప్రవక్తగా ఎన్నుకోబడిన తరువాత మానవులకు అల్లాహ్ ఆదేశాలను ప్రకటించడం మరియు సరైన జీవితాన్ని గడిపేందుకు ప్రణాళికను బోధించడం మొదలు పెట్టారు. అప్పటి సమాజం నిత్యం అవకతవకలతో, యుద్ధాలతో, పొట్లాటలతో కూడి ఉండేది. వాళ్ల బుద్ధిపై అపవిశ్వాసాలు, కట్టు కథలు అధికారం చెలాయించేవి.
దైవప్రవక్త(స.అ) తమ దౌత్యాన్ని ప్రకటించారు. దాన్ని నిరూపించడానికి ఎన్నో అద్భుతాలను ప్రదర్శించారు. ఆ అద్భుతాలలో చాలా ముఖ్యమైన మరియు ఇప్పటికీ కూడా వారు అల్లాహ్ తరపు నుంచి అవతరించబడిన ప్రవక్త అని నిదర్శించేటువంటి అద్భుతం అది. అది వారి యొక్క నిత్య అద్భుతం, అదే “ఖుర్ఆన్ మజీద్” ఇప్పటికీ కూడా దాని కాంతితో సమాజాన్ని రుజుమార్గం చూపుతుంది. దానిని అనుసరించేవారి హృదయాలను కాంతిపజేస్తుంది.
ఖుర్ఆన్ ఇప్పుడు కూడా గట్టిగా ఇలా చెబుతుంది: “నన్ను తీసుకొచ్చినవాడు, ఒక సాధారణ వ్యక్తి కాదు; నేను అతడి ఆలోచనల ద్వార సృష్టించబడిన దాన్ని కాదు. నన్ను తీసుకొచ్చినవాడు అవతలి లోకం మరియు సృష్టికర్తతో సంబంధం కలిగివుండేవాడు. అల్లాహ్ అతడిని మానవాళి మార్గదర్శకం కోసం అవతరింబజేశాడు”
దైవప్రవక్త(స.అ) ఇలా చెప్పేవారు: “ప్రజలారా! నేను అల్లాహ్ తరపు నుంచి ప్రవక్తగా ఎన్నుకోబడ్డాను; ఈ ఖుర్ఆన్ నా దౌత్యం పట్ల నిత్యఆధారం. ఒకవేళ నేను చెప్పే దానిలో మీకు సందేహం ఉంటే, మీరందరూ ఏకమై ఒకరికొకరు సహాయం పడి, కలిసికట్టుగా ఈ ఖుర్ఆన్ యొక్క సూరహ్ లలో నుంచి ఒక్క సూరహ్ లాంటిది ప్రదర్శించండి. ఒకవేళ మీర జయించి, నాతో సమానం అయినట్లైతే అప్పుడు మీరు నా దౌత్యాన్ని అంగీకరించన వసరం లేదు. అదే ఒకవేళ సాధించలేకపోతే –సమస్యే లేదు– తెలుసుకోండి నేను అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క సృష్టికి మధ్యవర్తిని అని. మిమ్మల్ని మంచి భాగ్యం మరియు పరిపూర్ణత్వానికి చేర్చేందుకు ఆయన తరపు నుంచి అవతరించబడిన ప్రవక్తను అని”

దైవప్రవక్త ముహమ్మద్(స.అ) రబీవుల్ అవ్వల్ మాసం, “ఆముల్ ఫీల్”,  క్రి.శ 570 మక్కాలో జన్మించారు. తండ్రి అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్దుల్ ముతల్లిబ్, తల్లి ఆమినహ్ బింతె వహబ్. దైవప్రవక్త(స.అ) జన్మించక ముందే వారి తండ్రి మరణించారు, అందువల్ల వారి పోషిణ బాధ్యతలు వారి తాతయ్య అబ్దుల్ ముతల్లిబ్ చేపట్టారు. కొన్ని సంవత్సరాల తరువాత అబ్దుల్ ముతల్లిబ్ మరణాంతరం, హజ్రత్ ముహమ్మద్(స.అ) యొక్క పినతండ్రి అయిన అబూతాలిబ్[1] వారి పాలన బాధ్యత తీసుకున్నారు.[2]

రిఫరెన్స్
1. జనాబె అబ్దుల్లా(అ.స) తమ్ముడు.
2. సీరయె పీష్వాయాన్, మహ్దీ పీష్వాయీ, మొదటి భాగం, మొదిటి అధ్యాయం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15